ఫ్యాషన్ షోలో విషాదం...ర్యాంప్ వాక్ చేస్తూ స్టూడెంట్ మృతి

ర్యాంప్ వాక్‌లో షాలిని ర్యాంప్ మీదనే స్పృహ కోల్పోయింది. దీంతో ఆమెను వెంటనే ఆసుపత్రికి తరలించగా, ఆమె మార్గమధ్యంలోనే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు.

news18-telugu
Updated: October 19, 2019, 3:12 PM IST
ఫ్యాషన్ షోలో విషాదం...ర్యాంప్ వాక్ చేస్తూ స్టూడెంట్ మృతి
ప్రతీకాత్మక చిత్రం
news18-telugu
Updated: October 19, 2019, 3:12 PM IST
ర్యాంప్ వాక్ చేస్తున్న 21 సంవత్సరాల మోడల్ అకస్మాత్తుగా మృతి చెందిన ఘటన బెంగుళూరులో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే ఎంబీఏ స్టూడెంట్ శాలిని తమ కాలేజీలో ఫ్రెషర్స్ డే సందర్భంగా నిర్వహించిన ఫ్యాషన్ షోలో ఉత్సాహంగా పాల్గొంది. అయితే ఈ సందర్భంగా నిర్వహించిన ర్యాంప్ వాక్‌లో షాలిని ర్యాంప్ మీదనే స్పృహ కోల్పోయింది. దీంతో ఆమెను వెంటనే ఆసుపత్రికి తరలించగా, ఆమె మార్గమధ్యంలోనే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. అయితే అనుమానాస్పదంగా ఉన్న షాలిని మృతి వెనుక అసలు కారణం ఏంటని చూడగా, గుండెపోటు కారణంగానే ఆమె మృతి చెందినట్లు వైద్యులు తేల్చారు. అయితే అంత చిన్నవయస్సులో గుండెపోటు అంటే నమ్మశక్యంగా లేదని ఆమె కుటుంబసభ్యలు ఆరోపిస్తుండగా, పోలీసులు కేసు నమోదు చేసుకొని షాలిని మృతి వెనుక ఉన్న అసలు కారణమేంటో తెలుసుకునే పనిలో పడ్డారు.

First published: October 19, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...