Home /News /crime /

MATING WITH PILLOW ABUSE BATCHMATE MADHYA PRADESH COLLEGE RAGGING HORROR PAH

ఇదేం హరాస్ మెంట్ భయ్యా.. సహా విద్యార్థులు.. పిల్లోతో శృంగారం చేయాలంటూ..

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

Madhyar pradesh: సీనియర్ స్టూడెంట్స్ బరితెగించి ప్రవర్తించారు. పిల్లోతో శృంగారం చేయాలంటూ జూనియర్ లను భయభ్రాంతులకు గురిచేశారు. అంతే కాకుండా.. కండోమ్ లు ధరించి, తోటి విద్యార్థులతో..

కొన్ని చోట్ల సీనియర్ విద్యార్థులు హద్దులు దాటి ప్రవర్తింస్తుంటారు. కాలేజీకి కొత్తగా వచ్చిన విద్యార్థులను భయభ్రాంతులకు గురిచేసే పనులు చేస్తుంటారు. ఇప్పటికే దేశంలో అనేక చోట్ల ర్యాగింగ్ ఘటనలు తరచుగా వార్తలలో ఉంటునే ఉంటాయి. కొన్ని చోట్ల ర్యాగింగ్ కు భయపడి విద్యార్థులు సూసైడ్ లు చేసుకున్న ఘటనలు కూడా ఉన్నాయి. అయితే.. కొత్తగా కాలేజీకి వచ్చిన జూనియర్ లను, పేర్లు చెప్పాలని, డ్రెస్ ల విషయంలో వేధిస్తుంటారు. మరికొన్ని చోట్ల.. ఇంకా దారుణంగా సెల్ ఫోన్ నంబర్ ఇవ్వాలని, తమతో డేటింగ్ చేయాలంటూ వేధిస్తుంటారు. కొంత మంది సీనియర్ ల వేధింపులు భరించలేక సూసైడ్ లు చేసుకున్న అనేక ఘటనలు వార్తలలో నిలిచాయి. ఈ కోవకు చెందిన మరో ఘటన వార్తలలో నిలిచింది.

పూర్తి వివరాలు.. మధ్య ప్రదేశ్ లోని (Madhya pradesh)   దారుణమైన ఉదంతం వెలుగులోనికి వచ్చింది. ఇండోర్ లోని ఎంజీఎం కాలేజీలో కొంత మంది సీనియర్ లు, జూనియర్ ల పట్ల పైశాచికంగా ప్రవర్తించారు. కాగా, ఎంజీఎం విద్యార్థులు.. యూజీసీ కమిషన్ కు ఫిర్యాదు చేయడంతో ఘటన ఆలస్యంగా వెలుగులోనికి వచ్చింది. కొత్తగా కాలేజీకి చేరిన, జూనియర్ లను సీనియర్ లు ర్యాగింగ్ చేశారు. కాలేజీ లోనే.. కొంత జూనియర్ లతో.. పిల్లోతో సెక్స్ చేయాలని.. తోటి విద్యార్థులతో బహిరంగంగానే సంభోగంలో పాల్గోన్నట్లు చేయాలని భయభ్రాంతులకు గురిచేశారు.



అంతేకాకుండా.. కొత్తగా జాయిన్ అయిన అమ్మాయిలమీద కామెంట్ లు చేయాలంటూ ఆర్డర్ పాస్ చేశారు. జూనియర్ విద్యార్థులు తమ మొబైల్ ఫోన్‌లను లాక్కున్నారని, బలవంతంగా సిట్-అప్‌లు చేయబడ్డారని, ఒకరినొకరు గట్టిగా చెప్పుతో కొట్టుమన్నారని తెలిపారు. దీంతో భయపడిపోయిన విద్యార్థులు తీవ్ర మనస్థాపానికి గురయ్యారు. ఈ క్రమంలో.. తమ యూజీసీ కంట్రోల్ టోల్ ఫ్రీనంబర్ కి కాల్ చేసి తమ గొడును చెప్పుకున్నారు. దీనిపై యూజీసీ అధికారులు సీరియస్ అయ్యారు. ఘటనపై పూర్తి విచారణ జరిపి, నివేదిక ఇవ్వాలని కాలేజీ సిబ్బందికి ఆదేశించారు.

అయితే.. జూనియర్ లు ఘటనకు పాల్పడిన, సీనియర్ ల పేర్లను వెల్లడించలేదు. ఆ తర్వాత కళాశాల యాంటీ-ర్యాగింగ్ కమిటి నిందితులందరిపై పోలీసు కేసు లేదా FIR (ఫస్ట్ ఇన్ఫర్మేషన్ రిపోర్ట్) దాఖలు చేయాలని నిర్ణయించింది. MBBS ఫ్రెషర్‌లందరి స్టేట్‌మెంట్‌లను రికార్డ్ చేయడం ప్రారంభిస్తామని ఇండోర్ పోలీసులు తెలిపారు. UGCకి చేసిన వివరణాత్మక ఫిర్యాదులో వాట్సాప్ చాట్‌తో సహా ఆడియో, వీడియో రికార్డింగ్‌ల రూపంలో ర్యాగింగ్ , జూనియర్ విద్యార్థుల చిత్రహింసలకు సంబంధించిన ఆధారాలు ఉన్నాయని అధికారులు తెలిపారు. ప్రస్తుతం ఈ ఘటన స్థానికంగా తీవ్రదుమారంగా మారింది.
Published by:Paresh Inamdar
First published:

Tags: Crime news, Harassment, Madhya pradesh

తదుపరి వార్తలు