హోమ్ /వార్తలు /క్రైమ్ /

Shiva Parvathi theatre : ఘోర ప్రమాదం.. కాలిబూడిదైన కూకట్‌పల్లి శివపార్వతి సినిమా థియేటర్

Shiva Parvathi theatre : ఘోర ప్రమాదం.. కాలిబూడిదైన కూకట్‌పల్లి శివపార్వతి సినిమా థియేటర్

శివపార్వతి థియేటర్ లో మంటలు

శివపార్వతి థియేటర్ లో మంటలు

హైదరాబాద్ కూకట్ పల్లి కేపీహెచ్‌బీ కాలనీలో ఉన్న శివపార్వతి సినిమా థియేటర్‌లో సోమవారం తెల్లవారు జామున ఒక్కసారిగా మంటలు అంటుకున్నాయి. చూస్తుండగానే నిమిషాల్లోనే థియేటర్ మొత్తం తగలబడిపోయింది. వివరాలివి

హైదరాబాద్ సిటీలోని కూకట్‌పల్లిలో అతి భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. కేపీహెచ్‌బీ కాలనీలో ఉన్న శివపార్వతి సినిమా థియేటర్‌లో సోమవారం తెల్లవారు జామున ఒక్కసారిగా మంటలు అంటుకున్నాయి. చూస్తుండగానే నిమిషాల్లోనే థియేటర్ మొత్తం తగలబడిపోయింది. ఫైర్ ఇంజన్లు అక్కడికి చేరేలోపే థియేటర్ బూడిదైపోయింది. సంచలనం రేపిన ఈ సంఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ఆదివారం రాత్రి థియేటర్ లో శ్యామ్‌ సింగరాయ్‌ సినిమా సెకండ్ షో ముగిన తర్వాత చాలా సేపటికి ఈ ఘటన జరిగింది.

కూకట్ పల్లిలోని ప్రఖ్యాత శివపార్వతి థియేటర్ పూర్తిగా తగలబడిపోయిందనే వార్త సినీ అభిమానులను కలవరపెడుతోంది. థియేటర్ కాలిపోతోన్న దృశ్యాలు వైరల్ అయ్యాయి. ఈ ప్రమాదానికి షార్ట్ సర్క్యూటే కారణమని ప్రాథమికంగా నిర్దారించారు. అదృష్టవశాత్తూ అగ్నిప్రమాదం జరిగినప్పుడు థియేటర్ సిబ్బంది కూడా అక్కడ లేకపోవడంతో ఎవరికీ ప్రాణాపాయం జరగలేదు. అయితే, ఆస్తి నష్టం రూ.2కోట్లకు పైగానే ఉంటుందని అంచనా.

దగ్ధమైన శివపార్వతి థియేటర్

Elephant kidnap: సినీ ఫక్కీలో ఏనుగు కిడ్నాప్.. రూ.40లక్షలు డీల్.. చివరికి షాకింగ్ ట్విస్ట్


శివపార్వతి థియేటర్ లోపలి భాగంలో మంటలు రాజుకోవడంతో తెర, కుర్చీలు, ఇతర సామాగ్రి, గోడలకు అమర్చిన కాట్ బోర్డులు పూర్తిగా కాలిపోయాయి. ఇటీవల సినిమా థియేటర్లలో అగ్నిప్రమాద ఘటనల్లో ఇది మూడోది. కొద్ది రోజుల కిందటే వరంగల్‌, శ్రీకాకుళం జిల్లాల్లోని థియేటర్లల్లో అగ్నిప్రమాదాలు జరగడం తెలిసిందే. శివపార్వతి థియేటర్ కాలిపోయిన ఘటనకు సంబంధించి మరింత సమాచారం తెలియాల్సి ఉంది.

Published by:Madhu Kota
First published:

Tags: Fire Accident, Hyderabad, Kukatpally, Theatres

ఉత్తమ కథలు