MARRIED WOMAN MIXES POISON IN MILK AND COMMITS SUICIDE WITH HER TWO DAUGHTERS SSR
Married Woman: ఎంతపని చేశావమ్మా.. 10 నెలల పసిపాపకు కూడా ఆ పాలు ఎలా ఇచ్చావమ్మా..!
సురేంద్ర, వాణి, అక్షయ, భావన
ఆదివారం ఉదయం ఆటో కిరాయికి వెళ్లిన సురేంద్ర మధ్యలో రెండుసార్లు ఇంటికి వచ్చి వెళ్లినట్లు స్థానికులు చెబుతున్నారు. మధ్యాహ్నం అందరూ కలిసే తిన్నారని, ఆ తర్వాత సురేంద్ర మళ్లీ ఆటోకు వెళ్లాడని చెప్పారు. సురేంద్ర సాయంత్రం వెళ్లే సమయంలో ఏం జరిగిందో తెలియదు గానీ..
పాయకాపురం: కన్న తల్లి విషం కలిపిన పాలను బిడ్డలకు ఇచ్చి, తానూ తాగి ఆత్మహత్యకు పాల్పడింది. విషం కలిపిన పాలు తాగడంతో తల్లి, ఆ ఇద్దరు చిన్నారులు కన్నుమూశారు. ఈ విషాద ఘటన కృష్ణా జిల్లా నున్నలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. గుంటూరు జిల్లా తాడేపల్లికి చెందిన వాణికి, కృష్ణా జిల్లా నున్న ప్రాంతానికి చెందిన సురేంద్రకు నాలుగేళ్ల క్రితం వివాహమైంది. వీరికి అక్ష(10 నెలలు), భావన(3) సంతానం. సురేంద్ర చిల్లర కొట్టు వ్యాపారం చేస్తుండేవాడు. ఈ మధ్య కొన్నాళ్ల నుంచి చిల్లర కొట్టు వ్యాపారం సరిగ్గా సాగకపోవడంతో సురేంద్ర ఆటో కూడా నడుపుతూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. కుటుంబంలో ఏర్పడిన ఆర్థిక ఇబ్బందుల కారణంగా భార్యాభర్తల మధ్య ఇటీవల మనస్పర్థలు చోటుచేసుకున్నాయి. చీటికీమాటికీ ఇద్దరూ గొడవ పడుతుండేవారు. కట్నంగా ఇస్తామన్న అర ఎకరం పొలం ఇవ్వకపోవడంతోనే తనకు ఈ పరిస్థితి వచ్చిందని సురేంద్ర కొన్నిరోజులుగా భార్యను సూటిపోటి మాటలతో వేధించాడు. ఈ గొడవలు జరుగుతున్నప్పటి నుంచి వాణి తీవ్ర మనస్తాపానికి లోనైంది. ఈ క్రమంలోనే.. ఆదివారం రాత్రి సురేంద్ర ఇంట్లో లేని సమయంలో వాణి తన ఇద్దరు కూతుర్లతో పాలల్లో విషం కలిపి తాగించింది. ఆ తర్వాత తాను కూడా ఆ పాలను తాగింది. ఆదివారం ఉదయం ఆటో కిరాయికి వెళ్లిన సురేంద్ర మధ్యలో రెండుసార్లు ఇంటికి వచ్చి వెళ్లినట్లు స్థానికులు చెబుతున్నారు. మధ్యాహ్నం అందరూ కలిసే తిన్నారని, ఆ తర్వాత సురేంద్ర మళ్లీ ఆటోకు వెళ్లాడని చెప్పారు. సురేంద్ర సాయంత్రం వెళ్లే సమయంలో ఏం జరిగిందో తెలియదు గానీ.. వాణి పిల్లలతో సహా ఆత్మహత్య చేసుకోవాలని నిర్ణయించుకుంది. భర్త వెళ్లిపోగానే క్షణికావేశంలో నిర్ణయం తీసుకుంది. వాణి, పిల్లలు వాంతులు చేసుకుంటూ కుప్పకూలిపోవడంతో గమనించిన ఇరుగుపొరుగు వారు సురేంద్రకు సమాచారమిచ్చారు. వెంటనే సురేంద్ర ఇంటికొచ్చి చూసేసరికి పిల్లలు వాంతులు చేసుకుంటూ ఇబ్బంది పడుతున్నారు. వాణి కూడా అస్వస్థతకు లోనైంది.
భార్యా, పిల్లలను వెంటనే సురేంద్ర ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించాడు. పరిస్థితి విషమించడంతో విజయవాడ గవర్నమెంట్ ఆసుపత్రికి తీసుకెళ్లాడు. చిన్నారులను మెరుగైన వైద్యం కోసం గుంటూరుకు తరలిస్తుండగా, దారి మధ్యలో ఒకరు, ఆసుపత్రిలో మరొకరు కన్నుమూశారు. వాణి కూడా సోమవారం మధ్యాహ్నం చనిపోయింది. 10 నెలల వయసున్న అక్షయకు తల్లి వాణి పురుగుల మందు తాగించడంతో స్థానికులు విస్మయం వ్యక్తం చేశారు.
నోటి వెంట, ముక్కు వెంట రక్తం కారుతూ కొన ప్రాణంతో కొట్టుమిట్టాడుతున్న ఆ చిన్నారి ఆసుపత్రిలో మృత్యువుతో కొన్ని గంటలు పోరాడి తనువు చాలించింది. చికిత్స చేస్తున్న సందర్భంలో అక్షయ ఎక్కిళ్లు పెడుతూ అక్కడ ఉన్నవారిని కళ్లతో చూస్తున్న దృశ్యాలు హృదయ విదారకంగా ఉన్నాయని కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరయ్యారు.
Published by:Sambasiva Reddy
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.