ప్రణయ్ హత్య కేసులో నిందితుడు మారుతీరావు ఆత్మహత్య చేసుకున్నాడు. హైదరాబాద్‌లోని ఆర్యవైశ్య భవన్లో విషం తాగి ప్రాణం తీసుకున్నాడు. నిన్న రాత్రి ఆయన సూసైడ్ చేసుకున్నట్టు తెలుస్తోంది. అయితే, మారుతీరావు మరణంపై ఆయన కుమార్తె అమృత స్పందించింది. ‘ప్రణయ్ హత్య తర్వాత నుంచి నాన్న నాకు టచ్‌లో లేడు. ఆయన ఆత్మహత్య చేసుకున్నట్టు టీవీలో చూశా. ప్రణయ్‌ను చంపిన పశ్చాత్తాపంతో ఆత్మహత్య చేసుకుని ఉంటాడు. మారుతీరావు ఆత్మహత్య విషయం మాకు ఎవరూ చెప్పలేదు’ అని తెలిపింది. ‘ఏమైందనే విషయం మాకు తెలీదు. ఏమైనా రేపే చెప్పగలం. బహుశా తప్పు తెలుసుకుని ఆత్మహత్య చేసుకుని ఉండొచ్చు. ప్రణయ్‌ను వాళ్లు చంపేసిన తర్వాత ఇప్పటి వరకు నేను ఆయన్ను చూడలేదు. మాట్లాడలేదు.’ అని కూడా అమృత వర్షిణి మీడియాకు తెలిపింది.
కూతురు అమృతను ప్రేమ పెళ్లి చేసుకున్న ప్రణయ్‌ని హత్య చేయించినట్లు మారుతీ రావుపై ఆరోపణలు ఉన్నాయి. మారుతీరావు స్వస్థలం... నల్గొండ జిల్లా... మిర్యాల గూడ. గతంలో తన కూతుర్ని పెళ్లి చేసుకున్న అల్లుడు ప్రణయ్‌ని కిరాయి హంతకులతో మారుతీరావు హత్య చేయించాడు. ఈ కేసులో ఆయన బెయిల్‌పై బయట ఉన్నాడు. ఆ తర్వాత ఇటీవలే కూతురి ఫిర్యాదుతో ఆయన్ని మళ్లీ అరెస్టు చేసి రిమాండ్‌కి తరలించారు. తర్వాత బెయిల్ పై విడుదల చేశారు.
పీడీ యాక్ట్ కేసులో ఆరు నెలల కిందట విడుదలైన మారుతీరావు... అప్పటి నుంచి కూతురు అమృతను వేధిస్తున్నట్లు తెలిసింది. అమృత ఫిర్యాదుతో మారుతీరావును ఇటీవల అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు మిర్యాలగూడ పోలీసులు. ఆ తర్వాత మళ్లీ బెయిల్ పై విడుదలయ్యారు. కూతురు దూరమైందని తీవ్ర మనస్తాపం చెందిన మారుతీరావు... అందుకే ఆత్మహత్య చేసుకున్నారా అన్నది తేలాల్సి ఉంది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Crime news, Nalgonda, Pranay amrutha, Telangana