ర్యాంప్ వాక్ చేస్తు ఎంబీయే స్టూడెంట్ మృతి

ర్యాంప్ వాక్ చేస్తున్న యువతి

ర్యాంప్ వాక్ చేసిన అమ్మాయి.. అనంతరం స్టేజీకి ఓ పక్కన వెళ్లి నిల్చొంది. తర్వాతి అమ్మాయి ర్యాంప్ వాక్ చేస్తుండగా షాలినీ ఒక్కసారిగా కుప్పకూలింది.

  • Share this:
    చిన్నా పెద్ద తేడా లేకుండా ఈ మధ్య గుండె జబ్బులు అందర్నీ కబళిస్తున్నాయి. తాజాగా కార్డియర్ అరెస్ట్ 21ఏళ్ల యువతి మృతిచెందిన ఘటన కర్నాటకలో చోటుచేసుకుంది. ర్యాంప్ వాక్ చేస్తూ ఓ యువతి అక్కడికక్కడే కుప్పకూలింది. వివరాల్లోకి వెళ్తే బెంగుళూరులోని ఓ కాలేజీలో త్వరలో ప్రేషేర్స్ పార్టీ జరగనుంది. దీనికోసం విద్యార్థులు ప్రాక్టీస్ చేస్తున్నారు. అందులో షాలినీ అనే ఎంబీయే ఫస్ట్ ఇయర్ చదువుతున్న యువతి కూడా పాల్గొంది. తన వంతు రాగానే ర్యాంప్ వాక్ చేసిన అమ్మాయి.. అనంతరం స్టేజీకి ఓ పక్కన వెళ్లి నిల్చొంది. తర్వాతి అమ్మాయి ర్యాంప్ వాక్ చేస్తుండగా షాలినీ ఒక్కసారిగా కుప్పకూలింది. నేలపై పడిపోయింది.. దీంతో అక్కడున్న స్నేహితులు వెంటనే గుర్తించి షాలినిని ఆసుపత్రికి తరలించారు. కానీ ఆమె అప్పటికే మృతి చెందినట్లు డాక్టర్లు నిర్ధారించారు. ఈఘటన అక్టోబర్ 18 న జరిగింది.. అయితే షాలిని మృతికి సంబంధించిన వీడియో అక్కడున్న సీసీ ఫుటేజ్‌లో రికార్డ్ అయ్యింది. దీంతో పోలీసులు అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. షాలిని చనిపోవడంతో ఆ కళాశాలలో మరియు ఆమె కుటుంబంలో విషాదఛాయలు అలుముకున్నాయి.

    Published by:Sulthana Begum Shaik
    First published: