Married Woman: పెళ్లి తర్వాత జీవితం ఊహించుకున్నట్టు లేదని క్షణికావేశంలో ఎంతపని చేశావ్ తల్లి..

పల్లవి (ఫైల్ ఫొటో)

కర్ణాటకలోని మైసూరులో సరిగ్గా అదే జరిగింది. హున్సూర్ తాలూకాకు చెందిన పల్లవి అనే యువతికి ఏడాది క్రితం వివాహమైంది. కొన్నాళ్లు పాటు ఆమె కాపురం హాయిగానే సాగింది. కానీ.. పెళ్లయిన ఆరు నెలల తర్వాత ఆ కాపురంలో కలతలు రేగాయి. చీటికీమాటికీ భార్యాభర్తలు గొడవపడుతుండేవారు. అయితే.. మొదట్లో అలకలు, బుజ్జగింపులుగానే ఉన్న ఈ గొడవలు కాస్తా రానురానూ భార్యాభర్తల మధ్య పచ్చ గడ్డి వేస్తే భగ్గుమనే స్థాయికి చేరాయి.

  • Share this:
    మైసూర్: భార్యాభర్తల మధ్య ఏర్పడిన అలకలు, బుజ్జగింపులు సహజం. చిన్నచిన్న గొడవలూ జరుగుతూనే ఉంటాయి. కానీ.. కొంతసేపటి తర్వాత ఎవరో ఒకరు సర్దుకుపోయి నచ్చజెప్పుకుని ముందుకెళితేనే ఆ కాపురం సవ్యంగా సాగుతుంది. కానీ.. భార్యాభర్తల మధ్య ఏర్పడిన మనస్పర్థలు ముదిరి పాకాన పడితే హత్యలకు, ఆత్మహత్యలకు దారి తీసే అవకాశముంది. కర్ణాటకలోని మైసూరులో సరిగ్గా అదే జరిగింది. హున్సూర్ తాలూకాకు చెందిన పల్లవి అనే యువతికి ఏడాది క్రితం వివాహమైంది. కొన్నాళ్లు పాటు ఆమె కాపురం హాయిగానే సాగింది. కానీ.. పెళ్లయిన ఆరు నెలల తర్వాత ఆ కాపురంలో కలతలు రేగాయి. చీటికీమాటికీ భార్యాభర్తలు గొడవపడుతుండేవారు. అయితే.. మొదట్లో అలకలు, బుజ్జగింపులుగానే ఉన్న ఈ గొడవలు కాస్తా రానురానూ భార్యాభర్తల మధ్య పచ్చ గడ్డి వేస్తే భగ్గుమనే స్థాయికి చేరాయి. పల్లవి అడిగినవి ఏవీ ఆమె భర్త పట్టించుకునేవాడు కాదు. పల్లవి కూడా భర్తతో అంటీముట్టనట్టుగానే వ్యవహరించింది. ఈ గొడవలు ముదిరి పల్లవి కొన్నాళ్లు పుట్టింటికి కూడా వెళ్లిపోయింది. అయితే.. ఇరు కుటుంబాల పెద్దలు భార్యాభర్తలకు నచ్చజెప్పి పల్లవిని కాపురానికి పంపారు.

    కొన్ని రోజులు ఇద్దరూ బాగున్నట్టుగానే కనిపించినా.. ఆ తర్వాత మళ్లీ గొడవపడటం మొదలుపెట్టారు. ఈ గొడవల కారణంగా ఒకరిపై ఒకరు దాడి చేసుకుని గాయపరుచుకునేంత వరకూ వెళ్లారు. భర్త తనను వేధిస్తున్నాడని.. పెళ్లయ్యాక జీవితం తాను ఊహించినట్టుగా అసలు లేదని పల్లవి తన సన్నిహితులతో చెప్పుకుని బాధపడేది. మైసూరులోని వినాయక నగర్‌లో ఉంటున్న పల్లవి, ఆమె భర్త మధ్య ఈసారి తలెత్తిన గొడవ చిలికిచిలికి గాలివానగా మారింది. పల్లవితో గొడవ పడిన ఆమె భర్త కోపంతో బయటకు వెళ్లిపోయాడు. అతను తిరిగి ఇంటికొచ్చేసరికి ఊహించని ఘోరం జరిగింది.

    భర్తతో తలెత్తిన గొడవ కారణంగా పల్లవి తీవ్ర మనస్తాపం చెందింది. ఆమె భర్త బయటకు వెళ్లగానే ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. ఆ సమయంలో ఇంట్లో ఎవరూ లేకపోవడంతో ఆమె ఉరేసుకున్న విషయాన్ని ఎవరూ గమనించలేదు. ఆమె భర్త ఇంటికి తిరిగొచ్చేసరికి పల్లవి ఉరికి వేలాడుతూ విగత జీవిగా కనిపించింది. ఈ ఘటన గురించి సమాచారం అందుకున్న జయలక్ష్మీపురం పోలీసులు స్పాట్‌కు చేరుకుని పల్లవి మృతదేహాన్ని పోస్ట్‌మార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. పల్లవి కుటుంబ సభ్యుల మేరకు ఆమె భర్తపై కేసు నమోదు చేసి అదుపులోకి తీసుకున్నారు.
    Published by:Sambasiva Reddy
    First published: