Germany Firing : జర్మనీలోని హనావ్ నగరం ఒక్కసారిగా కాల్పుల మోతతో దద్దరిల్లింది. కొందరు దుండగులు రెండు వేర్వేరు చోట్ల కాల్పులు జరిపారు. ఈ ఘటనల్లో 8 మంది చనిపోగా మరో ఐదుగురు గాయపడ్డారు. జర్మనీ టైమ్ ప్రకారం బుధవారం రాత్రి 10 గంటల తర్వాత దుండగులు ఓ హుక్కా బార్ దగ్గర గన్స్ బయటకు తీశారు. వాటిలో బుల్లెట్లన్నీ అయిపోవాలి అన్నట్లుగా వరుసపెట్టి కాల్పులు జరిపారు. అక్కడున్న జనం తప్పించుకునే అవకాశం లేకుండా పోయింది. బుల్లెట్లు దూసుకెళ్లిన వాళ్లలో ముగ్గురు... అక్కడికక్కడే పడి స్పాట్లోనే చనిపోయారు. మిగతా వారిని ఆస్పత్రికి తరలించారు. కాల్పులు తర్వాత దుండగులు... అక్కడి నుంచీ కారులో పారిపోయారు. ఐతే... కొందరి గన్స్లో కొన్ని బుల్లెట్లు మిగిలాయి. వాటిని కారులో మోసుకెళ్లడం ఎందుకనుకున్నారో ఏమోగానీ... వేరే ప్రాంతంలోకి హుక్కా బార్కి వెళ్లి అక్కడ కూడా కాల్పులు జరిపారు. అక్కడ మరో ఐదుగుగుర చనిపోయారు. గాయపడిన వారిని ఆస్పత్రులకు తరలించారు.
ప్రస్తుతం దుండగుల కోసం వేట కొనసాగుతోంది. హుక్కా బార్లే టార్గెట్గా కాల్పులు జరిపారని అర్థం చేసుకోవచ్చు. కాల్పుల మృతులు, గాయపడిన వారంతా కుర్దులని తెలుస్తోంది. ఫైరింగ్ ఎందుకు చేశారన్నది మాత్రం తెలియలేదు. పోలీసులు డోర్ టు డోర్ బెల్స్ కొట్టి మరీ దుండగుల కోసం వెతుకుతున్నారు. పై నుంచీ హెలికాప్టర్లు కూడా తిరుగుతున్నాయి. చిత్రమేంటంటే... కాల్పులు జరిపింది ఎంత మంది అన్నది కూడా పోలీసులకు అంచనా లేదు.
హనావ్ నగర మేయర్ క్లాస్ కామిన్స్కీ ఈ ఘటనపై తీవ్ర దిగ్భ్రాంతి చెందారు. ఇలా జరుగుతుందని అస్సలు ఊహించలేదన్నారు. మరోసారి ఇలా జరగకుండా పోలీసులు కఠిన చర్యలు తీసుకోవాలని ఆయన కోరారు. రాజకీయ నేతలు కూడా ఈ ఘటనను ఖండిస్తున్నారు. మృతుల కుటుంబ సభ్యులకు సోషల్ మీడియాలో సంతాపం తెలుపుతున్నారు నెటిజన్లు. ఇటీవల జర్మనీలో ఇలాంటి కాల్పుల ఘటనలు పెరుగుతున్నాయి. 2016లో క్రిస్మస్ మార్గెట్లో ట్యునీషియా శరణార్థి జరిపిన కాల్పుల్లో 12 మంది చనిపోయారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.