• HOME
  • »
  • NEWS
  • »
  • CRIME
  • »
  • MEDAK SP CHANDANA DEEPTI REVEALS REASON ABOUT ATTACK ON WOMAN BA

మెదక్ జిల్లాలో మహిళపై ‘యాసిడ్ దాడి’ కేసులో మలుపు.. అసలు జరిగింది ఇదీ.. వెల్లడించిన ఎస్పీ

మెదక్ జిల్లాలో మహిళపై ‘యాసిడ్ దాడి’ కేసులో మలుపు.. అసలు జరిగింది ఇదీ.. వెల్లడించిన ఎస్పీ

File Photo: చందన దీప్తి, మెదక్ ఎస్పీ

తెలంగాణలోని మెదక్ జిల్లాలో అర్ధరాత్రి మహిళపై యాసిడ్ దాడి జరిగిందనే వార్త సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. ఈ కేసుకు సంబంధించిన కీలక వివరాలను జిల్లా ఎస్పీ చందన దీప్తి మీడియాకు వివరించారు.

  • Share this:
    తెలంగాణలోని మెదక్ జిల్లాలో అర్ధరాత్రి మహిళపై యాసిడ్ దాడి జరిగిందనే వార్త సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. ఈ కేసుకు సంబంధించిన కీలక వివరాలను జిల్లా ఎస్పీ చందన దీప్తి మీడియాకు వివరించారు. మహిళపై యాసిడ్ దాడి జరగలేదని ఆమె స్పష్టం చేశారు. అయితే, ఆమెపై దాడి జరిగిందన్నారు. మహిళపై దాడి చేసిన వ్యక్తిని తాము అదుపులోకి తీసుకున్నట్టు చెప్పారు. ఆ మహిళకు, దాడి చేసిన వ్యక్తికి మధ్య డబ్బుల విషయంలో వివాదాలు ఉన్నాయని తెలిపారు. దానికి సంబంధించి ఘర్షణ తలెత్తడంతో మహిళపై పెట్రోల్ పోసి నిప్పంటించారని ఎస్పీ దీప్తి వెల్లడించారు. నిందితుడిపై గతంలోనూ పలు కేసులు ఉన్నాయని చెప్పారు.

    అసలు ఏం జరిగింది?
    టేక్మాల్ మండ‌లం అంతాయిప‌ల్లి తండాకు చెందిన చత్రుభాయ్‌పై(40) కొందరు గుర్తుతెలియని వ్యక్తులు రాత్రి సమయంలో దాడి చేశారు. మార్కెట్‌కు వెళ్లి వస్తున్న సమయంలో అల్లదుర్గ్ మండలం గడిషెడ్డపుర్ వద్ద ఆమెను అడ్డుకుని యాసిడ్‌ పోశారని వార్తలు వచ్చాయి. అనంతరం వారు అక్కడి నుంచి పరారయ్యారు. అయితే తెల్లవారుజాము వరకు ఆమెను ఎవరూ గుర్తించకపోవడంతో.. ఆమె అక్కడే పడి ఉంది. ఇక, తెల్లవారుజామున ఆమెను గుర్తించిన స్థానికులు.. బంధువుల సహాయంతో ఆమెను జోగిపేట ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. అనంతరం అక్కడి నుంచి సంగారెడ్డి ప్రభుత్వ హాస్పిటల్‌కు తరలించారు. అయితే పరిస్థితి విషమంగా ఉండటంతో హైదరాబాద్‌లోని ఉస్మానియా ఆస్పత్రికి షిఫ్ట్ చేశారు. అయితే ప్రస్తుతం ఆమె పరస్థితి విషమంగా ఉన్నట్టుగా తెలుస్తోంది. ఇక, ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. తాజాగా నిందితుడిని పట్టుకున్నారు. అతడిని విచారించగా, యాసిడ్ దాడి చేయలేదని, పెట్రోల్ పోసి నిప్పంటించారని చెప్పారు.
    Published by:Ashok Kumar Bonepalli
    First published: