Home /News /crime /

MASS EXECUTION OF 81 PEOPLE IN A SINGLE DAY IN SAUDI ARABIA SNR

OMG:ఒకే సారి 81మందికి ఉరిశిక్ష ..చావుకే భయాన్ని కలిగించిన సౌదీ అరేబియా

(ప్రతీకాత్మకచిత్రం)

(ప్రతీకాత్మకచిత్రం)

Saudi Arabia: అనేక నేరాలు, అత్యంక క్రూరంగా ప్రవర్తించిన నేరస్తుల పట్ల సౌదీ అరేబియా ప్రభుత్వం కఠినంగా వ్యవహరించింది. ఒకే రోజు 81మందిని సామూహికంగా ఉరితీసి మరణదండన అమలు చేసింది. ఇంత మందిని ఒకేసారి ఉరి తీయడం ఇది రెండో సారి. మొదటి సారి 2016 సంవత్సరంలో 47మందిని ఉరితీయడం జరిగింది.

ఇంకా చదవండి ...
ఒకరు కాదు ఇద్దరు కాదు. 81మంది( 81 people)ని ఒకేసారి ఒకే రోజు ఉరి(executed) తీశారు. ఇది సౌదీ అరేబియా(Saudi Arabia)లో జరిగింది. అయితే ఎందుకంత శిక్షకఠినంగా వ్యవహరించారో తెలుసా. పిల్లలు, ఆడవాళ్లు, అమాయకుల్ని అత్యంత క్రూరంగా హతమార్చిన(multiple heinous crimes)వాళ్లతో పాటు మిలిటెంట్‌ గ్రూప్‌లకు చెందిన టెర్రరిస్టులను అక్కడ ప్రభుత్వం సామూహిక మరణదండన విధించింది. ఉరివేసిన 81మందిలో 73మంది సౌదీకి చెందిన సామాన్యులే (Saudi Arabia Citizens)ఉండటం విశేషం. మిగిలిన వాళ్లలో ఏడుగురు యెమెన్‌
(Yemenis)వాసులున్నారు. ఒకరు సిరియా(Syria)కి చెందిన పౌరుడ్ని ఉరి తీయడం జరిగింది. ఈమధ్య కాలంలో సౌదీ అరేబియా ప్రభుత్వం అత్యధికంగా ఉరి శిక్షలు అమలు చేయడం ఇదేనని అక్కడి ప్రభుత్వ ఆధీనంలో నడుస్తున్న సౌదీ ప్రెస్ ఏజెన్సీ(Saudi Press Agency)ప్రకటించింది. ఇంకా గమ్మత్తైన విషయం ఏమిటంటే ఏడాది మొత్తం ఇప్పటి వరకు అమలు చేసిన మరణశిక్షల కంటే కూడా శనివారం ఒక్కరోజు సామూహికంగా ఉరితీసిన వారి సంఖ్యే ఎక్కువ అని అక్కడి పత్రికలు వెల్లడించాయి. సౌదీ అరేరియాలో చట్టాలు అత్యంత కఠినంగా ఉంటాయి. వాటిని ఎవరు ఉల్లంఘించినా తీవ్ర పరిణామాలు ఎదుర్కొవాల్సి వస్తుంది. అంతే కాదు ఇక్కడ ఉరిశిక్షలు అమలు చేస్తున్న దేశాల్లో సౌదీ ఆరేబియా అగ్రస్థానంలో ఉందంటే అక్కడి ప్రభుత్వాలు నేరస్తుల పట్ల ఎంత కఠినంగా వ్యవహరిస్తాయో ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు. సౌదీ అరేబియాలో చట్టం పేరుతో ఇలా బలవంతంగా ప్రాణాలు తీసే విధానాన్ని ప్రపంచ దేశాలు, మానవహక్కుల సంఘాలు, సామాజిక కార్యకర్తలు ఎన్నో సార్లు ఖండించాయి. ఇలాంటివి జరిగిన తీవ్ర ఆవేదన కూడా వ్యక్తం చేసిన సందర్భాలు ఉన్నాయి.

వాళ్లు పరమ క్రూరులు కాబట్టే..
నేరస్తులు చేసిన తప్పులు క్షమించలేని విధంగా ఉండటం వల్ల ఉరిశిక్షే సరైన శిక్షగా చెబుతోంది సౌదీ ప్రభుత్వం. అలాంటి వారిని క్షమించినా , ప్రాణాలతో వదిలేసినా నేరస్తుల సంఖ్య మరింత పెరగడమే కాకుండా పౌరులకు ఇచ్చిన న్యాయపరమైన హక్కులను కాలరాసినట్లుగా అవుతుందనే ఉద్దేశ్యంతోనే సౌదీ అరేబియా ప్రభుత్వం ఇంత కఠినంగా వ్యవహరిస్తోందని సౌదీ ప్రెస్ ఏజెన్సీ పేర్కొంది. శనివారం ఉరితీసిన 81మంది విషయంలో 13మంది న్యాయమూర్తులు ఇచ్చిన ఆదేశాలను అనుసరించే శిక్ష అమలు చేయబడిందని వెల్లడించింది.

ఊపేక్షించని సౌదీ అరేబియా..
ఉరితీసిన వారిలో ఇస్లామిక్​ స్టేట్​ గ్రూప్​, అల్​ఖైదా, యెమెన్​కు చెందిన హుతి రెబెల్​ దళాలు, ఇతర ఉగ్రసంస్థల వారు ఉన్నట్టు వెల్లడించింది. వీరందరు భద్రతా దళాలను చంపేందుకు, ఆర్థిక అలజడులు సృష్టించేందుకు, ఆయుధాల అక్రమ రవాణాకు పాల్పడుతున్నట్టు స్పష్టం చేసింది. ఇక ఉరితీసిన వాళ్లలో అల్-ఖైదా, ఇస్లామిక్ స్టేట్ గ్రూపు సభ్యులతో పాటు యెమెన్ హైతీ తిరుగుబాటుదారుల మద్దతుదారులు కూడా ఉన్నారని సౌదీ ప్రెస్ ఏజెన్సీ వెల్లడించింది. సౌదీ అరేబియాలో ఈ తరహాలో సామూహిక ఉరిశిక్షలను 2016వ సంవత్సరం జనవరిలో అమలు చేశారు. అప్పుడు 47మందిని ఉరి తీస్తే అందులో ప్రముఖ ప్రతిపక్ష షియా మతగురువు కూడా ఉన్నట్లు సౌదీ ప్రెస్‌ ఏజెన్సీ తన ప్రకటనలో వెల్లడించింది.
Published by:Siva Nanduri
First published:

Tags: Soudi arebia, VIRAL NEWS

ఉత్తమ కథలు

తదుపరి వార్తలు