MARRIED WOMAN RUNAWAY FROM HOME WITH YOUNG BOY IN KARUR DISTRICT TAMILNADU SSR
Married Woman: ఇద్దరూ కలిసి ఊహించని ట్విస్ట్ ఇచ్చారు.. ఈమె భర్త చివరికి ఏం చేయాలో అర్థం కాక..
మణికందన్, ప్రీతి
వివాహేతర సంబంధాలు చివరికి అనర్ధాలకు దారితీస్తాయని ఎన్ని ఘటనలు రుజువు చేస్తున్నా కొందరి తీరు మారడం లేదు. క్షణిక సుఖాల కోసం వెంపర్లాడుతూ బంగారం లాంటి జీవితాలను చేజేతులా నాశనం చేసుకుంటున్నారు.
కరూర్: వివాహేతర సంబంధాలు చివరికి అనర్ధాలకు దారితీస్తాయని ఎన్ని ఘటనలు రుజువు చేస్తున్నా కొందరి తీరు మారడం లేదు. క్షణిక సుఖాల కోసం వెంపర్లాడుతూ బంగారం లాంటి జీవితాలను చేజేతులా నాశనం చేసుకుంటున్నారు. ఇలాంటి ఘటనే తమిళనాడులోని కరూర్ జిల్లా కృష్ణరాయపురం సమీపంలోని పప్పనంపట్టి అనే గ్రామంలో వెలుగుచూసింది.
పూర్తి వివరాల్లోకి వెళితే.. గ్రామానికి చెందిన ప్రీతి(26), గోవిందరాజ్ భార్యాభర్తలు. గోవిందరాజ్ జేసీబీ డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. అతని భార్యతో పాటు ఆరేళ్ల కొడుకు, నాలుగేళ్ల వయసున్న కూతురు ఉంది. మరో నాలుగు నెలల పాప కూడా పుట్టింది.
ఇదిలా ఉండగా.. ఇదే ప్రాంతానికి చెందిన మణికందన్ అనే 22 ఏళ్ల యువకుడు స్థానికంగా ఉన్న ఓ పాల డెయిరీకి చెందిన వాహనానికి డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. మణికందన్‌తో గోవిందరాజు భార్య ప్రీతికి పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం కాస్తా ఇద్దరి మధ్య వివాహేతర సంబంధానికి దారితీసింది. భర్త, ముగ్గురు పిల్లలను కాదనుకుని.. నాలుగు నెలల పాప ఉందనే కనీస కనికరం లేకుండా ప్రీతి డిసెంబర్ 15న మణికందన్‌తో కలిసి వెళ్లిపోయింది. గోవిందరాజు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. తన భార్య కనిపించడం లేదని.. తనకు ఒకరిపై అనుమానం ఉందని పోలీసులకు చెప్పాడు. పోలీసులు మిస్సింగ్ కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేశారు. ప్రీతి, మణికందన్ సెల్ ఫోన్ల నెట్‌వర్క్‌ను ట్రాక్ చేశారు. ఇద్దరూ చెన్నైలో ఉన్నట్టుగా పోలీసులు గుర్తించారు.
అసిస్టెంట్ ఇన్స్పెక్టర్ చిత్రాదేవి ఆధ్వర్యంలో ఇద్దరినీ చింతమణిపట్టి పోలీస్ స్టేషన్‌కు పోలీసులు తీసుకొచ్చారు. భర్తతో వెళ్లేందుకు ప్రీతి నిరాకరించింది. అయితే.. ఈ కేసులో ట్విస్ట్ ఏంటంటే.. మణికందన్ కూడా మరెవరో కాదు గోవిందరాజుకు తమ్ముడు వరుస అవుతాడు. ఇద్దరి మధ్య బంధుత్వం ఉంది. ఆ బంధుత్వాన్ని అడ్డం పెట్టుకుని తరచూ ఇంటికి వస్తూపోతూ ఉన్న క్రమంలో గోవిందరాజు భార్య ప్రీతితో మణికందన్ పరిచయం పెంచుకున్నాడు. అయితే.. మరిది వరుసయ్యే వ్యక్తితో వివాహేతర సంబంధం పెట్టుకున్న ప్రీతి కూడా ఇప్పుడు అతనితో ఉంటానని, భర్త దగ్గరకు వెళ్లనని చెప్పడం ఈ కేసులో కొసమెరుపు. ఈ విషయంలో అసిస్టెంట్ కమిషనర్ చిత్రాదేవితో గోవిందరాజు గొడవపడిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
Published by:Sambasiva Reddy
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.