గుంటూరులో దారుణం... భర్త సహకారంతో వదినపై మరుదుల అత్యాచారం

నాలుగో మరిది పాలల్లో మత్తు ట్యాబ్లెట్లు కలిపి ఇచ్చి, ఆమె మత్తులోకి జారుకున్నాక అత్యాచారం చేశాడు.

news18-telugu
Updated: December 10, 2019, 7:37 AM IST
గుంటూరులో దారుణం... భర్త సహకారంతో వదినపై మరుదుల అత్యాచారం
ప్రతీకాత్మక చిత్రం
  • Share this:
అమ్మ తర్వాత... వదినను తల్లితో సమానంగా భావిస్తారు. అలనాటి పాత సినిమాల్లో కూడా వదినకు కుటుంబంలో ఉన్న ప్రాముఖ్యతను ఎంతో గొప్పగా చూపించారు. కానీ ఈ కలియుగంలో తల్లిలాంటి వదినమ్మపై కూడా తన కుటుంబసభ్యులే పైశాచికత్వం ప్రదర్శిస్తున్నారు. వదినపై సొంత మరుదులే అత్యాచారానికి ఒడిగట్టిన దారుణ ఘటన గుంటూరులో జరిగింది. సైగా వారికి సహకరించాల్సిందిగా భర్త, అత్తమామలు ఒత్తిడి తేవడంతో ఆ బాధితురాలి దిక్కుతోచని పరిస్థితుల్లో పోలీసుల్ని ఆశ్రయించింది. గుంటూరు అర్బన్‌లో నిర్వహించిన ‘స్పందన’ కార్యక్రమంలో తన బాధను తెలుపుతూ కన్నీరుమున్నీరయ్యింది.

బాధితురాలు చెప్పిన వివరాల ప్రకారం పాత గుంటూరుకు చెందిన బాధితురాలికి 2011లో వివాహమైంది. ఉద్యోగం చేస్తున్న ఆమె విధులు ముగించుకుని ఇంటికి వచ్చే సరికి మామ కాళ్లు పట్టాలంటూ కుటుంబ సభ్యులు ఆమెపై ఒత్తిడి చేసేవాళ్లు. దీంతో ఆమె అలాగే చేసేది. ఈ క్రమంలో అతడు కోడలితో అసభ్యంగా ప్రవర్తించేవాడు. ఆ తర్వాత ఇద్దరు మరుదులు ఆమెపై అత్యాచారానికి తెగబడ్డారు. నాలుగో మరిది పాలల్లో మత్తు ట్యాబ్లెట్లు కలిపి ఇచ్చి, ఆమె మత్తులోకి జారుకున్నాక అత్యాచారం చేశాడు.

పాపం ఆమె ఈ విషయాన్ని భర్తకు చెబితే అలా ఇష్టం అయితేనే ఉండాలని చెప్పడంతో బాధితురాలు షాక్ తింది. లేదంటే వెళ్లిపోవాలని భర్త హెచ్చరించడంతో వారి అరాచకాలు భరించలేని ఆమె వేధింపుల కేసు పెట్టింది. దీంతో నిందితులు ఆమెపై దొంగతనం కేసు పెట్టి  అరెస్ట్ చేయించారు. ఇప్పుడు విడాకులు ఇవ్వాలని బెదిరిస్తున్నారని, తన ప్రాణాలకు ముప్పు పొంచి ఉందని బాధితురాలు కన్నీళ్లు పెట్టుకుంది. తనకు రక్షణ కల్పించాలని వేడుకుంది.

First published: December 10, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు
?>