• HOME
  • »
  • NEWS
  • »
  • CRIME
  • »
  • MARRIED WOMAN WHO TRIED TO SEARCHING FOR HUSBAND FACING TORTURE IN HYDERABAD SSR

Hyderabad: భర్తతో గొడవ పడి పుట్టింట్లో భార్య.. మీ ఆయన హైదరాబాద్‌లో కనిపించాడని అతను చెప్పగానే..

Hyderabad: భర్తతో గొడవ పడి పుట్టింట్లో భార్య.. మీ ఆయన హైదరాబాద్‌లో కనిపించాడని అతను చెప్పగానే..

ప్రతీకాత్మక చిత్రం

మహబూబాబాద్ జిల్లా గార్ల మండలం అంకన్నగూడెం గ్రామానికి చెందిన ఓ యువకుడు, భద్రాచలం సమీపంలోని ఎటపాకకు చెందిన ఓ గిరిజన మహిళను రెండేళ్ల కిందట ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. పాప పుట్టాక ఈ దంపతులిద్దరి మధ్య దూరం పెరిగింది. గొడవలు మొదలయ్యాయి. దీంతో.. భర్తతో కలిసి ఉండలేక ఆ మహిళ పుట్టింటికి వెళ్లిపోయి తల్లితో కలిసి...

  • Share this:
    మహబూబాబాద్: ఓ యువతీయువకుడు ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. కొన్నాళ్లు కాపురం సజావుగానే సాగింది. ఒక పాప పుట్టింది. పాప పుట్టిన కొన్నిరోజులకు ఇద్దరి మధ్య మనస్పర్థలు వచ్చాయి. చీటికీమాటికీ గొడవపడుతుండేవారు. భర్తతో గొడవ పడి ఆ మహిళ పుట్టింటికి వెళ్లింది. చాలా నెలల నుంచి పుట్టింట్లోనే ఉంది. తిరిగి కాపురానికి తీసుకెళ్లేందుకు భర్త కూడా రాలేదు. అతను సొంతూళ్లోనూ లేడని తెలిసింది. ఇంతలో ఒకరోజు ఆ మహిళ గ్రామానికి చెందిన ఓ వ్యక్తి వచ్చి మీ ఆయన కనిపించాడని.. హైదరాబాద్‌లో ఉన్నాడని చెప్పాడు. తన వద్దకు తీసుకెళతానని నమ్మించాడు. సిటీకి తీసుకెళ్లి ఆ మహిళకు నరకం చూపించాడు. భర్తను కలవచ్చని వచ్చిన ఆ మహిళ సదరు వ్యక్తి కారణంగా చిత్రహింసలు అనుభవించింది. పూర్తి వివరాల్లోకి వెళితే.. మహబూబాబాద్ జిల్లా గార్ల మండలం అంకన్నగూడెం గ్రామానికి చెందిన ఓ యువకుడు, భద్రాచలం సమీపంలోని ఎటపాకకు చెందిన ఓ గిరిజన మహిళను రెండేళ్ల కిందట ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. పాప పుట్టాక ఈ దంపతులిద్దరి మధ్య దూరం పెరిగింది. గొడవలు మొదలయ్యాయి. దీంతో.. భర్తతో కలిసి ఉండలేక ఆ మహిళ పుట్టింటికి వెళ్లిపోయి తల్లితో కలిసి ఉంటూ కూతురును చూసుకుంటోంది. అయితే.. కొన్ని రోజుల క్రితం ఆ మహిళ గ్రామానికి చెందిన భూక్యా సర్వేశ్ అనే వ్యక్తి బాధితురాలి భర్త హైదరాబాద్‌లో కనిపించాడని, మీ ఆయన దగ్గరకు తీసుకెళతానని ఆ మహిళను నమ్మబలికాడు. అతని మాయమాటలు నమ్మిన ఆ మహిళ కూతురిని తీసుకుని సర్వేశ్‌తో కలిసి భర్తను కలుద్దామని హైదరాబాద్‌కు వెళ్లింది. దిల్‌సుఖ్‌నగర్‌లోని ఓ అద్దె గదిలో సదరు మహిళను, ఆమె కూతురిని ఉంచిన సర్వేశ్ తన భర్త గురించి ఆమె ఎప్పుడు అడిగినా సమాధానం దాటవేసేవాడు. ఒకరోజు ఆమె నిలదీయడంతో తిట్టికొట్టి చిత్రహింసలకు గురిచేశాడు. పైశాచికంగా ప్రవర్తించాడు.

    ఆమె శరీరంపై సిగరెట్లతో కాల్చి, వ్యభిచారం చేయాలని లేకపోతే నీ కూతురికి కూడా చిత్రహింసలు తప్పవని ఆ చిన్నారి చేతులను కూడా సిగరెట్‌తో కాల్చేవాడు. సర్వేశ్ అంతటితో ఆగలేదు. తన స్నేహితులను ఆ గదికి తీసుకొచ్చి ఆమె వద్దనున్న బంగారం లాక్కుని అమ్ముకుని స్నేహితులతో కలిసి జల్సాలు చేశాడు.

    భర్త కోసం వచ్చి ఇలా నరకయాతన అనుభవిస్తున్న బాధిత మహిళ ఒకరోజు ఆ అద్దె గది యజమాని సాయంతో బయటపడింది. భర్త గ్రామమైన అంకన్నగూడెం వెళ్లింది. ఆమె భర్త సొంతూళ్లోనే ఉన్నాడు. భర్త, అత్తకు జరిగిన విషయం చెప్పగా.. గార్ల పోలీస్ స్టేషన్‌లో సర్వేశ్‌పై ఫిర్యాదు చేశారు. సర్వేశ్‌ను అమాయకంగా నమ్మిన బాధితురాలు దాదాపు నెలరోజుల పాటు నానా కష్టాలు పడింది. కాపురంలో కలహాలు సహజమేనని, కానీ.. ఇలాంటి వారి విషయంలో అప్రమత్తంగా ఉండాలని పోలీసులు సూచిస్తున్నారు.
    Published by:Sambasiva Reddy
    First published: