హోమ్ /వార్తలు /క్రైమ్ /

Husband: ఈమె భర్త లాంటి వాళ్లు అసలు పెళ్లెందుకు చేసుకుంటారో.. కట్నం పిచ్చోడు కాదు.. కానీ..

Husband: ఈమె భర్త లాంటి వాళ్లు అసలు పెళ్లెందుకు చేసుకుంటారో.. కట్నం పిచ్చోడు కాదు.. కానీ..

పోలీసు వాహనం, రీనా (ఫైల్ ఫొటో)

పోలీసు వాహనం, రీనా (ఫైల్ ఫొటో)

వివాహేతర సంబంధాలు నిండు ప్రాణాలను బలితీసుకుంటున్నాయి. భర్త మరో యువతితో వివాహేతర సంబంధం కొనసాగిస్తుండటం, పెద్దలు మందలించినా పట్టించుకోకుండా భార్యను నిర్లక్ష్యం చేసి ప్రియురాలితో సంబంధాన్ని కొనసాగిస్తుండటంతో ఆ వివాహిత మనస్తాపంతో ఆత్మహత్య చేసుకుంది. ఈ విషాద ఘటన గుజరాత్‌లోని రాజ్‌కోట్‌లో వెలుగుచూసింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. విజయ్‌కు, రీనా అనే యువతికి ఐదేళ్ల క్రితం పెద్దలు పెళ్లి జరిపించారు.

ఇంకా చదవండి ...

రాజ్‌కోట్: వివాహేతర సంబంధాలు నిండు ప్రాణాలను బలితీసుకుంటున్నాయి. భర్త మరో యువతితో వివాహేతర సంబంధం కొనసాగిస్తుండటం, పెద్దలు మందలించినా పట్టించుకోకుండా భార్యను నిర్లక్ష్యం చేసి ప్రియురాలితో సంబంధాన్ని కొనసాగిస్తుండటంతో ఆ వివాహిత మనస్తాపంతో ఆత్మహత్య చేసుకుంది. ఈ విషాద ఘటన గుజరాత్‌లోని రాజ్‌కోట్‌లో వెలుగుచూసింది.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. విజయ్‌కు, రీనా అనే యువతికి ఐదేళ్ల క్రితం పెద్దలు పెళ్లి జరిపించారు. పెళ్లైన కొన్నాళ్లు బాగానే కాపురం చేసిన భర్త రానురానూ భార్యను నిర్లక్ష్యం చేశాడు. వీళ్లకు ఒక పాప, ఒక బాబు పుట్టారు. పిల్లలను రీనా కంటికి రెప్పలా కాపాడుకుంటూ వచ్చింది. కానీ.. భర్త ఎందుకు నిర్లక్ష్యం చేస్తున్నాడో అర్థం కాలేదు. కొన్నాళ్లకు తన భర్త మరో యువతితో వివాహేతర సంబంధం కొనసాగిస్తున్నాడని రీనా తెలుసుకుంది. భర్తను నిలదీసింది. ఈ విషయంలో రీనా, విజయ్ మధ్య పలుమార్లు గొడవలు జరిగాయి. ఈ వ్యవహారం గత సంవత్సరం పెద్దల వరకూ వెళ్లింది. విజయ్‌ను మందలించి ఇకనైనా మంచిగా మసులుకోవాలని హెచ్చరించారు.

కొన్నాళ్లు భార్యతో కలిసిపోయినట్లు కనిపించినా మళ్లీ ప్రియురాలితో వివాహేతర సంబంధం కొనసాగిస్తున్నాడు. ఎవరు చెప్పినా వివాహేతర సంబంధాన్ని విజయ్ వీడేలా రీనాకు కనిపించలేదు. పిల్లల ముఖం చూసైనా భర్త కొన్నాళ్లకు మారతాడని రీనా ఆశించింది. కానీ.. విజయ్ ప్రవర్తనలో ఏమాత్రం మార్పు రాలేదు. దీంతో.. ఇక చేసేదేమీ లేక భర్త గురించి పట్టించుకోవడం మానేసి పిల్లలను చూసుకుంటూ రీనా గడిపేసింది. కానీ.. విజయ్ ప్రవర్తన రోజురోజుకూ మరింత శ్రుతి మించింది. ఇక.. ఎలాగూ భార్యకు తెలిసిన వ్యవహారమే కదా అని.. రీనా ముందే విజయ్ తన ప్రియురాలితో కాల్స్, వీడియో కాల్స్ మాట్లాడసాగాడు. ఈ పరిణామం రీనాను తీవ్రంగా బాధించింది.

ఇది కూడా చదవండి: Wife Complaint: ఛీ.. ఛీ.. అందమైన భార్యను ఎదురుగా పెట్టుకుని కూడా ఇదేం దిక్కుమాలిన పని..!

భర్త ప్రవర్తనతో విసిగిపోయిన రీనా క్షణికావేశంలో తీసుకోకూడని నిర్ణయం తీసుకుంది. ఇంట్లోనే విషం తాగి ఆత్మహత్యకు పాల్పడింది. ఆమెను రాజ్‌కోట్ ప్రభుత్వాస్పత్రికి తరలించినా ఫలితం లేకుండా పోయింది. చికిత్స పొందుతూ రీనా చనిపోయింది. ఆమె పిల్లలిద్దరూ చిన్న వయసులోనే తల్లిని కోల్పోయి మాతృ ప్రేమకు దూరమయ్యారు. క్షణికావేశంలో రీనా ఆత్మహత్య నిర్ణయం తీసుకునే ముందు ఒక్క క్షణం పిల్లల గురించి ఆలోచించి ఉంటే బాగుండేదని కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరయ్యారు. పోలీసులు విజయ్‌పై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

First published:

Tags: Crime news, Extra marital affair, Married women, Wife suicide

ఉత్తమ కథలు