Home /News /crime /

రైల్వేస్టేషన్ వద్ద వారిద్దరు మాట్లాడుకుంటూ వెళ్తున్నారు.. వారిని ప్రేమికులు అనుకున్నారు.. కానీ ఇంతలోనే..

రైల్వేస్టేషన్ వద్ద వారిద్దరు మాట్లాడుకుంటూ వెళ్తున్నారు.. వారిని ప్రేమికులు అనుకున్నారు.. కానీ ఇంతలోనే..

నిందితుడిని అదుపులోకి తీసుకున్న పోలీసులు

నిందితుడిని అదుపులోకి తీసుకున్న పోలీసులు

అది చెన్నైలోని తాంబరం రైల్వే స్టేషన్‌. నిత్యం అక్కడకి వందలాది ప్రయాణికులు వస్తుంటారు. దానికి దగ్గర్లోని బీజీ రోడ్డు ఉంది. ఓ రోజు మధ్యాహ్నం ఇద్దరు 25 ఏళ్ల యువతి, 20 ఏళ్ల యువకుడు మాట్లాడుకుంటూ వెళ్తున్నారు. స్టేషన్ కు వచ్చిన వారంతా చూస్తుండగానే అతడు ఆమెను కత్తితీసుకొని గొంతులో పొడిచేశాడు. పూర్తి వివరాల్లోకి వెళ్తే..

ఇంకా చదవండి ...
  అది చెన్నై(Chennai) లోని తాంబరం(Thambaram) రైల్వే స్టేషన్‌(Railway Station). నిత్యం అక్కడకి వందలాది ప్రయాణికులు(Passengers) వస్తుంటారు. దానికి దగ్గర్లోని బీజీ రోడ్డు ఉంది. ఓ రోజు మధ్యాహ్నం ఇద్దరు 20 ఏళ్ల యువతి, 25 ఏళ్ల యువకుడు మాట్లాడుకుంటూ వెళ్తున్నారు. స్టేషన్ కు వచ్చిన వారంతా చూస్తుండగానే అతడు ఆమెను కత్తితీసుకొని గొంతులో పొడిచేశాడు. అనంతరం అతడు కూడా ఆత్మహత్యాయత్నం చేస్తుండగా.. అప్రమత్తమైన అక్కడకు వచ్చిన ప్రయాణికులు అతడి ప్రయత్నాన్ని ఆపారు. వెంటనే పోలీసులకు ఫోన్ చేశారు. బాధిత మహిళను ఆసుపత్రికి తీసుకెళ్లగా ఆమె అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు.

  Crime News: హయత్ నగర్ లో దారుణం.. భార్య శవాన్ని దుప్పటిలో చుట్టి.. చివరకు..


  పోలీసులు నిందితుడిని అరెస్టు చేశారు. అసలేమైందో వివరంగా తెలుసుకుందాం.. అది మిట్ట మధ్యాహ్నం.. తాంబరం రైల్వే స్టేషన్‌ దగ్గర్లోని బీజీ రోడ్డు వద్ద ఇద్దరు ప్రేమికులు మాట్లాడుకుంటూ.. నడుచుకుంటూ వెళ్తున్నారు.
  అందులో 25 ఏళ్ల యువకుడి పేరు రామచంద్రన్. ఇతడు తమిళనాడులోని నాగపట్టణం జిల్లా తిరుక్కువలైకు చెందిన వాడు. అతడు చెన్నైలోన చెంగల్ పట్టులోని ఓ కార్ల తయారీ సంస్థలో పని చేస్తున్నాడు. 20 ఏళ్ల యువతి పేరు శ్వేత. మద్రాస్ క్రిస్టియన్ కాలేజీ (MCC), స్కూల్ ఆఫ్ కంటిన్యూయింగ్ ఎడ్యుకేషన్‌లో డిప్లొమా ఇన్ మెడికల్ లాబొరేటరీ టెక్నాలజీ (DMLT) ద్వితీయ సంవత్సరం చదువుతోంది.

  అతడి వద్ద సెక్రటరీగా ఆమె పని చేస్తుంది.. పని ఉందంటూ ప్లాట్ కు రప్పించుకున్నాడు యజమాని.. చివరకు ఇలా జరిగింది..


  చెన్నైలోని క్రోమ్‌పేట్‌లో నివాసం ఉంటుంది. వీరిద్దరికి మూడేళ్ల క్రితం నుంచే పరిచయం ఉంది. ఓ రోజు ఆ యువతికి రామచంద్రన్ ఫోన్ చేసి తాంబర్ రైల్వే స్టేషన్ దగ్గరకు పిలిచాడు. అక్కడికి వచ్చి అతడితో ఆమె మాట్లాడింది. వారిద్దరూ తాంబరంలోని రైల్వే క్వార్టర్స్ దగ్గర సంభాషిస్తూ .. వాకింగ్ చేస్తూ కనిపించారు. అక్కడ ఉన్న వారంతా వాళ్లు ప్రేమికులేమో అనుకున్నారు. కొద్దిసేపటికి వారిద్దరి మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. అక్కడ ఉన్న ప్రయాణికులు చూస్తుండగానే.. వాదన మరింత పెరిగింది. తర్వాత రామచంద్రన్ తన జేబులో ఉన్న కత్తి తీసి యువతి గొంతులోకి దింపాడు.

  Hyderabad Crime: హైదరాబాద్ లో మరో దారుణం.. దుకాణం షెట్టర్‎లోకి తీసుకెళ్లి బాలికపై అత్యాచారయత్నం..


  తర్వాత రామచంద్రన్ తన గొంతును కోసుకునేందుకు ప్రయత్నించగా.. ప్రయాణికులు అడ్డుకున్నారని పోలీసులు తెలిపారు. తీవ్ర రక్తస్రావంతో ఉన్న శ్వేతను క్రోంపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించినప్పటికీ, ఆమె మరణించినట్లు వైద్యులు ప్రకటించారు. అతడిని అదుపులోకి తీసుకున్న పోలీసులు రామచంద్రన్ ఆత్మహత్యాయత్నం సమయంలో గాయాలైన కారణంగా.. అతడిని రాజీవ్ గాంధీ ప్రభుత్వ ఆసుపత్రిలో చేరారు. అక్కడే అతడు ప్రస్తుతం చికిత్స పొందుతున్నారని పోలీసులు తెలిపారు. ఈ ఘటనపై సెలయ్యూరు పోలీసులు కేసు నమోదు చేసి తదుపరి విచారణ ప్రారంభించారు.

  Blood Donation: రక్తదానం చేస్తే ‘బరువు’ తగ్గుతారా.. నిపుణులు ఏమంటున్నారంటే..


  ఇదిలా ఉండగా, గత ఆరు సంవత్సరాలలో చెన్నై నగరం మరియు శివారు ప్రాంతాల్లో జరిగిన మూడో సంఘటన ఇది. జూన్ 2019 లో, 27 ఏళ్ల ఈరోడ్ వ్యక్తి చెట్‌పేట రైల్వే స్టేషన్‌లో మహిళను హత్య చేయడానికి ప్రయత్నించాడు. బాలిక ప్రాణాలతో బయటపడినప్పటికీ, ఆమెకు తీవ్ర గాయాలయ్యాయి. జూన్ 2016 లో నుంగంబాక్కం రైల్వే స్టేషన్‌లో పట్టపగలు జరిగిన మరో సంఘటనలో పి స్వాతి (24) అనే వ్యక్తిని పి పి రామ్‌కుమార్ నరికి చంపాడు. ఇలా వరసు హత్యలు జరుగుతుండటంతో స్థానికులు భయాందోళనకు గురవుతున్నారు.
  Published by:Veera Babu
  First published:

  Tags: Chennai, Crime, Crime news

  ఉత్తమ కథలు

  తదుపరి వార్తలు