Massive Fire Breaks Out in Delhi Bhalaswa Dumpyard: ఢిల్లీలో మంగళవారం అగ్ని ప్రమాదం జరిగింది. భలస్వా డంప్ యార్డ్ లో లో మంటలు వ్యాపించాయి. దీంతో అధికారులు అప్రమత్తమయ్యారు. అగ్ని మాపక సిబ్బందికి సమాచారం అందించారు. 10 ఫైరింజన్ లు సంఘటన స్థలానికి చేరుకున్నాయి. భారీగా ఎగిసిపడుతున్న మంటలను అదుపులోనికి తీసుకురావడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. ముంగు జాగ్రత్తగా అక్కడ అంబులెన్స్ లను తరలించారు. ప్రజలకు సురకిత ప్రాంతాలకు తరలించారు. ఘటనపై గల కారణాలపై అధికారులు విచారణ చేపట్టారు.
#WATCH | Delhi: Massive fire breaks out at Bhalaswa dump yard; 10 fire tenders present at the spot. Details awaited. pic.twitter.com/H02lv6qseV
— ANI (@ANI) April 26, 2022
ముంబైలో భారీ అగ్నిప్రమాదం (Mumbai Fire Accident) జరిగింది.
కర్రీ రోడ్డు ప్రాంతంలో ఉన్న 60 అంతస్తుల అవిఘ్నా పార్క్ టవర్ (Avighna Park Tower)లో మంటలు చెలరేగాయి. 19వ అంతస్తు నుంచి పెద్ద ఎత్తున మంటలు వ్యాపించాయి. దట్టమైన పొగలు కమ్ముకున్నాయి. మంటలను చూసి ఆ భవనంలో నివసిస్తున్న వారు భయంతో వణికిపోయారు. కొందు ప్రాణభయంతో కిందకు పరుగులు తీశారు. ఐతే ఓ వ్యక్తి 19వ అంతస్తు బాల్కని నుంచి కింద పడి మరణించారు. మృతుడిని 30 ఏళ్ల అరుణ్ తివారిగా గుర్తించారు పోలీసులు. అతడు కింద పడిన వెంటనే హుటాహుటిన KEM ఆస్పత్రికి తరలించారు. కానీ అప్పటికే మరణించినట్లు వైద్యులు తెలిపారు.
ఉదయం 11.50 నిమిషాల సమయంలో భవనం నుంచి మంటలు వ్యాపించాయని ప్రత్యక్ష స్థానికులు తెలిపారు. పెద్ద ఎత్తున మంటలు చెలరేగడంతో అగ్నిమాపక సిబ్బంది చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు. మొత్తం 12 అగ్నిమాపక యంత్రాలతో మంటలను అదుపు చేశారు. 26 మందికి మంటల నుంచి కాపాడారు. ఇక ముందు జాగ్రత్తగా 19 అంతస్తులో ఉండే మిగతా వారిని కిందకు తరలించారు. ఈ ప్రమాదాన్ని లెవెల్-4 గుర్తించారు అధికారులు. అంటే చాలా తీవ్రమైన అగ్నిప్రమాదమని చెప్పారు. అగ్నిప్రమాదానికి గురైన అవిఘ్నా పార్క్ టవర్లో మొత్తం 61 అంతస్తులు ఉన్నాయి. ఐతే ప్రమాదానికి కారణమేంటన్నది ఇంకా తెలియాల్సి ఉంది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Delhi, Fire Accident