Wife Complaint: ఛీ.. ఛీ.. అందమైన భార్యను ఎదురుగా పెట్టుకుని కూడా ఇదేం దిక్కుమాలిన పని..!

ప్రతీకాత్మక చిత్రం

ఆమె చక్కటి రూపవతి, గుణవతి. వైవాహిక జీవితంపై ఆ యువతి ఎన్నో ఆశలు పెట్టుకుంది. కాబోయే వాడి గురించి ఎన్నో కలలు కని పడక గదిలోకి అడుగుపెట్టింది. కానీ.. భర్త ప్రవర్తనతో ఆమె ఆశలన్నీ అడియాసలయ్యాయి. కలలన్నీ నీరుగారిపోయాయి. శోభనం రాత్రి నుంచి ఆమెను భర్త దూరం పెట్టడాన్ని సదరు వివాహిత సహించలేకపోయింది.

 • Share this:
  రాజ్‌కోట్: ఆమె చక్కటి రూపవతి, గుణవతి. వైవాహిక జీవితంపై ఆ యువతి ఎన్నో ఆశలు పెట్టుకుంది. కాబోయే వాడి గురించి ఎన్నో కలలు కని పడక గదిలోకి అడుగుపెట్టింది. కానీ.. భర్త ప్రవర్తనతో ఆమె ఆశలన్నీ అడియాసలయ్యాయి. కలలన్నీ నీరుగారిపోయాయి. శోభనం రాత్రి నుంచి ఆమెను భర్త దూరం పెట్టడాన్ని సదరు వివాహిత సహించలేకపోయింది. హనీమూన్‌కు వెళితే అంతా కుదురుకుంటుందని భావించిది. అక్కడ కూడా భర్త ఆమెతో శృంగారానికి ఆసక్తి చూపలేదు. ఈ పరిణామాలతో తీవ్ర నిరాశ చెందిన ఆ మహిళ మోసం చేసి తనను పెళ్లి చేసుకున్నాడంటూ భర్తపై పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. గుజరాత్‌లోని రాజ్‌కోట్‌లో ఈ ఘటన వెలుగుచూసింది.

  ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాల్లోకి వెళితే.. రాజ్‌కోట్‌కు చెందిన పరిణీత అనే మహిళ ఫిబ్రవరి 9, 2018న పెద్దల సమక్షంలో ఓ డాక్టర్‌ను పెళ్లి చేసుకుంది. పెద్దలు కుదిర్చిన పెళ్లి సంబంధం అయినప్పటికీ ఆమె మనస్పూర్తిగా ఆ వైద్యుడిని పెళ్లాడింది. కానీ.. ఎన్నో ఆశలతో పడక గదిలోకి అడుగుపెట్టిన ఆమెకు మొదటి రాత్రే ఆమెకు చేదు అనుభవం ఎదురైంది. తొలిరాత్రి ఆమెతో శృంగారం చేసేందుకు భర్త తిరస్కరించాడు. ఆ తర్వాత ఎప్పుడు ఆమె కలిసేందుకు ప్రయత్నించినా దూరం జరిగేవాడు.

  కొన్నిసార్లు తలనొప్పిగా ఉందని, కొన్నిసార్లు మూడ్ లేదని, తాను పని ఒత్తిడితో అలిసిపోయానని.. ఏవేవో సాకులు చెప్పి శృంగారానికి దూరంగా ఉండేవాడు. అయినప్పటికీ ఉండబట్టలేక భార్య దగ్గరయ్యేందుకు ప్రయత్నిస్తే ఆమెపై కోప్పడేవాడు. ‘చెబుతుంటే అర్థం కాదా’ అంటూ ఆమెపై విసుక్కునే వాడు. భర్త ప్రవర్తనతో విస్తుపోయిన పరిణీత తీవ్ర మనస్తాపం చెందింది. అంతేకాదు, తన భర్త హాస్పిటల్‌లో వర్క్ ముగించుకుని రాగానే నేరుగా తన రూంలోకి వెళ్లిపోయేవాడని. ల్యాప్‌టాప్ ఓపెన్ చేసి దాదాపు తెల్లవారుజామున మూడు గంటల దాకా గడిపేవాడని ఫిర్యాదులో పరిణీత పేర్కొంది. దీంతో.. భర్త ప్రవర్తన ఇలా ఉందని అత్తతో చెబితే హనీమూన్‌కు వెళ్లమని సూచించారని, అక్కడికి వెళితే అన్నీ సవ్యంగా జరుగుతాయని సూచించడంతో హనీమూన్‌కు వెళ్లామని ఆమె తెలిపింది. అక్కడ కూడా తన భర్త ప్రవర్తనలో ఏమాత్రం మార్పు లేదని పరిణీత ఫిర్యాదులో పేర్కొంది.

  ఇది కూడా చదవండి: Married Woman: ఆహా.. అఫైర్ పెట్టుకున్న ప్రియుడంటే ఎంత ప్రేమో నీకూ.. భర్తకు అడ్డంగా దొరికిపోయాక కూడా...

  హనీమూన్‌లో ఉన్న సందర్భంలో ‘నీపై నాకు ఎలాంటి ఫీలింగ్స్ లేవు. నాకు మరో మహిళతో సంబంధం ఉంది.. నీకు ఎప్పటికీ దగ్గర కాలేను’ అని పరిణీతకు భర్త చెప్పాడు. దీంతో పరిణీతకు అసలు విషయం తెలిసింది. అయితే.. ల్యాప్‌టాప్‌లో తన భర్త అదే పనిగా గే పోర్న్ వీడియోలు, లెస్బియన్ పోర్న్ వీడియోలు చూసే వాడని.. అంతేకాకుండా తనతో పనిచేసే లేడీ డాక్టర్‌కు ఆ వీడియోలకు సంబంధించిన స్క్రీన్‌షాట్స్‌ను వాట్సాప్‌లో షేర్ చేసేవాడని చెప్పింది. ఆమె కూడా తన భర్తకు ఒంటి మీద నూలు పోగు లేకుండా ఫొటోలు దిగి పంపేదని, ఆమె అలా పంపిన ఫొటోలు, వీడియోలు చూసి తన భర్త హస్త ప్రయోగం చేసుకునేవాడని పరిణీత ఫిర్యాదులో పేర్కొనడం గమనార్హం. ఇదేంటని నిలదీస్తే.. తనను తిట్టి, కొట్టి హింసించాడని ఫిర్యాదులో పరిణీత పేర్కొంది.
  Published by:Sambasiva Reddy
  First published: