హోమ్ /వార్తలు /క్రైమ్ /

Crime news : భర్తకు ప్రియుడితో తలకొరివి పెట్టించింది .. వామ్మో డేంజరస్‌ లేడీ

Crime news : భర్తకు ప్రియుడితో తలకొరివి పెట్టించింది .. వామ్మో డేంజరస్‌ లేడీ

extramarital affair

extramarital affair

Extramarital affair: నూరేళ్లు కలిసి జీవించాల్సిన భర్తే అడ్డుగా ఉన్నాడని భావించింది. తన బాయ్‌ఫ్రెండ్‌తో శారీరక సుఖానికి అలవాటు పడిన వివాహిత భర్తను ప్రియుడితో హత్య చేయించింది. పవిత్రమైన వివాహ బంధాన్ని తెంచుకొని జైలుపాలైంది.

(P.Mahendar,News18,Nizamabad)

తాత్కాలిక ఆనందాన్ని ఇచ్చే శారీరక సుఖం కోసం నూరేళ్లు కలిసి ఉండాల్సిన భర్తను వద్దనుకుంది. వేద మంత్రాల సాక్షిగా మనువాడిన మొగుడ్ని ప్రియుడితో హత్య చేయించింది. తన వివాహేతర సంబంధం(Extramarital affair)కొనసాగించడానికి ఓ కిరాతకురాలు వేసిన పథకాన్ని పోలీసులు(Police) పసిగట్టారు. హత్య కేసులో తీగ లాగితే డొంక కదిలింది. కామారెడ్డి(Kamareddy) జిల్లాలో జరిగిన ఓ హత్య(Murder) కేసులో మూడో వ్యక్తి పాత్ర కూడా ఉన్నట్లుగా గుర్తించారు పోలీసులు.

Mulugu: వాళ్లు జల్సా రాయుళ్లు .. కేవలం వాటిని మాత్రమే మాయం చేస్తారు



ప్రియుడి చేతులతో భర్తకు కొరివి..

కామారెడ్డి జిల్లా  బిచ్కుందకు చెందిన బోధన్ హనుమబోయి అనే వ్యక్తికి అనురాధతో చాలా సంవత్సరాల క్రితం వివాహం జరిగింది. ఈ దంపతులకు ఇద్దరు దంప‌తుల‌కు ఇద్ద‌రు కుమార్తెలు ఉన్నారు. ఆనురాధ ఉంటున్న కాలనీలోనే ఉంటున్న పోష బోయితో వ్యక్తితో కొన్నేళ్లుగా వివాహేతర సంబంధం కొనసాగిస్తోంది. తనకు తన ప్రియుడికి మధ్యలో భర్త అడ్డుగా ఉన్నాడని భావించిన అనురాధ ఎలాగైనా అతడి అడ్డు తొలగించుకొని ఇద్దరూ శాశ్వతంగా కలిసి ఉండాలని భావించారు. ఇందులో భాగంగానే ప్రియుడికి భర్తను హత్య చేసే పనిని అప్పగించింది.

వివాహేతర సంబంధం కోసం..

పథకంలో భాగంగానే అనురాధ భర్త హ‌నుమ బోయిని రెండు రోజుల క్రితం ఆమె ప్రియుుడు పోష బోయితో పాటు అతని మిత్రుడు రమేష్ హనుమ బోయిని దౌల్తాపూర్ ఫారెస్ట్‌కి తీసుకెళ్లారు. అక్కడే ముగ్గురు కలిసి మద్యం తాగారు. హనుమబోయికి బాగా మద్యం తాగించి అతను మత్తులోకి జారుకోగానే తాడుతో గొంతుకు ముడివేసి చంపేశారు. చంపిన తర్వాత శవాన్ని అక్కడే వదిలేసి తాడు, హనుమ బోయి సెల్‌ఫోన్‌ని తీసుకొని వెళ్లిపోయారు. పోష బోయి , ర‌మేష్ ఇద్ద‌రు అదే రాత్రి బాన్సువాడకు వెళ్లి హత్యకు ఉపయోగించిన తాడు, మృతుడి సెల్‌ఫోన్‌ను బొల్ల‌క్ పల్లి వ‌ద్ద‌ మంజీర నదిలో ప‌డేశారు. రాత్రికి బాన్సువాడలోని బంధువుల ఇళ్లలో నిద్రపోయి తెల్లవారుజామున ఊరికి వెళ్లారు.

Marital murder : కొంప ముంచిన భర్త అనుమానం.. భార్యను ఏం చేశాడో తెలుసా ..?



భార్యే కిరాతకురాలు..

దౌల్తాబాద్‌ అటవీ ప్రాంతంలో వ్యక్తి హత్యకు గురైనట్లుగా తెలుసుకున్న పోలీసులు వివరాలు రాబట్టారు. కేసు నమోదు చేసుకొని అతని మృతుని భార్య అనురాధను విచారించారు. ఆమె పోలీసులకు పొంతన లేని సమాధానం చెప్పడంతో తమదైన స్టైల్లో విచారణ జరిపారు. తానే ప్రియుడితో కలిసి జీవించాలని భర్తను హత్య చేయించానని ఒప్పుకుంది. దీంతో పోలీసులు అనురాధతో పాటు ఆమె ప్రియుడు పోష బోయి, రమేష్‌ని అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు.

First published:

Tags: Kamareddy, Telangana crime news, Wife kill husband

ఉత్తమ కథలు