పెళ్లికొడుకును వెతకలేకపోయిన మాట్రిమోనీ ఏజెన్సీ... ఏ శిక్ష పడిందంటే...

Matrimoney Site Case : ఇల్లు కట్టి చూడు పెళ్లి చేసి చూడు అంటారు... నిజమే ఈ రోజుల్లో ఇళ్లూ కట్టుకునే పరిస్థితి లేదు... పెళ్లి చేసే పరిస్థితీ లేదు. సిమెంట్ ధరలు పెరిగి ఇళ్లు కట్టడం కష్టమైపోతుంటే... సరైన జోడీ దొరక్క పెళ్లి సెట్ చెయ్యడం కష్టమైపోతోంది. మరి ఈ కేసులో ఏమైందో తెలుసుకుందాం.

news18-telugu
Updated: October 19, 2019, 10:54 AM IST
పెళ్లికొడుకును వెతకలేకపోయిన మాట్రిమోనీ ఏజెన్సీ... ఏ శిక్ష పడిందంటే...
పెళ్లికొడుకును వెతకలేకపోయిన మాట్రిమోనీ ఏజెన్సీ... ఏ శిక్ష పడిందంటే...
  • Share this:
Matrimoney Website Case : ఛండీగఢ్‌లో జరిగిన సంఘటన ఇది. సురీందర్ పాల్ సింగ్ చాహల్... తన కూతురి కోసం మంచి వరుణ్ని వెతికి పెట్టే మాట్రిమోనీ ఏజెన్సీ కావాలని పేపర్‌లో యాడ్ ఇచ్చాడు. వెంటనే ఓ ఏజెన్సీ సభ్యులు ఆయన ఇంటికి వెళ్లారు. డాక్టరైన మీ అమ్మాయికి సరైన వరుణ్ని వెతికి పెట్టే బాధ్యత మాది అన్నారు. డీల్ కుదిరింది. ఆ ఏజెన్సీకి అగ్రిమెంట్ ప్రకారం సురీందర్ పాల్... రూ.50వేలు ఇచ్చాడు. జాట్ వర్గానికి చెందిన ఆమెను రాయల్ మెంబర్‌ కేటగిరీలో చేర్చారు ఏజెన్సీ ప్రతినిధులు. తమ వెబ్‌సైట్‌లోని ఆమె అకౌంట్‌లో 18 మంది మగాళ్ల ప్రొఫైళ్లను ఎంటర్ చేసిన ఆ ప్రతినిధులు... సరిగ్గా 9 నెలల్లో పెళ్లి కొడుకును సెట్ చేస్తామని అన్నారు. అందుకు ఆమెతోపాటూ... అమె ఫ్యామిలీ సరే అంది.

9 నెలలు అయిపోయాయి. ఒక్క మ్యాచూ సెట్ కాలేదు. ఇచ్చిన మాట తప్పినందుకు తమ డబ్బు తమకు వెనక్కి వడ్డీతో సహా ఇవ్వాలని డిమాండ్ చేశాడు సురీందర్ పాల్. అందుకు ఏజెన్సీ ఒప్పుకోలేదు. డీల్ ప్రకారం... అబ్బాయిల ప్రొఫైల్స్ పంపామనీ, సెట్ చేసుకుంటారో, లేదో మీ ఇష్టం అనీ తేల్చేసింది. అంతేకాదు... తాము కుదుర్చుకునే డీల్ ప్రకారం... 100 శాతం కచ్చితంగా వరుణ్ని చూస్తామని కాదని చెప్పింది. అలా ఎలా కుదురుతుంది అంటూ... సురీందర్ సింగ్... జిల్లా వినియోగదారుల ఫోరంను ఆశ్రయించాడు.

ఫోరం రెండువైపులా వాదనలు వింది. వాయిదాలేవీ వెయ్యకుండా వెంటనే తీర్పు ఇచ్చింది. డీల్ ప్రకారం ఆమెకు వరుణ్ని వెతికి పెట్టలేదు కాబట్టి... ఏజెన్సీదే తప్పని తేల్చింది. పనికిమాలిన ప్రొఫైల్స్ ఇస్తే... సెట్ చేసుకోవాల్సిన ఖర్మ వాళ్లకేంటని ఎదురు ప్రశ్నించింది. సరైన వరుణ్ని చూడాల్సిన బాధ్యత ఏజెన్సీకి ఉందని చెప్పింది. బలవంతంగా సెట్ చేసుకోమని చెప్పడం శారీరక వేధింపులతో సమానమని మండిపడింది. అంతేకాదు... రూ.50వేలు తిరిగి ఇచ్చేసి, వాటికి 9 శాతం వడ్డీ కూడా చెల్లించాలని చెప్పింది. అంతేనా... పరిహారంగా రూ.12వేలు ఇవ్వాలని ఆదేశించింది. ఇందులో బాధితులకు అయిన లీగల్ ఖర్చులు (లాయర్ ఖర్చులు, కోర్టుకు వచ్చేందుకు అయిన ట్రావెలింగ్ ఖర్చులు వంటివి) ఉన్నాయి.

ఫోరం తీర్పు ప్రకారం... ఇప్పుడా ఏజెన్సీ... రూ.50వేలతోపాటూ... వాటిపై 2017 సెప్టెంబర్ 26 నుంచీ 9 శాతం వడ్డీ లెక్కగట్టి ఇవ్వాల్సి ఉంది. అలాగే... పరిహారం కింద రూ.7వేలు, లీగల్ ఖర్చుల కింద రూ.5వేలు చెల్లించనుంది.


Pics : తాగకుండానే కిక్కెక్కిస్తున్న 90ml బ్యూటీ నేహా సోలంకి

ఇవి కూడా చదవండి :

ప్రపంచంలో అత్యంత సైలెంట్ ప్లేస్ ఏది?... వైరల్ వీడియో

Health Tips : కొబ్బరి నీళ్లతో 20 రకాల ప్రయోజనాలు... తాగితే రోగాలు దరిచేరవు

Health Tips : అరటిపండ్లు తింటే బరువు పెరుగుతామా?

Health Tips : సీజనల్ ఫ్రూట్ సీతాఫలం తినండి... ఈ ప్రయోజనాలు పొందండి
Published by: Krishna Kumar N
First published: October 19, 2019, 10:54 AM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading