Home /News /crime /

MEDICAL SHOP OWNER HACKED TO DEATH OVER EXTRA MARITAL AFFAIR IN NORTH 24 PARGANAS DISTRICT SU

భార్యతో మెడికల్ షాప్ ఓనర్ రాసలీలలు.. భర్తకు తెలిసిన అసలు విషయం.. మార్కెట్‌లో అందరి ముందే..

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

శ్రీకృష్ణాపూర్ ప్రాంతానికి చెందిన మిలాన్ ఘోష్ మెడికల్ షాప్ ఉంది. అయితే అతడు తమ ఇంటికి సమీపంలో ఉండే అపు కహార్ అనే వ్యక్తి భార్యతో వివాహేతర సంబంధం పెట్టుకున్నాడు.

    ఓ మహిళ మెడికల్ షాప్ ఓనర్‌తో వివాహేతర సంబంధం పెట్టుకుంది. ఈ విషయం కాస్తా ఆమె భర్తకు తెలిసిపోయింది. దీంతో అతడు మెడికల్ షాప్ ‌ఓనర్‌కు వార్నింగ్ ఇచ్చాడు. అయితే ఎన్నిసార్లు చెప్పిన మెడికల్ షాప్ ఓనర్ తన మాట వినకపోకపోవడంతో.. అతడిని హత్య చేశాడు. మార్కెట్‌లో అందరి ముందే ఈ దారుణానికి ఒడిగట్టాడు. ఈ ఘటన పశ్చిమ బెంగాల్‌లోని నార్త్ 24 పరగణాల జిల్లాలోని అశోకేన్ నగర్‌లో శుక్రవారం చోటుచేసుకుంది. వివరాలు.. శ్రీకృష్ణాపూర్ ప్రాంతానికి చెందిన మిలాన్ ఘోష్ మెడికల్ షాప్ ఉంది. అయితే అతడు తమ ఇంటికి సమీపంలో ఉండే అపు కహార్ అనే వ్యక్తి భార్యతో వివాహేతర సంబంధం పెట్టుకున్నాడు. ఈ విషయం కాస్తా కహార్‌కు తెలియడంతో.. అతడు మిలాన్‌ను హెచ్చరించాడు. తన భార్యకు దూరంగా ఉండాలని, లేకుంటే తీవ్ర పరిణామాలు ఎదుర్కొవాల్సి ఉంటుందని బెదిరింపులకు పాల్పడ్డాడు. అయితే మిలాన్ అతడి మాటలు పట్టించుకోలేదు. కహార్ లేని సమయంలో అతడి భార్యతో రాసలీలలు కొనసాగిస్తూ వచ్చాడు.

    ఈ క్రమంలోనే కహార్.. మిలాన్‌పై కోపాన్ని పెంచుకున్నాడు. అతడి చంపాలనే నిర్ణయానికి వచ్చాడు. ఈ క్రమంలోనే నోట్నీ మార్కెట్‌లో షాపింగ్ చేస్తుండగా మిలాన్‌పై కహార్ దాడి చేశాడు. దీంతో మిలాన్ తీవ్రంగా గాయపడ్డాడు. అతని వెంటనే స్థానికులు ఆస్పత్రికి తరలించారు. అయితే అక్కడ చికిత్స పొందుతూ మిలాన్ మరణించాడు.

    ఇవి కూడా చదవండి: పెళ్లి జరిగిన కొన్ని నెలలకే భర్తకు ప్రమోషన్.. అలా జరిగినందుకు ఆనంద పడకుండా..

    Crime News: పని కోసం బయటకు వెళ్లిన భర్త.. ఇంట్లో ఉన్న భార్య ఎంత పని చేసిందంటే..

    Shocking: నైట్ డ్యూటీలో భార్య.. అందుకోసమని మరదలిని ఇంటికి తీసుకెళ్లిన బావ.. చివరకు షాకింగ్ సీన్..

    మరోవైపు మిలాన్‌పై దాడి చేసిన కహార్‌ను మార్కెట్‌లోని జనాలు చితకబాదారు. అనంతరం అతడిని పోలీసులకు అప్పగించారు. స్థానికుల దాడిలో గాయాలు కావడంతో కహార్‌ను ఆస్పత్రిలో చేర్పించి చికిత్స అందిస్తున్నారు.
    Published by:Sumanth Kanukula
    First published:

    Tags: Crime news, Extra marital affair, West Bengal

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు