బాత్రూమ్‌లో మహిళలు.. బెడ్‌రూమ్‌లో శృంగారాలను చూసి ‘తృప్తి’ పడుతున్న యువకుడు...

ప్రతీకాత్మక చిత్రం

మెకానిక్‌గా పనిచేసే కనకరాజ్.. ఇలా బాత్రూమ్‌లో దుస్తులు మార్చుకుంటూ ఉండగా, బెడ్‌రూమ్‌లో తమ భర్తతో శృంగారంలో ఉండగా చూసి తాను ‘తృప్తి’ పడుతున్నట్టు చెప్పాడు.

 • Share this:
  మహిళలు దుస్తులు మార్చుకుంటుంటే బాత్రూమ్ కిటికీలు, ఇంటి బెడ్రూమ్ కిటికీల్లో నుంచి తొంగి చూస్తున్న ఓ యువకుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. సుమారు ఆరు నెలలుగా అతడు ఇలాంటి పనులు చేస్తున్నట్టు గుర్తించారు. బెంగళూరులోని శాంతినగర్‌లో ఈ ఘటన జరిగింది. అయితే, అతడిని పట్టుకోవడానికి మహిళలు ఓ సినిమాకు రాసుకున్నంత స్క్రీన్ ప్లే రాశారు. తాము బాత్రూమ్‌లో ఉండగా రెండు కళ్లు తమను చూస్తున్నట్టు కాలనీలో కొందరు మహిళలకు అనుమానం వచ్చింది. ఆ విషయం ఆడవారి ముచ్చట్లలో బయటపడింది. దీంతో ఆ రెండు కళ్లను పట్టుకోవడానికి రెడీ అయ్యారు. ఓ వాట్సాప్ గ్రూప్ క్రియేట్ చేశారు. అందులో కాలనీలోని మహిళలు అందరూ జాయిన్ అయ్యారు. పోలీసులను కూడా ఆ గ్రూప్‌లో చేర్చారు. ఈ క్రమంలో ఆదివారం రాత్రి 10 గంటల తర్వాత ఓ మహిళ తన బెడ్రూమ్‌లో ఉండగా కిటికీలో నుంచి ఓ వ్యక్తి గమనిస్తున్నట్టు గుర్తించింది. వెంటనే అలర్ట్ అయింది. ఆ ఒంటరి మహిళ ఈ విషయాన్ని వెంటనే తమ వాట్సాప్ గ్రూప్‌లో పోస్ట్ చేసింది. దీంతో ఆమె ఇంటి ఇరుగుపొరుగున ఉండే మహిళలు... నిందితుడిని పట్టుకునేందుకు కొంగు బిగించారు. రాత్రి పూట 10.30 గంటల సమయంలో అతడిని వెంబడించారు. ఆ కాలనీలో నుంచి పారిపోతున్న వ్యక్తిని పట్టుకున్నారు. అదే సమయంలో పోలీసులు కూడా వచ్చేశారు. నిందితుడిని అరెస్ట్ చేశారు.

  ఆరు నెలలుగా ఆడవారిని ఇబ్బంది పెడుతున్న వ్యక్తిని కనకరాజ్ (28)గా గుర్తించారు. స్థానికంగా కేఎస్ గార్డెన్‌కు చెందిన వాడని తేల్చారు. మెకానిక్‌గా పనిచేసే కనకరాజ్.. ఇలా బాత్రూమ్‌లో దుస్తులు మార్చుకుంటూ ఉండగా, బెడ్‌రూమ్‌లో తమ భర్తతో శృంగారంలో ఉండగా చూసి తాను ‘తృప్తి’ పడుతున్నట్టు పోలీసులకు చెప్పాడు.

  PICS : జగన్ ఫొటోకు జనసేన ఎమ్మెల్యే పాలాభిషేకం

  Published by:Ashok Kumar Bonepalli
  First published: