news18-telugu
Updated: August 25, 2019, 4:23 PM IST
చెరువులో అనుమానాస్పదంగా మహిళ మృతదేహం
కృష్ణా జిల్లాలో ఓ మహిళ అనుమానాస్పదంగా మృతి చెందింది. గన్నవరం మండలం మర్లపాలెం చెరువులో మహిళ మృతదేహం లభ్యమైంది. మృతురాలు పుష్పలతగా గుర్తి చేశారు. ఈమె గతంలో ఢిల్లీ పబ్లిక్ స్కూల్ టీచర్ గా పనిచేసింది. ప్రస్తుతం మేధా టవర్స్ లో ఓ సాఫ్ట్ వేర్ కంపెనీలో పని చేస్తున్నట్లు సమాచారం. పుష్పలత భర్త పేరు అనిల్ కుమార్. పశ్చిమగోదావరి జిల్లా, ఏలూరు శనివారపు పేట కి చెందినట్లు గుర్తింంచారు. అనిల్ కుమార్, పుష్పలత ఎనిమిదేళ్ల క్రితం ప్రేమ వివాహం చేసుకున్నారు. భార్య, భర్త ల మనస్పర్థలు కారణంగా భర్తతో ఆమె కొంతకాలంగా దూరంగా ఉంటున్నట్లు సమాచారం. ప్రస్తుతం గన్నవరంలోని రాంనగర్ ప్రాంతంలో పుష్పలత నివాసముంటున్నారు. గన్నవరం పోలీసులు చెరువు వద్ద కు చేరుకుని వివరాలు సేకరిస్తున్నారు. చెరువు వద్ద మహిళకు చెందిన స్కూటీ , హ్యాండ్ బ్యాగ్, కళ్ళజోడు, వాచ్ లభ్యం మైంది.
Published by:
Sulthana Begum Shaik
First published:
August 25, 2019, 4:23 PM IST