కామారెడ్డి జిల్లాలో వివాహిత దారుణ హత్య..

ఇటీవల రాజశేఖర్ కుటుంబ సభ్యులు అతనికి మరో పెళ్లి చేయాలనే ప్రయత్నాలు మొదలుపెట్టారు. ఇదే క్రమంలో వనిత కనిపించకుండా పోవడం కలకలం రేపింది.

news18-telugu
Updated: November 9, 2018, 3:01 PM IST
కామారెడ్డి జిల్లాలో వివాహిత దారుణ హత్య..
ప్రతీకాత్మక చిత్రం
news18-telugu
Updated: November 9, 2018, 3:01 PM IST
కామారెడ్డి జిల్లాలో ఓ వివాహిత దారుణ హత్యకు గురైంది. మూడున్నరేళ్లుగా తాను ప్రేమించుకున్న వ్యక్తితో సహజీవనం చేస్తోన్న ఆమె.. హఠాత్తుగా హత్యకు గురవడం పలు అనుమానాలకు తావిస్తోంది. ప్రియుడు, అతని తరుపు బంధువులే ఆమెను హత్య చేసి ఉంటారని అనుమానిస్తున్నారు.

వివరాల్లోకి వెళ్తే.. కామారెడ్డి జిల్లా రామారెడ్డి మండలం అన్నారం గ్రామానికి చెందిన వనిత చదువుకునే రోజుల్లో రాజశేఖర్ అనే యువకుడిని ప్రేమించింది. అయితే అతనితో పెళ్లికి నిరాకరించిన ఆమె తల్లిదండ్రులు మరొకరితో వివాహం జరిపించారు. దీంతో కొద్దిరోజులకే భర్త నుంచి విడిపోయి తిరిగి రాజశేఖర్ వద్దకు చేరుకుంది. అప్పటినుంచి ఇద్దరు కలిసి ఉంటున్నారు. ఈ క్రమంలో వీరికి వర్షిత్ అనే ఓ బాబు కూడా జన్మించాడు.

ఇటీవల రాజశేఖర్ కుటుంబ సభ్యులు అతనికి మరో పెళ్లి చేయాలనే ప్రయత్నాలు మొదలుపెట్టారు. ఇదే క్రమంలో వనిత కనిపించకుండా పోవడం కలకలం రేపింది. అక్టోబర్ 22న వనిత మిస్సింగ్ కేసు నమోదైంది. దీనిపై విచారణ చేపట్టిన పోలీసులు... ఇసాయిపేట అడవుల్లో ఆమె మృతదేహాన్ని గుర్తించారు. దీంతో వనితను హత్య చేసింది రాజశేఖర్, అతని బంధువులేనని ఆమె కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు.

First published: November 9, 2018
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...