news18-telugu
Updated: August 1, 2019, 12:21 PM IST
ప్రతీకాత్మక చిత్రం
తెలుగు రాష్ట్రాల్లో కిడ్నాప్‌లు కలకలం సృష్టిస్తున్నాయి. తూర్పుగోదావరి జిల్లాలో నాలుగేళ్ల బాలుడి కిడ్నాప్,హయత్‌నగర్‌లో యువతి కిడ్నాప్ ఉదంతాలు మరిచిపోకముందే.. మరో వివాహిత అదృశ్యం కలకలం రేపుతోంది. హైదరాబాద్ గాజుల రామారంలో అత్త మామలతో కలిసి నివాసముంటున్న ఊహశ్రీ అనే వివాహిత జులై 5వ తేదీ నుంచి కనిపించకుండా పోయింది. ఊహశ్రీ మామ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో విషయం వెలుగులోకి వచ్చింది.
వివరాల్లోకి వెళ్తే.. కర్నూలు జిల్లా నంద్యాల ఎస్బీఐ కాలనీకి చెందిన ఊహశ్రీకి హైదరాబాద్ గాజుల రామారానికి చెందిన నాగరాజు, శాంతమ్మ దంపతుల కుమారుడు మురళితో రెండేళ్ల క్రితం వివాహం జరిగింది. పెళ్లయిన కొన్నాళ్లకే ఉద్యోగ రీత్యా భర్త విదేశాలకు వెళ్లిపోవడంతో ఊహశ్రీ ఆమె అత్త మామలతో కలిసి ఉంటోంది. కొన్నినెలల క్రితం ఊహశ్రీ అత్త అనారోగ్యం పాలైంది. అప్పటినుంచి ఆమె వేరేచోట చికిత్స పొందుతోంది. దీంతో ఊహశ్రీ, ఆమె మాత్రమే ఇంట్లో ఉంటున్నారు.
ఇదే క్రమంలో జులై 5వ తేదీన ఎప్పటిలాగే ఊహశ్రీ మామ ఉదయాన్నే ఆఫీసుకు వెళ్లాడు. సాయంత్రం ఇంటికి తిరిగొచ్చాక.. ఊహశ్రీ కనిపించలేదు. ఊహశ్రీ తల్లిదండ్రులకు,బంధువులకు ఫోన్ చేసినా లాభం లేకపోయింది. దీంతో జీడిమెట్ల పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయగా మిస్సింగ్ కేసు నమోదైంది. జులై 9వ తేదీన ఓ వ్యక్తితో కలిసి ఆమె ఒంగోలులో కనిపించినట్టుగా ఊహశ్రీ తల్లిదండ్రులకు సమాచారం అందింది. పోలీసులకు మాత్రం ఆమె ఆచూకీ దొరకలేదు. దీంతో ఊహ శ్రీ ఏమై ఉంటుందని తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు.
Published by:
Srinivas Mittapalli
First published:
August 1, 2019, 12:21 PM IST