• HOME
 • »
 • NEWS
 • »
 • CRIME
 • »
 • MARRIED WOMAN KILLED HER FIVE YEAR CHILD OVER EXTRA MARITAL AFFAIR IN GUJARAT RAJKOT SU

ప్రేమించినవాడిని పెళ్లిచేసుకుంది.. అంతలోనే పక్కింటి కుర్రాడితో వివాహేతర సంబంధం.. చివరకు ఎంత నీచమైన పనిచేసిందంటే..

ప్రేమించినవాడిని పెళ్లిచేసుకుంది.. అంతలోనే పక్కింటి కుర్రాడితో వివాహేతర సంబంధం.. చివరకు ఎంత నీచమైన పనిచేసిందంటే..

నిందితులు అమీషా, మున్నా

ప్రేమించిన వాడితో కలిసి జీవనం సాగించిన యువతి.. ఓ బాబుకు జన్మనిచ్చింది. ఆ తర్వాత తమ పెళ్లిని రిజిస్టర్ చేయించుకోంది. అయితే అంతలోనే ఆమె పక్కింటి కుర్రాడితో వివాహేతర సంబంధం పెట్టుకుంది.

 • Share this:
  పక్కింటి కురాడితో ఏర్పడిన పరిచయం వివాహేతర సంబంధానికి దారితీసింది. అప్పటికే ప్రేమించిన వ్యక్తిని పెళ్లి చేసుకున్న యువతి.. పక్కింటి కుర్రాడితో కలిసి వెళ్లిపోయేందుకు సిద్ధమైంది. ఇందుకు అడ్డుగా ఉన్న 5 నెలల అభం శుభం తెలియని చిన్నారిని ప్రియుడితో కలిసి దారుణంగా హత్య చేసింది ఆ తల్లి. ఈ అమానవీయ ఘటన గుజరాత్‌లోని రాజ్‌కోట్‌లో చోటుచేసుకుంది. ఈ కేసుకు సంబంధించిన వివరాలను రాజకోట్ సిటీ పోలీస్ కమిషనర్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో పోలీసు ఉన్నతాధికారులు వెల్లడించారు. రాజ్‌కోట్‌లో నివసించే అమీషాకు ఏడాదిన్నర క్రితం గొండాల్‌కు చెందిన హితేష్ అనే వ్యక్తితో పరిచయం ఏర్పడింది. అది కాస్తా వారి మధ్య స్నేహంగా మారింది. ఆ తర్వాత వారు భార్య, భర్తలుగా కలిసి జీవించడం మొదలుపెట్టారు. ఈ క్రమంలోనే వారికి ఓ బాబు జన్మించాడు. అతడికి ధార్మిక్ అని పేరు పెట్టారు. ఆ సమయంలోనే వారి పెళ్లిని రిజిస్టర్ చేయించుకున్నారు.

  అయితే హితేష్ డ్రైవర్‌గా పనిచేస్తూ అమీషాను, బాబును పోషించేవాడు. డ్రైవర్ కావడం వల్లే హితేష్ తరుచూ.. ఇతర ప్రదేశాలకు వెళ్లాల్సి వచ్చేది. అయితే ఆ సమయంలో పక్కింటిలో ఉండే మున్నా అనే వ్యక్తి‌తో అమీషాకు పరిచయం ఏర్పడింది. అతడు కూడా తరచూ అమీషా ఇంటికి వచ్చి వెళ్తుండేవాడు. అమీషాకు కొన్ని పనుల్లో సాయం కూడా చేసేవాడు. ఈ క్రమంలోనే వారి మధ్య వివాహేతర సంబంధం ఏర్పడింది. దీంతో అమీషా.. మున్నాతో కలిసి వెళ్లిపోవాలని డిసైడ్ అయింది. అయితే అమీషాకు అప్పటికే ఉన్న బాబును మున్నా అంగీకరించలేదు. దీంతో వారిద్దరు కలిసి బాబును చంపాలని నిర్ణయించుకున్నారు. ఫిబ్రవరి 18న హితేష్ పని మీద గాంధీనగర్ వెళ్లాడు. ఆ సమయంలో అమీషా.. బాబకు జ్వరంగా ఉందని చెప్పి రాజ్‌కోట్‌కు తీసుకెళ్లింది. అక్కడ బాలుడికి రసాయనాలు కలిపిన పాలను తాగించింది. ఆ రోజు పొద్దున, సాయంత్రం ఆ పాలను పట్టించింది.  దీంతో బాబు ఫిబ్రవరి 19వ తేదీన అపస్మార స్థితిలోకి వెళ్లిపోయాడు. దీంతో అమీషా బాబు మృతదేహాన్ని మున్నా సాయంతో శ్మశాన వాటికలో పుడ్చిపెట్టింది. అయితే గాంధీనగర్‌లో ఉన్న హితేష్‌కు ఫోన్ చేసి.. బాబు శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది తలెత్తడం వల్ల చనిపోయాడని చెప్పింది. ఆస్పత్రులకు తీసుకెళ్లిన లాభం లేకపోయిందని.. చనిపోయిన బాలుడిని శ్మశాన వాటికలో ఖననం చేసినట్టు తెలిపింది. ఇక, ఆ తర్వాత ఐదు రోజులకు అమీషా, మున్నాతో కలిసి పారిపోయింది. కొన్ని వారాల తర్వాత వారిద్దరు తిరి గొండాల్ చేరకుని కలిసి జీవనం సాగించడం మొదలుపెట్టారు.

  క్యాబ్‌లో బయలుదేరిన ఐటీ ఉద్యోగిని.. ఆ చిన్న పని ఆమె కొంప ముంచింది.. స్పృహలోకి వచ్చేసరికి హోటల్ రూమ్‌లో షాకింగ్ సీన్..

  Telangana: స్వచ్ఛందంగా లాక్‌డౌన్.. సాయంత్రం 6.30 గంటల తర్వాత ఆ దుకాణాలు బంద్..

  అయితే అమీషా ప్రవర్తనపై అనుమానవం వచ్చిన హితేష్.. ఈ ఘటనపై గొండాల్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులుకు ఫిర్యాదు చేశాడు. దీంతో విచారణ చేపట్టిన పోలీసులు అమీషా ఈ హత్య చేసినట్టుగా నిర్దారణకు వచ్చారు. అందకు మున్నా సాయం చేశాడని విచారణలో తేల్చారు. అమీషా, మున్నాలు కూడా పోలీసుల విచారణలో అసలు నిజం ఒప్పుకున్నారు. ఆ తర్వాత సబ్ డివిజినల్ మేజిస్ట్రేట్ పర్యవేక్షణలో బాలుడి మృతదేహం పూడ్డిపెట్టిన చోటు నుంచి బయటకు తీశారు. అనంతరం మృతదేహాన్ని ఫోరెన్సిక్ పోస్ట్‌మార్టమ్ నిమిత్తం పంపించారు. ఇద్దరు నిందితులను అరెస్ట్ చేశారు.
  Published by:Sumanth Kanukula
  First published:

  అగ్ర కథనాలు