Home /News /crime /

MARRIED WOMAN SHOCKED TO SEE HER OBSCENE VIDEOS IN SOCIAL MEDIA HUSBAND IS THE MAIN CULPRIT AK

సోషల్ మీడియాలో యువతి అశ్లీల వీడియోలు.. షాకైన అమ్మాయి.. ఇది ఎవరి పనంటే..

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

తన భర్త మనసులో క్రూరమైన ఆలోచన ఉందని ఆమెకు అప్పటివరకు తెలియదు. తనకు సంబంధించిన అశ్లీల వీడియో, ఫోటో సోషల్ మీడియాలో వైరల్ కావడం మహిళకు షాక్ ఇచ్చేలా చేసింది.

    ప్రేమలో మోసాలు గురించి మనం అనేకసార్లు వింటుంటాం. కానీ కట్టుకున్న భర్త భార్యను మోసం చేయడం.. అది కూడా ఎవరూ ఊహించని విధంగా ఆమెను వేధించడం గురించి చాలా తక్కువసార్లు వినుంటాం. చందౌలీలోని ఇలియా ప్రాంతంలో మోసానికి సంబంధించిన విచిత్రమైన కథ తెరపైకి వచ్చింది. ఇక్కడ ఓ దుర్మార్గుడైన యువకుడు మొదట అమ్మాయిని (Girl) తన ప్రేమ(Love) వలలో వేసుకున్నాడు. తన ప్రేమలో ఆమె పూర్తిగా కూరుకుపోయి తన మాట తప్ప మరెవరి మాట వినకుండా ఉండేలా చేసుకున్నాడు. ఆ తరువాత అమ్మాయితో కలిసి ఇంటి నుంచి పారిపోయి ఆమెను పెళ్లి చేసుకున్నాడు. తన భర్త గురించి ఆమె అప్పటివరకు గొప్పగా ఊహించకుంది. తన భర్త ప్రేమకు మరేది సాటిరాదని ఆ మహిళ భావించింది.

    కానీ తన భర్త మనసులో క్రూరమైన ఆలోచన ఉందని ఆమెకు అప్పటివరకు తెలియదు. తనకు సంబంధించిన అశ్లీల వీడియో, ఫోటో సోషల్ మీడియాలో వైరల్ కావడం మహిళకు షాక్ ఇచ్చేలా చేసింది. దీనిపై ఆమె నిరసన వ్యక్తం చేయడంతో తన భర్త తనను కొట్టి ఇంట్లో నుంచి వెళ్లగొట్టాడని బాలిక ఆరోపించింది. ఈ ఘటనతో బాధిత యువతి పోలీస్ స్టేషన్‌కు చేరుకుని యువకుడిపై కేసు పెట్టింది. బాలిక ఇచ్చిన వివరాల ప్రకారం.. తియేరీ గ్రామానికి చెందిన సుజిత్ యాదవ్ బాలికను తన ప్రేమ వలలో ఇరికించి 3 నెలల క్రితం లక్నోకు తీసుకెళ్లాడు.



    అక్కడ గుడికి వెళ్లి పెళ్లి చేసుకున్నాడు. మే 20వ తేదీన సుజిత్ తన ఇంటికి తియేరీకి వచ్చి అసభ్యకరమైన వీడియోలు, ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ చేశాడని ఆరోపించారు. ఆ వీడియో ఫోటో వైరల్ అయిందని తన భర్తకు తెలియడంతో ఆమె తీవ్ర ప్రతిఘటన వ్యక్తం చేసింది. దీనిపై భర్త సుజిత్ ఆమెను కొట్టి ఇంటి నుంచి వెళ్లగొట్టాడు.

    Udaipur Murder : కన్హయ్యలాల్ అంత్యక్రియలకు వేలాదిగా జనం.. ఎన్ఐఏకు కేసు అప్పగింత

    AP Crime News : కర్నూలు జిల్లాలో ప్రేమ జంట ఆత్మహత్య.. ఇష్టంలేని పెళ్లి చేశారని రైలు కిందపడి..

    దీంతో బాలిక ఇలియా పోలీస్ స్టేషన్‌కు చేరుకుని జరిగిన ఘటనపై ఫిర్యాదు చేసింది. పోలీసులు యువకుడిపై వైద్య పరీక్షలతో పాటు ఐపిసి సెక్షన్ 376, 354, 323, 504 మరియు 67a కింద కేసు నమోదు చేశారు. బాలిక ఫిర్యాదు ఆధారంగా సంబంధిత సెక్షన్ల కింద కేసు నమోదు చేయడంతో పాటు ఆమెకు వైద్య పరీక్షలు చేశామన్నారు. త్వరలో నిందితులను పట్టుకుంటామన్నారు.
    Published by:Kishore Akkaladevi
    First published:

    Tags: Crime news

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు