Home /News /crime /

MARRIED WOMAN KIDNAPPED AND RAPED IN GUTUR DISTRICT NS

Guntur Rape: గుంటూరు జిల్లాలో ఘోరం.. మహిళను ఎత్తుకెళ్లి.. నోటిలో గుడ్డలు కుక్కి అఘాయిత్యం

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

Guntur Rape: గుంటూరు జిల్లాలో దారుణ ఘటన చోటు చేసుకుంది. వివాహితను ఓ దుర్మార్గుడు బలవంతంగా ఎత్తుకెళ్లి నోట్లో గుడ్డలు కుక్కి అఘాయిత్యానికి పాల్పడ్డాడు.

    దేశవ్యాప్తంగా మహిళలపై దాడులు, అఘాయిత్యాలు ఆగడం లేదు. నిత్యం ఎక్కడో చోట ఇలాంటి దారుణాలు వెలుగు చూస్తూనే ఉన్నాయి. ప్రభుత్యాలు ఎన్ని కఠిన చర్యలు తీసుకుంటున్నా.. దిశ పోలీస్ స్టేషన్లు, షీటీమ్స్ లాంటి ప్రత్యేక వ్యవస్థలు ఏర్పాటు చేస్తున్నా మానవ మృగాలు ఏ మాత్రం భయపడడం లేదు. తాజాగా గుంటూరు జిల్లాలో ఇలాంటి దారుణ ఘటన వెలుగు చూసింది. వివాహితను ఓ దుర్మార్గుడు బలవంతంగా ఎత్తుకెళ్లి నోట్లో గుడ్డలు కుక్కి అఘాయిత్యానికి పాల్పడ్డాడు. రాత్రి నుంచి ఉదయం వరకు ఆ మహిళను బంధించి ఇంట్లోనే ఉంచుకున్నాడు. ఈ ఘటనతో స్థానికులు ఉలిక్కిపడ్డారు.

    పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. గుంటూరు జిల్లాలోని పెదకూరపాడు మండలం పొడపాడుకు చెందిన ఓ మహిళ గత రాత్రి ఇంటికి సమీపంలో ఉన్న ఓ దుకాణం వద్దకు వెళ్లింది. స్థానికంగా ఉన్న జొన్నలగడ్డ శాంతిరాజు అనే వ్యక్తి ఆ మహిళపై కన్నేశాడు. ఆమె రాత్రి పూట షాపు వద్దకు రావడాన్ని గమనించిన ఆ కామందుడు ఇదే అదనుగా భావించాడు. దీంతో ఆమెను ఎత్తుకెళ్లి ఇంట్లో కట్టేశాడు. ఆమె అరుపులు బయటకు వినిపించకుండా నోట్లో గుడ్డలు కుక్కాడు. అనంతరం ఆమెపై అఘాయిత్యానికి పాల్పడ్డాడు. అయితే షాప్ కు వెళ్లి వస్తానని చెప్పి వెళ్లిన మహిళ ఎంతకూ ఇంటికి రాకపోవడంతో ఆమె కుటుంబీకులు తీవ్ర ఆందోళన వ్యక్తమైంది. మరుసటి రోజు ఉదయం బాధితురాలి వదిన పోలీసులకు కంప్లైంట్ ఇచ్చింది.

    అయితే శాంతిరాజుపై అనుమానం రావడంతో అతని ఇంటిలోకి వెళ్లి చూడగా బాధిత కుటింబీకులు షాక్ కు గురయ్యారు. మహిళ నోట్లో గుడ్డలు కుక్కి ఉండడం చూసి ఉలిక్కిపడ్డాడు. తనను బలవంతంగా ఎత్తుకు వచ్చి కట్టేసి అత్యాచారానికి పాల్పడ్డడానిని బాధితురాలు ఆవేదన వ్యక్తం చేసింది. ఈ మేరకు బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు విచారణ చేపట్టారు. బాధితురాలిని వైద్య పరీక్ష నిమిత్తం గుంటూరులోని ఓ ఆస్పత్రికి తరలించారు.

    బాధితురాలికి పరామర్శ
    అఘాయిత్యానికి గురై గుంటూరులోని ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న అత్యాచార బాధితురాలిని తెలుగు మహిళా నాయకురాలు వేగుంట రాణి బుధవారం పరామర్శించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. రాష్ట్రంలో మహిళలపై అఘాయిత్యాలు జరుగుతుంటే మహిళా కమిషన్ చైర్మన్ వాసిరెడ్డి పద్మ నోరు మెదపడం లేదని మండిపడ్డారు. సీఎం జగన్ పాలనలో ఏపీలో మహిళలకు రక్షణ లేకుండా పోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. సాక్షాత్తు ముఖ్యమంత్రి, హోం మంత్రి నివాసం ఉండే జిల్లాలోనూ అత్యచారాలు జరగడం ఏంటని ఆందోళన వ్యక్తం చేశారు. బాధితురాలికి న్యాయం జరిగే వరకు తమ పోరాటం ఆగదని వేగుంట రాణి స్పష్టం చేశారు.
    Published by:Nikhil Kumar S
    First published:

    Tags: Guntur, Guntur rape case, RAPE

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు