Massive fire breaks out in hospital : పంజాబ్ రాజధాని అమృత్ సర్ లోని గురునానక్ దేవ్ హాస్పిటల్ లో శనివారం మధ్యాహ్నం భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. మంటలు పెద్దఎత్తున ఎగిసిపడ్డాయి. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది స్పాట్ కి చేరుకొని ఎనిమిది ఫైర్ ఇంజిన్ల సహాయంతో గంటపాటు శ్రమించి మంటలను అదుపులోకి తీసుకువచ్చారు. అయితే అగ్ని కీలక ధాటికి ఆస్పత్రి ఆవరణలోని పార్కింగ్‌లో ఉన్న వాహనాలు దగ్ధం అయ్యాయి.
ఈ ప్రమాదంలో ఎవరికీ ఎలాంటి గాయాలు కాలేదని అధికారులు తెలిపారు. అగ్ని ప్రమాదంతో అప్రమత్తమైన సిబ్బంది వెంటనే నెప్రాలజీకి సంబంధించిన ఆరు వార్డులు, రెండు స్కిన్, మూడు సర్కిల్ వార్డుల్లో రోగులను ఖాళీ చేయించి, ఇతర వార్డులకు తరలించారు.
ALSO READ Wonder : ఆశ్చర్యపోతున్న సైంటిస్టులు..ఫసిఫిక్ సముద్ర గర్భంలో పసుపు ఇటుకల రోడ్డు
కాగా, హాస్పిటల్ వద్ద టాన్స్ఫార్మర్లో షార్ట్ సర్క్యూట్ వల్ల మంటలు చెలరేగడమే ఈ ప్రమాదానికి కారణమని తెలుస్తోంది. ఓపీడీ సమీపంలో ఏర్పాటు చేసిన రెండు ఎలక్ట్రిక్ ట్రాన్స్ఫార్మర్లలో పేలుడు సంభవించి మంటలు అంటుకున్నాయని ప్రిన్సిపల్ జీఎంసీ రాజీవ్‌కుమార్ దవేగన్ తెలిపారు. ప్రమాద కారణాలపై అధికారులు ఆరా తీస్తున్నారు. ఈ అగ్ని ప్రమాదానికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Fire broke out, Punjab