ఇద్దరి మధ్య ఏం జరిగింది..? ఆమెను అతనే చంపేశాడా...?

తన భార్య ఉరేసుకుందని చెప్పి.. పెంచలయ్యను తీసుకుని పైకి వెళ్లాడు.అప్పటికే ఫ్యాన్‌కు వేలాడుతున్న ఆమె మృతదేహాన్ని కిందకు దించాడు. బయటకెళ్లి ఆటో తీసుకొస్తానని చెప్పి మళ్లీ తిరిగిరాలేదు.

news18-telugu
Updated: May 20, 2019, 11:11 AM IST
ఇద్దరి మధ్య ఏం జరిగింది..? ఆమెను అతనే చంపేశాడా...?
ప్రతీకాత్మక చిత్రం
  • Share this:
వారిద్దరికీ అది రెండో వివాహం.. రెండేళ్ల కాపురం తర్వాత ఓ పాప పుట్టింది. అంతా సాఫీగానే సాగుతుందనుకుంటున్న తరుణంలో ఆదివారం అనూహ్య ఘటన చోటు చేసుకుంది. ఏమైందో ఏమో తెలియదు గానీ.. ఇంట్లో భార్య విగతజీవిగా పడి ఉంది. పక్కనే చంటిబిడ్డ రోధిస్తూ ఉంది. భర్త పరారీలో ఉండటంతో అతనే ఈ హత్య చేసినట్టు అనుమానిస్తున్నారు. కడప జిల్లా రాజంపేటలో ఈ ఘటన చోటు చేసుకుంది.

పెనగలూరు మండలం ఎన్ఆర్ పురానికి చెందిన రామానుజమ్మ(27)కి రైల్వేకోడూరు మండలంలోని ఉప్పరపల్లెకు చెందిన శంకరయ్యకు రెండేళ్ల క్రితం వివాహం జరిగింది. ఇద్దరికీ ఇది రెండో వివాహం. బతుకుదెరువు కోసం కొన్నాళ్లుగా కడప జిల్లా రాజంపేటలో ఉంటున్నారు. ఇదే క్రమంలో ఆదివారం శంకరయ్య తన ఇంటి నుంచి కింది అంతస్తుకు పరిగెత్తుకొచ్చి.. తన భార్య చనిపోయినట్టుగా పెంచలయ్య అనే వ్యక్తితో చెప్పాడు.

తన భార్య ఉరేసుకుందని చెప్పి.. పెంచలయ్యను తీసుకుని పైకి వెళ్లాడు.అప్పటికే ఫ్యాన్‌కు వేలాడుతున్న ఆమె మృతదేహాన్ని కిందకు దించాడు. బయటకెళ్లి ఆటో తీసుకొస్తానని చెప్పి మళ్లీ తిరిగిరాలేదు.దీంతో అతను పరారైనట్టు నిర్దారించుకున్న పెంచలయ్య పోలీసులకు ఫిర్యాదు చేశాడు. తల్లి మృతదేహం పక్కన చంటిబిడ్డ రోధిస్తుంటే స్థానికులు కంటతడి పెట్టుకున్నారు. చిన్నారిని ఓదార్చడం ఎవరి వల్లా కాలేదు. అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్త ప్రారంభించారు. పెంచలయ్యనే ఆమెను హత్య చేసి ఉంటాడా? అని అనుమానిస్తున్నారు.

First published: May 20, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు
?>