Fire breaks out at Sariska Tiger Reserve: రాజస్థాన్ లోని అల్వార్ జిల్లాలో మంగలవారం అగ్ని ప్రమాదం జరిగింది. సరిస్కా టైగర్ రిజర్వ్ లో ఒక్కసారిగా కార్చిచ్చు రాజుకుంది. వెంటనే పెద్ద ఎత్తున వ్యాపించాయి. నిముషాల వ్యవధిలోనే మంటలు వేగంగా వ్యాపిస్తున్నాయి. టైగర్ రిజర్వ్ అధికారులు అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు. వారు సంఘటన స్థలానికి చేరుకుని మంటలను అదుపు చేసే ప్రయత్నాలు చేస్తున్నారు.
సరిస్కా టైగర్ రిజర్వు కొన్ని కిలో మీటర్లలో వ్యాపించి ఉంది. దాంట్లో అనేక వన్యప్రాణాలు, క్రూర మృగాలు సైతం ఉన్నాయి. దీంతో అధికారులకు ఫారెస్ట్ లోనికి వెళ్లడం ఇబ్బంది కరంగా మారింది. దీంతో రిజర్వ్ అధికారులు.. ఆర్మీ సహాయాన్ని తీసుకున్నారు. ఈ క్రమంలో ఆర్మీ అధికారులు రంగంలోనికి దిగారు. వారు రెండు హెలికాప్టర్ లతో హైడ్రాలిక్ విధానంలో చల్లని నీళ్లను గుమ్మరిస్తు.. మంటలను అదుపు చేసే ప్రయత్నాలు చేస్తున్నారు.
టైగర్ రిజర్వులో ఈ మధ్యనే ఒక పులి రెండు పిల్లలకు జన్మనిచ్చింది. దీంతో అధికారులు తీవ్ర ఆందోళనలకు గురౌతున్నారు. ముందు జాగ్రత్తగా అధికారులు సరిహద్దు గ్రామంలోని ప్రజలను సురక్షితమైన ప్రదేశాలకు పంపించి వేస్తున్నారు. ఫైర్ సిబ్బంది, మంటలను అదుపులోనికి తేవడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. మంటలు వ్యాపించడానికి గల కారణాలు తెలియాల్సి ఉంది.
గతంలో గుజరాత్ కెమికల్ ఫ్యాక్టరీలో ఒక అగ్ని ప్రమాదం జరిగింది.
గుజరాత్ లోని అహ్మద్ నగర్ లో ఉన్న కెమికల్ ఫ్యాక్టరీలో మంటలు వ్యాపించాయి. నిముషాల వ్యవధిలోనే మంటలు చెలరేగాయి. ఆ ప్రాంత మంతా దట్టమైన పోగలు వ్యాపించాయి. శ్రీరాంపూర్ లోని ఎంఐడీసీ కెమికల్ ఫ్యాక్టరీలో సోమవారం ఈ ప్రమాదం జరిగింది. వెంటనే ఫ్యాక్టరీ సిబ్బంది ఫైర్ అధికారులకు సమాచారం అందించారు. సిబ్బందిని బయటకు పంపించి వేశారు. ప్రమాద స్థలానికి చేరుకున్న ఫైర్ సిబ్బంది.. మంటలను అదుపులోనికి తీసుకువస్తున్నారు.
ఆ ప్రాంత మంతా దట్టమైన పొగలు వ్యాపించాయి. ఫ్యాక్టరీలో రసాయనాలు ఉండటంతో ముందు జాగ్రత్తగా అక్కడి నుంచి ప్రజలను దూరంగా పంపించి వేశారు. అంబూలెన్స్ లను కూడా సిద్ధంగా ఉంచారు. ఇప్పటి వరకు ఎలాంటి ప్రాణ నష్టం సంభవించలేదని ఫైర్ సిబ్బంది తెలిపారు. ప్రస్తుతం ఈ ఘటనతో స్థానికులు తీవ్ర భయాందోళనలకు గురయ్యారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Fire Accident, Rajasthan