MARRIED WOMAN KILLS HUSBAND WITH HELP OF LOVER IN CHITTOOR DISTRICT BS
ప్రియుడితో కలిసి పక్కా ప్లాన్.. భర్తను లారీతో ఢీకొట్టించి.. చిత్తూరు జిల్లాలో దారుణం..
ప్రతీకాత్మక చిత్రం
వారిద్దరిది ప్రేమ వివాహం.. ముగ్గురు పిల్లలు కూడా పుట్టారు.. వాళ్ల జీవితం అన్యోన్యంగానే సాగింది.. కొన్నాళ్లకు ఆమె మరొకరి మోజులో పడింది. ఆ మోజు చివరికి భర్తనే చంపించేంతలా మారింది. ఈ దారుణ ఘటన చిత్తూరు జిల్లా మదనపల్లెలో చోటుచేసుకుంది.
వారిద్దరిది ప్రేమ వివాహం.. ముగ్గురు పిల్లలు కూడా పుట్టారు.. వాళ్ల జీవితం అన్యోన్యంగానే సాగింది.. కొన్నాళ్లకు ఆమె మరొకరి మోజులో పడింది. ఆ మోజు చివరికి భర్తనే చంపించేంతలా మారింది. ఈ దారుణ ఘటన చిత్తూరు జిల్లా మదనపల్లెలో చోటుచేసుకుంది. వివరాల్లోకెళితే.. కడప జిల్లా పెద్దమండ్యం మండలం సిద్దవరం పంచాయతీ చెరువు ముందరపల్లెకు చెందిన బాలసుబ్రహ్మణ్యం(35)కు 11ఏళ్ల క్రితం చిత్తూరు జిల్లా మదనపల్లెలోని నీరుగట్టువారిపల్లెకు చెందిన రేణుకతో పెళ్లైంది. అప్పటికే వీరిద్దరు ప్రేమించుకొన్నారు కూడా. అయితే, తిరుపతిలో పని చేసే బాల సుబ్రహ్మణ్యం కుటుంబానికి దూరంగా ఉండటంతో అతడి భార్య నాగిరెడ్డి అనే వ్యక్తితో సన్నిహితంగా మెలిగింది. ఈ విషయం తెలిసిన బాల సుబ్రహ్మణ్యం ఆమెను మందలించాడు. ఈ క్రమంలో ఇద్దరికి గొడవ జరిగింది. తన భర్త వేధిస్తున్నాడని, ఎలాగైనా చంపాలని కుట్ర పన్నింది.
లాక్డౌన్ నడుస్తున్నా.. సిమెంట్ లారీతో ఢీకొట్టించాలని నాగిరెడ్డితో కలిసి పథకం వేసింది. తనకు జ్వరం వచ్చినట్లు నాటకాలు ఆడి.. భర్తను మందులు తెమ్మని శనివారం రాత్రి బయటికి పంపింది. బైక్పై వెళ్లిన అతడ్ని.. లారీతో ఢీకొట్టించారు. అతడు అక్కడికక్కడే మృతిచెందాడు. అయితే, మృతుడి సోదరుడి ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. విచారణ చేపట్టగా ఈ విషయం వెలుగులోకి వచ్చింది. నిందితులను అరెస్టు చేసి కటకటాల్లోకి నెట్టారు.
Published by:Shravan Kumar Bommakanti
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.