ఓవైపు భర్త.. మరో ముగ్గురితో వివాహేతర సంబంధం.. అలా వెలుగులోకి వచ్చిన ప్రియుడి హత్య..

ప్రతీకాత్మక చిత్రం

ఓ వివాహిత ముగ్గురు వ్యక్తులతో వివాహేతర సంబంధం పెట్టుకుంది. అందులో ఓ మైనర్ కుర్రాడు కూడా ఉన్నాడు.

  • Share this:
    ఓ వివాహిత ముగ్గురు వ్యక్తులతో వివాహేతర సంబంధం పెట్టుకుంది. అందులో ఓ మైనర్ కుర్రాడు కూడా ఉన్నాడు. అయితే ఈ క్రమంలోనే చోటుచేసుకున్న పరిణామాల నేపథ్యంలో ఆమె వివాహేతర సంంధం పెట్టుకున్న ఓ వ్యక్తిని హత్య చేసింది. ఇందుకు ఆమె భర్త, మైనర్ బాలుడు కూడా సహకరించాడు. 11 నెలల క్రితం జరిగిన ఈ నేరం.. తాజాగా వెలుగులోకి వచ్చింది. ఈ షాకింగ్ ఘటన తమిళనాడులోని తిరుపూర్ జిల్లాలో చోటుచేసుకుంది. వివరాలు.. చిన్నక్కంపాలయమ్‌కు చెందిన చిత్ర, రమేష్ దంపతులు. చిత్రకు 2020లో బంధువులలో ఒకరైన 16 ఏళ్ల కుర్రాడితో వివాహేతర సంబంధం పెట్టుకుంది. అలాగే మణికందన్ అనే 20 ఏళ్ల వ్యక్తితో కూడా ఆమె వివాహేతర సంబంధం కొనసాగించడం మొదలుపెట్టింది. చిత్ర, ఆమె భర్త రమేష్, మైనర్ బాలుడు, మణికందన్ నలుగురు కూడా కుండడామ్ పోలీస్ స్టేషన్ పరిధిలోని కతపులపట్టి గ్రామంలో పొలం పనులు చేసుకునేవారు.

    అయితే గతేడాది సెప్టెంబర్‌లో చిత్ర మైనర్ బాలుడు, మణికందన్‌లతో కలిసి సామాగ్రి కొనేందుకు కుండడామ్ ప్రాంతలోని మార్కెట్‌కు వెళ్లింది. అయితే ఆ సమయంలో మణికందన్‌కు, మైనర్ బాలుడిక మధ్య గొడవ చెలరేగింది. తాగి ఉన్న వారిద్దరు చిత్రతో రిలేషన్‌పై వాగ్వాదానికి దిగారు. మార్కెట్ నుంచి తిరిగి వచ్చిన తర్వాత కూడా వారిద్దరి మధ్య గొడవ కొనసాగింది. అయితే చిత్ర భర్త రమేష్ వారిద్దరిని శాంతిపజేయాలని చూశాడు. కానీ.. మణికందన్ రమేష్‌పైనే దాడికి దిగాడు. దీంతో చిత్ర, మైనర్ బాలుడు ఇద్దరు కలిసి మణికందన్‌‌ను అడ్డుకున్నారు. మణికందన్‌పై ఇనుప రాడ్‌తో దాడి చేయడంతో.. తీవ్రంగా గాయపడిన అతడు మృతిచెందాడు.

    దీంతో చిత్ర, ఆమె భర్త, మైనర్ బాలుడు.. ముగ్గురు కలిసి మణికందన్ మృతదేహాన్ని పొలాల్లోకి తీసుకెళ్లి కాల్చివేశారు. అయితే మణికందన్‌కు అతని కుటుంబంతో సన్నిహిత సంబంధాలు లేవు. ఈ క్రమంలోనే కుటుంబ సభ్యులు మణికందన్ కనిపించకపోయిన ఎలాంటి ఫిర్యాదు చేయలేదు.

    మరోవైపు చిత్ర 25 ఏళ్ల నందకుమార్ అనే వ్యక్తితో కొత్తగా సంబంధం పెట్టుకుంది. ఈ క్రమంలోనే ఆమె గర్భం దాల్చింది. దీంతో తనను జాగ్రత్తగా చూసుకోవాలని నందకుమార్‌ను కోరింది. అయితే నందకుమార్ ఆమెను దూరం పెట్టడం చేశాడు. దీంతో వారం క్రితం చిత్ర.. నందకుమార్‌పై బెదిరింపులకు పాల్పడింది. తాను చెప్పినట్టే చేయకపోతే మణికందన్‌ను హత్య చేసినట్టు చేయాల్సి వస్తుందని బెదిరించింది.

    ఆ తర్వాత నందకుమార్ ఇందుకు సంబంధించి పోలీసులకు సమాచారం ఇచ్చాడు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు.. నేరం జరిగిందో లేదో తెలుసుకోవడానికి చిత్ర, ఆమె భర్త, మైనర్ బాలుడిని అదుపులోకి తీసుకుని విచారించారు. ఆ తర్వాత హత్య చేసినందుకు, సాక్ష్యాలను మాయం చేసినందుకు ఐపీసీలోని సంబంధిత సెక్షన్ల కింద ముగ్గురిపై కేసు నమోదు చేశారు. ఆ తర్వాత ఫోరెన్సిక్ పరీక్ష నిమిత్తం మణికందన్ అస్థిపంజర అవశేషాలను వెలికి తీశారు.
    Published by:Sumanth Kanukula
    First published: