Home /News /crime /

MBA STUDENT FOUND DEAD INSIDE HOSTEL IN BHUBANESWAR PROBE BEGINS SSR

Sad: ఎంబీఏ సెకండియర్ చదువుతోంది.. క్యాంపస్ ఇంటర్వ్యూలో ఉద్యోగం వచ్చింది.. ఇంతలో ఏమైందో కానీ..

శుశ్రీ ప్రగ్యామిత సేతి (ఫైల్ ఫొటో)

శుశ్రీ ప్రగ్యామిత సేతి (ఫైల్ ఫొటో)

ఒడిశా రాజధాని నగరం భువనేశ్వర్‌లో విషాద ఘటన చోటుచేసుకుంది. నార్త్ భువనేశ్వర్‌లోని ఓ ప్రైవేట్ కాలేజ్‌లో ఎంబీఏ సెకండియర్ చదువుతున్న ఓ యువతి హాస్టల్ రూమ్‌లో ఉరేసుకున్న స్థితిలో విగత జీవిగా కనిపించిన ఘటన కలకలం రేపింది.

    భువనేశ్వర్: ఒడిశా రాజధాని నగరం భువనేశ్వర్‌లో విషాద ఘటన చోటుచేసుకుంది. నార్త్ భువనేశ్వర్‌లోని ఓ ప్రైవేట్ కాలేజ్‌లో ఎంబీఏ సెకండియర్ చదువుతున్న ఓ యువతి హాస్టల్ రూమ్‌లో ఉరేసుకున్న స్థితిలో విగత జీవిగా కనిపించిన ఘటన కలకలం రేపింది. ఆమెకు ఇటీవలే క్యాంపస్ ఇంటర్వ్యూలో జాబ్ ఆఫర్ కూడా వచ్చినట్లు తెలిసింది. జనవరి 3వ తేదీన ఉద్యోగంలో చేరాల్సి ఉంది. ఇంతలో ఇలా జరగడంతో బాధితురాలి తల్లిదండ్రులు కన్నీరుమున్నీరవుతున్నారు.

    ఇది కూడా చదవండి: Married Woman: ఇద్దరి కులాలు వేరైనా ఒప్పించి పెళ్లి చేసుకున్నారు.. కానీ ఎనిమిది నెలలకే ఇలా జరగడం..

    తనకు ఫోన్ చేసిన సందర్భంలో ఉద్యోగం వచ్చిందని, జనవరి 3న ఉద్యోగంలో చేరాల్సి ఉందని తన కూతురు ఎంతో ఆనందంగా చెప్పిందని.. కానీ ఇంతలో ఇలాంటి కఠిన నిర్ణయం తీసుకోవడం వెనుక కారణం ఏంటో అర్థం కావడం లేదని బాధితురాలి తండ్రి సుధాకర్ సేతి ఆవేదన వ్యక్తం చేశారు.

    ఇది కూడా చదవండి: 23 Year Old: 23 ఏళ్ల వయసులోనే ఎందుకింత వైరాగ్యం.. పాపం.. అతను చివరి క్షణాల్లో రాసిన లెటర్ చదివితే..

    చనిపోయిన యువతిని శుశ్రీ ప్రగ్యామిత సేతిగా పోలీసులు గుర్తించారు. కోరాపుట్‌లో ఆమె కుటుంబం నివాసం ఉంటోంది. చదువు నిమిత్తం ఆమె భువనేశ్వర్‌లోని కాలేజ్ హాస్టల్‌లో ఉంటోంది. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
    Published by:Sambasiva Reddy
    First published:

    Tags: Crime news, Odisha, Student suicide

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు