హోమ్ /వార్తలు /క్రైమ్ /

షాకింగ్... పవిత్రమైన ఆలయంలో మాంసం ముద్దలు... అసలేం జరిగిందంటే..

షాకింగ్... పవిత్రమైన ఆలయంలో మాంసం ముద్దలు... అసలేం జరిగిందంటే..

అప్రమత్తమైన అధికారులు

అప్రమత్తమైన అధికారులు

Uttar pradesh: పూజారీ తెల్లవారు జామున ఆలయాన్నితెరిచి చూశాడు. అప్పుడు గర్భాలయంలో ఏవో ముద్దలుగా కన్పించాయి. వెంటనే దగ్గరకు వెళ్లి చూశాడు. అక్కడ చుట్టు పక్కల ప్రాంతంలో మాంసం ముద్దలు పడిఉన్నాయి.

కొంత మంది ఆకతాయిలు ఒక వర్గం మనో భావాలను దెబ్బతీసేందుకు ప్రయత్నిస్తుంటారు. దీని కోసం.. వారు పవిత్రంగా భావించే ప్రదేశాలను అపవిత్రం చేస్తుంటారు. ప్రధానంగా దుండగులు.. వారి స్వార్థపూరితమైన పనుల కోసం జనాలల్లో గొడవలు రెకెత్తిస్తుంటారు. దీంతో ఇరు వర్గాల మధ్య గొడవలు జరుగుతాయి. ఇలాంటి ఘటన వార్తలలో నిలిచింది.

పూర్తి వివరాలు.. ఉత్తర ప్రదేశ్ (Uttar pradesh) షాకింగ్ ఘటన జరిగింది. రసూలాబాద్ గ్రామంలోని ఉన్న ఆలయంలో కొంత మంది దుండగులు నీచానికి పాల్పడ్డారు. మాంసపు ముద్దలను గ్రామ దేవత ఆలయంలో విసిరారు. ఈ క్రమంలో.. ఉదయాన్నే.. ఆలయం తెరచిన పూజారీ జగదీష్ జాతవ్.. గర్బగుడి ప్రాంతంలో మాంసపు ముద్దలు ఉండటాన్ని గమనించాడు. వెంటనే స్థానికులకు సమాచారం ఇచ్చారు.

దీంతో అక్కడి ప్రజలు ఆగ్రహంతో ఊరిపోయారు. ఆలయంలో సమీపంలో ఉన్న మూడు చికెన్ షాపులపై దాడులుచేసి మంట పెట్టారు. ఆలయ సిబ్బంది.. ఆలయంలో పడిన మాంసపు ముద్దలను శుభ్రం చేశారు. ఆలయమంతట శుద్ధి కార్యక్రమం చేపట్టారు. ప్రస్తుతం ఆ ప్రాంతంలో పోలీసులు అదనపు బలగాలను మోహరించారు.

ఇదిలా ఉండగా  ఉత్తర ప్రదేశ్ లో (Uttar pradesh) దారుణమైన ఉదంతం వెలుగులోనికి వచ్చింది.

బదౌన్ లో జూలై 12 న జరిగిన సంఘటన ఆలస్యంగా బయటకు వచ్చింది. పోలీసుల ప్రకారం... బదౌన్ గ్రామంలోని ఫైజ్ గంజ్ పోలీస్ స్టేషన్ పరిధిలో.. ఒక జంట ఉండేవారు. వీరి ఇంటి పక్కన బాలిక ఉంటుంది. తెలిసిన వారే కావడంతో తరచుగా వీరి ఇంటికి వెళ్తుంది. ఈ క్రమంలో.. మహిళ భర్త.. బాలికపై పడింది. ఆమెను అత్యాచారం చేయాలనుకున్నాడు. ఒక రోజు.. భార్యతో బాలికను ఇంటికి పిలిపించుకున్నాడు. ఆమెను గదిలో బంధించి అత్యాచారంచేశాడు. భర్త.. బాలికను అత్యాచారం చేస్తుండగా.. భార్య పక్కనే ఉండి రికార్డు చేసింది.

ఆ తర్వాత.. విషయాన్ని ఎవరికైన చెబితే.. వీడియో (Video) సోషల్ మీడియాలో అప్ లోడ్ చేస్తామని బెదిరించారు. కొన్ని రోజుల తర్వాత... నిందితులు చెప్పినట్లుగానే వీడియోను ఇంటర్నేట్ లో (Social media)  అప్ లోడ్ చేశారు. దీంతో బాలిక.. భయపడిపోయింది. తన ఇంటికి వెళ్లిపోయింది. కొన్ని రోజులుగా బాలిక ప్రవర్తనలో మార్పులు ఉండటంతో తల్లిదండ్రులు గట్టిగా నిలదీయడంతో జరిగిన దారుణం బయట పడింది. దీంతో బాధిత కుటుంబం పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈమేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు భార్యభర్తలిద్దరిని అరెస్టు చేశారు. బాలికను టెస్ట్ ల కోసం ఆస్పత్రికి తరలించారు.

First published:

Tags: Crime news, Uttar pradesh

ఉత్తమ కథలు