• HOME
  • »
  • NEWS
  • »
  • CRIME
  • »
  • MARRIED WOMAN FROM VEMULAWADA SOLD FOR 1 LAKH SU

Telangana: పెళ్లైన మహిళను లక్ష రూపాయలకు విక్రయించిన వృద్దురాలు..

Telangana: పెళ్లైన మహిళను లక్ష రూపాయలకు విక్రయించిన వృద్దురాలు..

ప్రతీకాత్మక చిత్రం

పెళ్లైన మహిళకు మాయ మాటలు చెప్పిన ఓ వృద్దురాలు ఆమెను ఓ వ్యక్తికి విక్రయించింది. దీంతో ఆ మహిళ దాదాపు 9 నెలల పాటు బందీగా ఉండాల్సి వచ్చింది.

  • Share this:
    పెళ్లైన మహిళకు మాయ మాటలు చెప్పిన ఓ వృద్దురాలు ఆమెను ఓ వ్యక్తికి విక్రయించింది. దీంతో ఆ మహిళ దాదాపు 9 నెలల పాటు బందీగా ఉండాల్సి వచ్చింది. బాధితురాలిని సిరిసిల్ల జిల్లా వేములవాడకు చెందిన మహిళగా గుర్తించారు. ఈ ఘటనకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి.. వేములవాడకు చెందిన బాధిత మహిళకు ఐదేళ్ల క్రితం వివాహం జరిగింది. వారికి ఇద్దరు పిల్లలు ఉన్నారు. అయితే ఈ ఏడాది మార్చిలో భర్తతో గొడవ జరగింది. దీంతో తీవ్ర మనస్తాపానికి లోనైన బాధిత మహిళ.. తన ఇద్దరు పిల్లల్ని తీసుకుని ఇంట్లో నుంచి బయటకు వెళ్లిపోయింది. ఇంటి నుంచి బయటకు వెళ్లిపోయిన ఆమె సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌కు చేరింది. పిల్లలతో కలిసి రెండ్రోజులు అక్కడే ఉండిపోయింది. అయితే సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌లో బాధిత మహిళ పిల్లలతో కలిసి ఒంటరిగా ఉండటాన్ని చూసిన వృద్దురాలు.. ఆమెకు మాయ మాటలు చెప్పింది. పని కల్పిస్తానని చెప్పి ఆ మహిళను మహారాష్ట్ర తీసుకెళ్లింది.

    మహారాష్ట్రలోని పర్బణీలోని మోరా అనే వ్యక్తికి ఆమెను లక్ష రూపాయలకు విక్రయించింది. ఆ తర్వాత ఆమె చివరకు నాసిక్ సమీపంలోని ఓ కుగ్రామానికి చెందిన బాబు లక్ష్మణ్ జగపత్‌కు అప్పగించారు. అయితే అప్పటికే రెండు పెళ్లిళ్లు చేసుకున్న జగపత్‌.. బాధిత మహిళను మూడో భార్యగా ఉండాలంటూ ఆమెపై ఒత్తిడి తెచ్చాడు. ఈ క్రమంలోనే వేధింపులకు పాల్పడ్డాడు. అయితే చివరకు తాను మోసపోయానని తెలుసుకున్న ఆమెకు ఏం చేయాలో తోచలేదు. ఎలాగైనా అక్కడి నుంచి బయటపడాలని భావించింది. ఈ క్రమంలోనే పారిపోయేందుకు ప్రయత్నించగా జగపత్ అడ్డుకుని.. పారిపోయేందుకు ప్రయత్నిస్తే ఇద్దరు పిల్లల్ని చంపేస్తానని బెదిరించాడు.

    దీంతో దాదాపు 9 నెలల పాటు ఆమె అక్కడే బందీగా ఉండిపోవాల్సి వచ్చింది. అయితే ఇటీవల ఎలాగోలాగా ఫోన్ సంపాదించిన ఆమె.. డిసెంబర్ 25న బంధువులకు ఫోన్ చేసి జరిగిన విషయం చెప్పింది. తాను నాసిక్‌లో బందీగా ఉన్నానని వెల్లడించింది. దీంతో ఆమె భర్త వేములవాడ పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు.. ఫోన్ కాల్ ఎక్కడి నుంచి వచ్చిందో సేకరించారు. సెల్‌ఫోన్ సిగ్నల్ ఆధారంగా ఆమె ఉన్న ప్రాంతాన్ని గుర్తించారు. మంగళవారం మహిళ ఉన్న ప్రాంతానికి చేరుకుని బాధిత మహిళకు, ఆమె ఇద్దరు పిల్లలకు అక్కడి నుంచి బయటకు తీసుకొచ్చారు. ఆమెను బందీగా ఉంచి జగపత్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు.
    Published by:Sumanth Kanukula
    First published:

    అగ్ర కథనాలు