• HOME
  • »
  • NEWS
  • »
  • CRIME
  • »
  • MASKED MAN LOOTS RS 1 LAKH FROM ORIENTAL BANK OF COMMERCE IN DELHIS TILAK NAGAR SK

పట్టపగలే దొంగ బీభత్సం.. బ్యాంక్‌లోకి చొరబడి నగదు చోరీ

పట్టపగలే దొంగ బీభత్సం.. బ్యాంక్‌లోకి చొరబడి నగదు చోరీ

ఆగస్టులో సైనిక్‌పురిలోనూ చోరీకి పాల్పడిన నేపాలీ ముఠా. రియల్ ఎస్టేట్ వ్యాపారి ఇంట్లో రూ. 2 కోట్లకు పైగా బంగారంతో పరారయ్యారు.

చోరీకి పాల్పడ్డ దొంగ.. బ్లాక్ జాకెట్, బ్లూ కలర్ ప్యాంట్ ధరించి ఉన్నట్లు తెలిపారు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. బ్యాంక్ చుట్టుపక్కల ఉన్న సీసీ కెమెరాలను క్షణ్ణంగా పరిశీలిస్తున్నారు.

  • Last Updated:
  • Share this:
    దేశ రాజధాని ఢిల్లీలో పట్టపగలే ఓ దోపిడీ దొంగ రెచ్చిపోయాడు. ముఖానికి మాస్క్ ధరించి బ్యాంక్‌లోకి చొరబడిన దుండగుడు.. తుపాకీతో క్యాషియర్‌ని బెదిరించి నగదు ఎత్తుకెళ్లాడు. తిలక్‌నగర్‌లోని ఓరియంటల్ బ్యాంక్ ఆఫ్ కామర్స్‌లో ఈ ఘటన జరిగింది. ఉదయం బ్యాంక్ తెరిచిన వెంటనే సెక్యూరిటీ గార్డ్‌ని నెట్టేసి లోపలికి చొరబడ్డాడు. సిబ్బందిని బెదిరించి రూ.1.5 లక్షల నగదును కాజేసి.. అనంతరం అక్కడి నుంచి పారిపోయాడు. కాసేపటికి బ్యాంక్ సిబ్బంది పోలీసులకు ఫోన్ చేసి సమాచారం అందించారు. ఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు సిబ్బంది నుంచి వివరాలు తెలుసుకున్నారు. చోరీకి పాల్పడ్డ దొంగ.. బ్లాక్ జాకెట్, బ్లూ కలర్ ప్యాంట్ ధరించి ఉన్నట్లు తెలిపారు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. బ్యాంక్ చుట్టుపక్కల ఉన్న సీసీ కెమెరాలను క్షణ్ణంగా పరిశీలిస్తున్నారు.
    Published by:Shiva Kumar Addula
    First published: