హోమ్ /వార్తలు /క్రైమ్ /

Fire Accident: విపత్తు మిగిల్చిన విషాదం.. ఫ్యాక్టరీలో ఘోర అగ్ని ప్రమాదం.. 52 మంది మృతి..

Fire Accident: విపత్తు మిగిల్చిన విషాదం.. ఫ్యాక్టరీలో ఘోర అగ్ని ప్రమాదం.. 52 మంది మృతి..

రోదిస్తున్న బంధువులు, ప్రమాదం జరిగిన ఫ్యాక్టరీలో ఎగసిపడుతున్న మంటలు

రోదిస్తున్న బంధువులు, ప్రమాదం జరిగిన ఫ్యాక్టరీలో ఎగసిపడుతున్న మంటలు

బంగ్లాదేశ్‌లోని ఓ ఫ్యాక్టరీలో ఘోర అగ్ని ప్రమాదం సంభవించింది. ఈ ఘటనలో 52 మంది ప్రాణాలు కోల్పోయారు. దాదాపు 30 మంది మంటల్లో చిక్కుకుని గాయపడ్డారు. క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించి చికిత్సనందిస్తున్నారు. బంగ్లాదేశ్‌లోని రూప్‌గంజ్‌లో గురువారం సాయంత్రం ఈ విషాద ఘటన జరిగింది.

ఇంకా చదవండి ...

  ఢాకా: బంగ్లాదేశ్‌లోని ఓ ఫ్యాక్టరీలో ఘోర అగ్ని ప్రమాదం సంభవించింది. ఈ ఘటనలో 52 మంది ప్రాణాలు కోల్పోయారు. దాదాపు 30 మంది మంటల్లో చిక్కుకుని గాయపడ్డారు. క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించి చికిత్సనందిస్తున్నారు. బంగ్లాదేశ్‌లోని రూప్‌గంజ్‌లో గురువారం సాయంత్రం ఈ విషాద ఘటన జరిగింది. రూప్‌గంజ్‌లోని హషీమ్ ఫుడ్ అండ్ బేవరేజ్ ఫ్యాక్టరీలో ఈ విపత్తు సంభవించింది. ఈ ఘటన జరిగి 24 గంటలు గడుస్తున్నా ఇప్పటికీ మంటలు పూర్తిస్థాయిలో చల్లారలేదు. చనిపోయిన వారంతా ఫ్యాక్టరీ పై ఫ్లోర్స్‌లో ఉండటం వల్ల.. మంటలు దట్టంగా వ్యాపించడం, పొగలు అలుముకోవడంతో కిందికి రాలేక ఆ మంటల్లో చిక్కుకుని కొందరు, ఊపిరాడక మరికొందరు చనిపోయినట్లు బంగ్లాదేశ్ అధికారులు ప్రకటించారు. ఈ ప్రమాదంలో చిక్కుకున్న వారి జాడ కోసం వారి కుటుంబ సభ్యులు, బంధువులు ఇప్పటికీ ఫ్యాక్టరీ బయట విషణ్ణ వదనంతో వేచి చూస్తున్నారు. ఎవరిని కదిలించినా ఆర్తనాదాలు, హాహాకారాలే. యుద్ధం జరిగిన తర్వాత ఎలాంటి దృశ్యాలు కనిపిస్తాయో.. సరిగ్గా అలాంటి విషాద పరిస్థితే ప్రస్తుతం ఆ ఫ్యాక్టరీ వద్ద కనిపిస్తోంది. 2013లో బంగ్లాదేశ్‌లోని రాణా ప్లాజా కాంప్లెక్స్ కూలిన ఘటనలో దాదాపు 1,100 వందల మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు. అప్పటి నుంచి భద్రతా ప్రమాణాలను పాటించని వారిపై బంగ్లా ప్రభుత్వం కాస్త కఠినంగానే వ్యవహరించింది. అయినప్పటికీ 2019లో ఢాకాలోని ఓ అపార్ట్‌మెంట్స్‌లో అక్రమంగా నిల్వ ఉంచిన కెమికల్స్ కారణంగా 70 మంది ప్రాణాలు కోల్పోయారు. మళ్లీ ఈ ఘటనలో 52 మంది చనిపోవడం బంగ్లాదేశ్‌లో పరిస్థితులకు అద్దం పడుతోంది.

  ఈ ఘటన గురించి అధికారులు మాట్లాడుతూ.. ఈ ఫ్యాక్టరీలో ఉదయం, మధ్యాహ్నం సమయంలో మొత్తం 1,000 మందికి పైగా కార్మికులు పనిచేస్తుంటారని.. ఈ ఘటన సాయంత్రం జరగడంతో వాళ్లంతా అప్పటికే ఇంటికి వెళ్లిపోవడంతో భారీ ప్రాణ నష్టం తప్పిందని చెప్పారు. తొలుత ముగ్గురు మృతదేహాలు మాత్రమే కనిపించడంతో చాలా వరకూ బయటపడ్డారని భావించామని.. కానీ మూడో ఫ్లోర్‌కు వెళ్లి చూడగానే ఆ ఒక్క ఫ్లోర్‌లోనే 49 మృతదేహాలు కనిపించాయని ఫైర్ సిబ్బంది తెలిపారు.

  కొందరు ధైర్యం చేసి కిందికి దూకేయడంతో ప్రాణాపాయం నుంచి బయటపడ్డారని.. కానీ తీవ్రంగా గాయపడ్డారని చెప్పారు. ఐదు, ఆరో ఫ్లోర్స్‌లో మంటలను అదుపులోకి తీసుకొచ్చేందుకు అగ్నిమాపక సిబ్బంది శాయశక్తులా కృషి చేస్తున్నారు. మంటలు పూర్తిగా అదుపులోకి రాగానే.. లోపలకి వెళ్లి సెర్చ్ అండ్ రెస్క్యూ ఆపరేషన్ చేపడతామని.. ఆ తర్వాత ఎంతమంది చనిపోయిన విషయం తెలుస్తుందని అధికారులు తెలిపారు.

  Published by:Sambasiva Reddy
  First published:

  Tags: Bangladesh, Fire Accident

  ఉత్తమ కథలు