MASTER PLAN TO KILL HUSBAND ON 22ND DAY OF MARRIAGE HERE IT IS WHAT HAPPENED NEXT SSR
Shocking Incident: పెళ్లయిన 22వ రోజే భర్తను లేకుండా చేయాలని ప్లాన్.. ఊహించని ట్విస్ట్ ఏంటంటే..
భువనేశ్వరి (ఫైల్ ఫొటో)
ఇష్టం లేని పెళ్లి చేశారని ఓ యువతి భర్త హత్యకు ప్లాన్ చేసింది. కానీ.. ప్లాన్ బెడిసికొట్టడంతో తన భర్త హత్యకు ప్లాన్ చేసిన విషయం పోలీసుల విచారణలో ఎక్కడ తెలిసిపోతుందోనన్న భయంతో ఆత్మహత్యకు పాల్పడి ప్రాణాలు తీసుకుంది.
చెన్నై: ఇష్టం లేని పెళ్లి చేశారని ఓ యువతి భర్త హత్యకు ప్లాన్ చేసింది. కానీ.. ప్లాన్ బెడిసికొట్టడంతో తన భర్త హత్యకు ప్లాన్ చేసిన విషయం పోలీసుల విచారణలో ఎక్కడ తెలిసిపోతుందోనన్న భయంతో ఆత్మహత్యకు పాల్పడి ప్రాణాలు తీసుకుంది. ఈ ఘటన తమిళనాడులోని తేనీ జిల్లా నార్త్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. తేనీ జిల్లా కంభం కురంగ్మయాన్ వీధికి చెందిన గౌతమ్‌కు గత నెల 10వ తేదీన అదే ప్రాంతానికి చెందిన భువనేశ్వరి(21)తో వివాహం జరిగింది. ఈ నెల 8న భువనేశ్వరి ఆత్మహత్యకు పాల్పడింది. ఈ ఆత్మహత్య కేసును విచారించిన పోలీసులకు విస్తుపోయే వాస్తవాలు వెలుగుచూశాయి. పెళ్లయి నెల కూడా కాక ముందే భువనేశ్వరి ఎందుకు చనిపోయిందని పోలీసులు సీరియస్‌గా విచారణ చేపట్టారు.
భువనేశ్వరి పోటీ పరీక్షలకు సిద్ధం అవుతుండగా ఆమె పెళ్లి ఇష్టం లేకపోయినప్పటికీ పెద్దలు మంచి సంబంధమని పెళ్లి చేశారు. అదే సమయంలో ఆమె కంభం సమీపంలోని గోవిందంపట్టి ప్రాంతానికి చెందిన నిరంజన్ అనే 22 ఏళ్ల యువకుడితో బాగా స్నేహంగా ఉండేది. ఈ క్రమంలో.. ఇంట్లో వాళ్లు భువనేశ్వరికి బలవంతంగా ఇష్టం లేని పెళ్లి చేశారు. పెళ్లయితే చేసుకుంది కానీ భర్తతో కలిసి ఉండటం భువనేశ్వరికి అస్సలు ఇష్టం లేదు. పెళ్లయిన 22వ రోజే భర్త హత్యకు నిరంజన్‌తో కలిసి ప్లాన్ చేసింది. అయితే.. భర్తకు అనుమానం రాకుండా నడుచుకుని సరదాగా బయటకు వెళదామని చెప్పింది.
భార్య ప్రేమగా అడిగిందని భావించిన భర్త గౌతమ్ ఆమెను తీసుకుని బైక్‌పై బయటకు వెళ్లాడు. బైక్ తమ్మనంపట్టి వద్దకు రాగానే బండి పంక్చర్ అయింది. బైక్‌ను తోసుకుంటూ భార్యతో కలిసి నడుచుకుంటూ వస్తున్న గౌతమ్‌ను ఓ కారులో వెంబడించి అతనిని కారుతో ఢీ కొట్టారు కొందరు గుర్తుతెలియని వ్యక్తులు. కారులో నుంచి దిగి గౌతమ్‌పై దాడికి తెగబడ్డారు. ఆ తర్వాత అదే కారులో పరారై వెళ్లిపోయారు. ఆ కారు కేరళ రిజిస్ట్రేషన్‌తో ఉండటాన్ని గౌతమ్ గమనించాడు.
తనపై ఇలా కొందరు గుర్తుతెలియని వ్యక్తులు దాడి చేశారని, కారు నెంబర్‌ను, కేరళ రిజిస్ట్రేషన్‌తో ఉన్న విషయాన్ని పోలీసులకు చెప్పాడు. పోలీసులు ఈ ఘటనపై విచారణ చేస్తున్నారు. ఆ కారులో వచ్చి గౌతమ్‌పై దాడి చేసింది మరెవరో కాదు భువనేశ్వరి స్నేహితుడు నిరంజన్, అతని స్నేహితులు. ఈ విషయం విచారణలో బయటకు వస్తే తన పేరు కూడా వెలుగులోకి వస్తుందని, భర్త హత్యకు ప్లాన్ చేసిన విషయం బయటపడుతుందని భువనేశ్వరి ఆందోళనకు లోనైంది. ఈ క్రమంలోనే భయంతో ఇంట్లో భర్త లేని సమయంలో ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. భర్త హత్యకు ప్లాన్ చేసిన భువనేశ్వరి బ్యాంకులో బంగారం కుదువ పెట్టి మరీ రూ.75,000 నిరంజన్‌కు ఇచ్చింది. ప్లాన్ ప్రకారం.. ట్యాంక్ బ్రిడ్జి చూడటానికి భర్తను తీసుకుని వస్తానని.. తిరిగొచ్చే సమయంలో తన భర్తను కారుతో ఢీ కొట్టి చంపాలని భువనేశ్వరి నిరంజన్‌కు చెప్పింది. ఈ ప్లాన్ బెడిసికొట్టడంతో చివరకు ఆమెనే ఆత్మహత్య చేసుకుని ప్రాణాలు తీసుకుంది.
Published by:Sambasiva Reddy
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.