ముజఫర్‌పూర్: వివాహేతర సంబంధాల మోజులో పడి ప్రియుడితో కలిసి భర్తను హత్య చేస్తున్న ఘటనలు రోజురోజుకూ పెరుగుతున్నాయి. భర్తను చంపేసి అడ్డు తొలగించుకోవాలని భావిస్తున్నారే తప్ప.. ఏదో ఒకరోజు నేరానికి శిక్ష తప్పదన్న విషయాన్ని మాత్రం మర్చిపోతున్నారు. వివాహేతర సంబంధం వ్యామోహంలో పడిన కొందరు మహిళలు భర్తను కిరాతకంగా హత్య చేసేందుకు కూడా వెనకాడటం లేదు.
బీహార్‌లోని ముజఫర్‌పూర్‌లో ఉన్న సికందర్‌పూర్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఇలాంటి ఘటనే జరిగింది. రాధ, రాకేష్(30) భార్యాభర్తలు. ఇద్దరికీ కొన్నేళ్ల క్రితం పెళ్లైంది. రాకేష్ అక్రమంగా మద్యం అమ్ముతూ సొమ్ము చేసుకునేవాడు. బీహార్‌లో మద్యపాన నిషేధం అమలులో ఉంది. అయినప్పటికీ పోలీసుల కళ్లుగప్పి రాకేష్ మద్యం అక్రమ దందాను కొనసాగించేవాడు. ఈ దందాలో రాకేష్‌తో పాటు సుభాష్ అనే వ్యక్తి అతనికి పార్ట్‌నర్‌గా ఉండేవాడు.
సుభాష్‌ను రాకేష్ అప్పుడప్పుడూ తన ఇంటికి తీసుకెళ్లేవాడు. ఈ క్రమంలోనే.. సుభాష్‌కు, రాధకు పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం కాస్తా రాకేష్‌కు తెలియకుండా ఒకరి ఫోన్ నంబర్లు మరొకరు తీసుకునే వరకూ వెళ్లింది. ఇద్దరూ రాకేష్ ఇంట్లో లేనప్పుడు గంటలుగంటలు ఫోన్‌లో మాట్లాడుకునేవారు. రాధ, సుభాష్ మధ్య వ్యవహారం వివాహేతర సంబంధానికి దారితీసింది. ఇద్దరూ పలుమార్లు శారీరకంగా కలిశారు. రాకేష్ ఉంటే తాము కలిసి ఉండలేమని భావించిన సుభాష్, రాధ అతనిని చంపాలని నిర్ణయించుకున్నారు. అయితే.. హత్య కేసులో దొరికిపోకుండా ఉండాలంటే ఏం చేయాలన్న ఆలోచన చేసి మాస్టర్ ప్లాన్ వేశారు.
రాకేష్, రాధ ఓ అద్దె ఫ్లాట్‌లో ఉండేవారు. రాకేష్ మద్యం అక్రమ దందా చేస్తుండటంతో పోలీసుల భయంతో ఇంటికి అప్పుడప్పుడు మాత్రమే వస్తుండేవాడు. రాకేష్‌ను అడ్డు తొలగించుకోవాలన్న ఉద్దేశంతో ‘తీజ్’ పండుగ చేసుకుందామని రాధ భర్తకు ఫోన్ చేసి ఇంటికి రావాలని చెప్పింది. భార్య దురుద్దేశం తెలియని రాకేష్ ఇంటికి వెళ్లాడు. అయితే.. అప్పటికే ఇంట్లో ఉన్న సుభాష్ రాకేష్‌ను రాధతో కలిసి చంపేశాడు.
రాకేష్‌ను చంపి ముక్కలుగా చేసి.. సాక్ష్యాలు దొరకకుండా చేయాలన్న ఉద్దేశంతో కెమికల్ పోశారు. అయితే.. ఆ రసాయనం కారణంగా అనుకోకుండా పేలుడు సంభవించింది. దీంతో.. అదిరిపడిన ఇరుగుపొరుగు పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు స్పాట్‌కు చేరుకుని చూసేసరికి రాకేష్ మృతదేహం ముక్కలుగా కనిపించింది. పోలీసులు ఒక్కసారిగా షాకయ్యారు. రాకేష్ మృతదేహాన్ని పోస్ట్‌మార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. రాకేష్ హత్యకు రాధ సోదరి, బావ కూడా సహకరించడం గమనార్హం. పోలీసులు నిందితులను అదుపులోకి తీసుకున్నారు. రాకేష్ సోదరుడు ఈ ఘటన గురించి మాట్లాడుతూ.. రాధ, సుభాష్ అఫైర్ గురించి అపార్ట్‌మెంట్ వాసులందరికీ తెలుసని చెప్పాడు. పోలీసులు రాకేష్ సోదరుడు దినేష్ ఫిర్యాదుతో రాధ, సుభాష్, రాధ అక్క, బావపై కేసు నమోదు చేశారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.