Home /News /crime /

MEDICAL NEGLIGENCE UP CONSUMER PANEL ASKS DOCTOR TO PAY OVER 45 LAKH RUPEES FINE PVN

Medical Negligence : మహిళకు ప్రసవం చేసిన డాక్టర్..కానీ పొట్టలో అది వదిలేసి కుట్టేసింది..చివరికి

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

Punishment For Doctor : డాక్టర్ ఆమెను గోరఖ్​ పుర్ సావిత్రి హాస్పిటల్ వెళ్లాలని సూచించారు. దీంతో గోరఖ్​ పుర్ హాస్పిటల్ లో టెస్ట్ లు చేయించుకుంది సుశీలకి మైండ్ బ్లాక్ అయ్యే విషయం చెప్పారు డాక్టర్లు.

Doctor Negligence : ఓ డాక్టర్ నిర్లక్ష్యంపై ఉత్తరప్రదేశ్(UTTARPRADESH)రాష్ట్ర వినియోగదారుల వివాదాల పరిష్కారాల కమిషన్ కొరడా ఝుళిపించింది. ఓ పేషెంట్ పట్ల నిర్లక్ష్యంగా వ్యవహించారని పేర్కొంటూ.. ఓ డాక్టర్(DOCTOR) కి రూ. 45 లక్షల జరిమానా విధించింది. 2020 మే కోవిడ్ లాక్ డౌన్ కొనసాగుతున్న సమయం. యూపీలోని జుడాచ్​ప్రాలోని నిర్మల్ పత్తి గ్రామంలో నివాసముండే వినోద్ శర్మ భార్య సుశీలా శర్మ తొలి కాన్పు కోసం పద్రౌనా కిషి నగర్​ లోని కసయా రోడ్ లో ఉన్న శ్రీజన్ హాస్పిటల్ లో చేరింది. 2020 మే 25న ఆపరేషన్ జరిగింది. పండంటి బిడ్డకు సుశీల జన్మనిచ్చింది. ట్రీట్మెట్ కోసం రూ.40 వేలు ఖర్చయ్యాయి. మే 31న హాస్పిటల్ నుంచి సుశీల డిశ్చార్జ్ అయింది. అయితే, ఇంటికి వెళ్లిన తర్వాత సుశీలకు కడుపు నొప్పి ప్రారంభమైంది. మొదట్లో..అదే తగ్గిపోతుందిలే అని భావించిన సుశీలకు..నొప్పి తీవ్తతరం కావడంతో ఇక లాభం లేదని భావించి జూన్ నెలలో హాస్పిటల్ కి వెళ్లి చెకప్ చేయించుకుంది.

అయితే అక్కడి డాక్టర్ ఆమెను గోరఖ్​ పుర్ సావిత్రి హాస్పిటల్ వెళ్లాలని సూచించారు. దీంతో గోరఖ్​ పుర్ హాస్పిటల్ లో టెస్ట్ లు చేయించుకుంది సుశీలకి మైండ్ బ్లాక్ అయ్యే విషయం చెప్పారు డాక్టర్లు. మీ కడుపుతో ఓ కాటన్ ప్యాడ్ ఉంది అని డాక్టర్లు చెప్పిన మాటలు విని సుశీల షాక్ అయింది. ఓరి భగవంతుడా..ఏంటయ్యా ఇదంతా అని కన్నీళ్లు పెట్టుకుంది. అయితే ఆపరేషన్ చేసి కడుపులోని ఆ కాటన్ ప్యాడ్ ను తీసివేస్తామని చెప్పడంతో ఆపరేషన్ కి రెడీ అయింది. ఆపరేషన్ చేసిన డాక్టర్లు..సుశీల కడుపులోని కాటన్ ప్యాడ్ ను తొలగించారు.

ALSO READ WHO చీఫ్ కి కొత్త పేరు పెట్టిన మోదీ..గుజరాతీ భాషలో టెడ్రోస్ పేరు

కోలుకున్న తర్వాత తనకు ప్రసవం చేసిన డాక్టర్ అమృతా రాయ్ జిల్లా వివాద పరిష్కార కమిషన్​లో కేసు దాఖలు చేసింది. రూ.15.39 లక్షల పరిహారం అందజేయాలని కోరింది. విచారణ జరిపిన కమిషన్ సభ్యురాలు జస్టిస్ రాజేంద్ర సింగ్..సుశీల విషయంలో మెడికల్ నిర్లక్ష్యం(MEDICAL NEGLIGENCE) జరిగినట్లు తేల్చింది. సుశీలకు ప్రసవం చేసిన డాక్టర్ అమృతా రాయ్ చేసింది పూర్తిగా నిర్లక్ష్యం కిందకే వస్తుందని జస్టిస్ రాజేంద్ర సింగ్ పేర్కొన్నారు. దీంతో లేడీ డాక్టర్ అమృతా రాయ్ ను దోషిగా తేల్చి 45 లక్షల 39 వేల 752 రూపాయలు జరిమానా విధించింది. తీర్పు వెలువరంచిన రోజు నుంచి 60 రోజుల్లోగా జరిమానాను చెల్లించాలని  ఆ డాక్టర్ ని ఆదేశించింది.
Published by:Venkaiah Naidu
First published:

ఉత్తమ కథలు

తదుపరి వార్తలు