Home /News /crime /

MBBS DOCTOR FROM BIHAR NALANDA DISTRICT APPILED PRESSURE ON HIS WIFE TO HAVE PHYSICAL RELATION WITH HIS FRIEND AND THEN THIS HAPPEND SRD

వీడు భర్త లేక పశువా..! స్నేహితుడితో కలిసి పాడుపని చేయమని భార్యపై బత్తిడి.. ఆమె మాట వినలేదని..

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

వివాహం అనే పవిత్ర బంధానికి ఏమాత్రం విలువ ఇవ్వకుండా పర స్త్రీ, పర పురుషుడి వ్యామోహంలో పడి కొందరు బంగారం లాంటి కాపురాలను నాశనం చేసుకుంటున్నారు.

    ప్రస్తుత సమాజంలో వివాహేతర సంబంధాలు రోజుకు ఎన్నో వెలుగుచూస్తున్నాయి. ఈ ధోరణి రోజురోజుకూ పెరిగిపోతుండటం ఆందోళన కలిగించే విషయం. వివాహం అనే పవిత్ర బంధానికి ఏమాత్రం విలువ ఇవ్వకుండా పర స్త్రీ, పర పురుషుడి వ్యామోహంలో పడి కొందరు బంగారం లాంటి కాపురాలను నాశనం చేసుకుంటున్నారు. అంతేగాక శారీరక అవసరాల కోసం మూడు ముళ్ల బంధాన్ని అవిచ్ఛిన్నం చేసుకుంటున్నారు. బీహార్ లోని ఓ డాక్టర్ నర్సుతో వివాహేతర సంబంధం పెట్టుకుని ఎంతకీ దిగజారడంటే పశువు కన్నా హీనంగా ప్రవర్తించాడు. అసలు వివరాల్లోకెళితే.. వారిద్దరికీ 15 ఏళ్ల క్రితం వివాహం జరిగింది.. ఇద్దరు కొడుకులు కూడా ఉన్నారు.. వివాహం తర్వాత వైద్య వృత్తి సంపాదించిన ఆ భర్త తన దగ్గర పనిచేసే నర్సుతో వివాహేతర సంబంధం పెట్టుకున్నాడు. తన భార్యను ఎలాగైనా వదిలించుకోవాలని కుట్రలు పన్నాడు. విడాకులు ఇవ్వాలని భార్యను కోరాడు. అయితే విడాకులు ఇచ్చేందుకు సదరు మహిళ అంగీకరించ లేదు. దీంతో ఆమెను ఎలాగైనా తన దారికి తెచ్చుకోవాలని భావించాడు. తనలో ఉన్న మృగాన్ని నిద్రలేపాడు. దానికి ఓ పెద్ద స్కెచే వేశాడు. తనతో పాటు ఏడుడగులు నడిచిన భార్య పరువు తీయాలని పరువు తీయాలని భావించాడు. ఇందుకోసం తన స్నేహితుడి సాయం కూడా తీసుకున్నాడు. తన స్నేహితుడిని ఇంటికి తీసుకొచ్చి అతడితో సరసాలాడమంటూ ఒత్తిడి చేశాడు.

    అందుకు ఆమె నిరాకరించంది. ఇలాంటి పని ఎంతమాత్రం సమంజసం కాదని భర్తను వారించంది. భార్య మాటలు వినని భర్త బ్లేడుతో ఆమె గొంతు, చేతులపై కోసేశాడు.. బీహార్‌లోని నలందా ప్రాంతంలో ఈ ఘటన జరిగింది. నలందాకు చెందిన ఓ వైద్యుడు తన భార్యపై పగబట్టాడు. విడాకులు ఇచ్చేందుకు నిరాకరిస్తున్న భార్య పరువు తీయాలనుకున్నాడు. తన స్నేహితుడిని ఇంటికి తీసుకొచ్చి అతడితో లైంగికంగా గడపమని ఒత్తిడి తెచ్చాడు. మొబైల్‌తో ఆ దృశ్యాలను చిత్రీకరించాలనుకున్నాడు. వాటిని బంధువులుకు, కోర్టుకు చూపించి భార్య నుంచి విడాకులు తీసుకోవాలనేది అతడి ప్లాన్. అయితే అందుకు బాధిత మహిళ నిరాకరించింది. దీంతో అతను తన భార్యపై బ్లేడ్‌తో విచక్షణారహితంగా దాడి చేశాడు.

    ఇది కూడా చదవండి : ఫ్యామిలీ అంతా కలిసి భోజనం చేస్తున్నారు... కానీ, ఇంతలోనే ఊహించని షాక్.. ఆ దేవుడే కాపాడాడు..

    చేతులు, గొంతుపై బ్లేడ్‌తో కోసేశాడు. ఇరుగుపొరుగు వారు ఆమెను వెంటనే ఆస్పత్రికి తరలించారు. ప్రాణాపాయ స్థితిలో ఉన్న ఆమెకు వైద్యులు చికిత్స అందిస్తున్నారు. సమాచారం అందుకున్న పోలీసులు బాధిత మహిళ స్టేట్‌మెంట్ తీసుకున్నారు. ఆమె భర్తను, స్నేహితుడిని అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు. ఇక, వివాహేతర సంబంధాల కారణంగా కొందరు తమ జీవితాలను నాశనం చేసుకుంటున్నారు. ఇటీవలి కాలంలో ఈ కేసుల సంఖ్యగా ఎక్కువగా ఉంటుంది. వివాహేతర సంబంధాలు వారి కాపురాలనే కాకుండా, భవిష్యత్తును అంధకారంగా మారుస్తున్నాయి. ముఖ్యంగా వారి పిల్లల భవిష్యత్తుపై తీవ్ర ప్రభావాన్ని చూపుతున్నాయి.
    Published by:Sridhar Reddy
    First published:

    Tags: Bihar, Crime news, Extra marital affair, Illegal affair

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు