దేశ రాజధాని ఢిల్లీలోని మోతీనగర్ లో భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. ప్రముఖ బైకుల కంపెనీ హార్లే డేవిడ్ సన్ షోరూంలో ఈ ప్రమాదం జరిగింది. ఈ రోజు తెల్లవారుజామున అగ్ని ప్రమాదం జరిగినట్లు స్థానిక పోలీస్ అధికారులు తెలిపారు. ప్రమాద సమాచారం అందుకున్న వెంటనే 25 ఫైరింజన్లు సంఘటనా స్థలానికి చేరుకున్నాయ్. ఫైరింజన్ల సాయంతో అగ్ని మాపక సిబ్బంది ఉదయం 5.50 గంటలకు మంటలను అదుపులోకి తెచ్చినట్లు పోలీసులు తెలిపారు. ఎటువంటి ప్రాణ నష్టం జరగలేదని వారు వెల్లడించారు. అయితే, ఈ అగ్ని ప్రమాదంలో చిక్కుకున్న ఐదుగుర్ని రక్షించినట్లు పోలీసులు తెలిపారు. హార్లే డేవిడ్ సన్ షోరూం బిల్డింగ్ లో ఫస్ట్ అండ్ సెకండ్ ఫ్లోర్ ల్లో ఉంది. అయితే, షోరూం పైన మూడో ఫ్లోర్ లో నైట్ క్లబ్ ఉంది. ఈ నైట్ క్లబ్ కూడా మంటలు వ్యాపించడంతో అక్కడ ఐదుగురు చిక్కుకుపోయారు.
ఈ ఐదుగుర్ని పోలీసులు, అగ్ని మాపక సిబ్బంది సాయంతో రక్షించారు. వీరికి స్వల్వ గాయాలవడంతో స్థానిక ఆస్పత్రికి తరలించారు. అయితే, ఇదే ప్రాంతంలో గత వారం మాస్క్ ల తయారీ కంపెనీలో అగ్ని ప్రమాదం జరిగింది. ఆ ప్రమాదంలో 45 ఏళ్ల వ్యక్తి చనిపోయినట్లు స్థానికులు తెలిపారు. అయితే, హార్లే డేవిడ్ సన్ షోరూంలో ప్రమాదానికి కారణాలు ఇంకా తెలియలేదు. షార్ట్ సర్క్యూట్ కారణంగానే ఈ ప్రమాదం జరిగినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. ప్రాణ నష్టం జరగకపోయినప్పటికీ.. భారీగానే ఆస్థి నష్టం జరిగినట్లు తెలుస్తోంది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Delhi, Fire Accident