Married Woman: ఎంతపని జరిగింది తల్లీ.. పండంటి మగబిడ్డను కన్న రెండు నెలలకే.. ఇంతలోనే ఇలా..

భవ్య (ఫైల్ ఫొటో)

కర్ణాటకలోని హసన్ జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. జిల్లాలోని అరసికెరె తాలూకా మలెకల్ తిరుపతి అనే గ్రామంలో భవ్య(19) అనే యువతి వాటర్ ట్యాంక్‌లో అనుమానాస్పద స్థితిలో విగతజీవిగా కనిపించింది. కరోనా కారణంగా ఆమె పుట్టింటికి వెళ్లే పరిస్థితి లేకపోవడంతో మెట్టినింట్లోనే పండంటి మగ బిడ్డకు జన్మనిచ్చింది.

 • Share this:
  హసన్: భార్యాభర్తల మధ్య మనస్పర్థలు నిండు జీవితాలను బలి తీసుకుంటున్నాయి. అదనపు కట్నం కోసం భార్యలను వేధిస్తున్న భర్తలు కొందరైతే.. మరికొందరు భార్యపై అనుమానంతో వారి హత్యకు, ఆత్మహత్యలకూ కారణమవుతున్నారు. కొందరు భార్యలు కూడా వివాహేతర సంబంధాల మోజులో పడి భర్తలను హతమార్చుతున్న ఘటనలు కూడా నిత్యం ఎక్కడో దగ్గర వెలుగుచూస్తున్నాయి. కారణమేంటో తెలియదు గానీ.. కర్ణాటకలో ఓ 19 ఏళ్ల వివాహిత జీవితం అర్థాంతరంగా ముగిసిపోయింది. ఓ బాబు పుట్టిన రెండు నెలలకే ఆమె అనుమానాస్పద స్థితిలో మృతి చెందడం పలు సందేహాలకు తావిస్తోంది. పూర్తి వివరాల్లోకి వెళితే.. కర్ణాటకలోని హసన్ జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. జిల్లాలోని అరసికెరె తాలూకా మలెకల్ తిరుపతి అనే గ్రామంలో భవ్య(19) అనే యువతి వాటర్ ట్యాంక్‌లో అనుమానాస్పద స్థితిలో విగతజీవిగా కనిపించింది. కరోనా కారణంగా ఆమె పుట్టింటికి వెళ్లే పరిస్థితి లేకపోవడంతో మెట్టినింట్లోనే పండంటి మగ బిడ్డకు జన్మనిచ్చింది. బాబు పుట్టి రెండు నెలలైంది. భవ్య, జగదీష్‌కు సంవత్సరం క్రితం పెద్దలు పెళ్లి చేశారు. భవ్యకు తల్లిదండ్రులు లేకపోవడంతో తాతబామ్మల దగ్గరే పెరిగింది. పెళ్లి కూడా వాళ్లే చేసి వారి స్థోమతకు తగినంత కట్నంగా ఇచ్చుకున్నారు. పెళ్లయిన కొన్నాళ్లు భార్యను సక్రమంగానే చూసుకున్న జగదీష్ రానురాను భార్యను అదనపు కట్నం కోసం వేధించసాగాడు. తనకు తల్లిదండ్రులు లేరని.. తన పుట్టింటి వారు డబ్బు ఇచ్చే పరిస్థితిలో లేరని భవ్య భర్తతో చెప్పింది. అయినప్పటికీ జగదీష్ వేధింపులు ఆపలేదు. భార్యను అర్థం చేసుకోకుండా చిత్రహింసలకు గురిచేశాడు. భార్య గర్భం దాల్చిన తర్వాత ఈ వేధింపులు మరింత పెరిగాయి. వైద్య పరీక్షల కోసం వెళ్లిన ప్రతిసారి భార్యను సూటిపోటి మాటలతో వేధించేవాడు. అనవసరంగా నిన్ను పెళ్లి చేసుకున్నానని.. వేరొకరిని చేసుకున్నా సుఖంగా ఉండేవాడినని దెప్పిపొడుస్తూ ఆమె మనసును నొప్పించేవాడు. కడుపులో పెరుగుతున్న బిడ్డ కోసం భర్త ఎంత వేధిస్తున్నా పుట్టింటి వారికి చెప్పుకోకుండా భవ్య భరించింది.

  అయితే.. కరోనా కారణంగా గర్భంతో ఉన్న మనవరాలిని తీసుకెళ్లి చూసుకునే స్థితిలో లేని ఆమె బామ్మతాత మధ్యలో ఒకసారి ఆమె ఇంటికి వెళ్లి చూసొచ్చారు. కొంత డబ్బు మనమరాలి చేతిలో పెట్టి జాగ్రత్తగా ఉండాలని చెప్పి వెళ్లారు. అయితే.. ఆ వృద్ధులు ఉన్న రెండుమూడు రోజులకే మనవరాలితో అంటీముట్టనట్టుగా వ్యవహరిస్తున్న ఆమె భర్తను, జగదీష్ కుటుంబ సభ్యులను గమనించారు. సమస్య ఏదైనా ఉంటే చెప్పాలని.. తమ మనవరాలిని మంచిగా చూసుకోవాలని చెప్పి వారు సొంతూరికి వెళ్లిపోయారు. భవ్య రెండు నెలల క్రితం మగబిడ్డకు జన్మనిచ్చింది.

  ఫేస్‌బుక్‌లో పరిచయం.. ఓ టీచర్ చేసిన ఘనకార్యం

  ఎంతో సంతోషంగా భార్యను చూసుకోవాల్సిన జగదీష్ బిడ్డ పుట్టాక కూడా భార్యను సరిగా చూసుకోలేదు. ఆమె ఈ పరిణామంతో మరింత కుమిలిపోయింది. భర్త వేధింపుల తాళలేక ఆత్మహత్య చేసుకుందో లేక అత్తింటి వారే హత్య చేశారో తెలియదు గానీ భవ్య మృతదేహం వాటర్ ట్యాంక్‌లో కనిపించింది. అత్తింటి వాళ్లే భవ్యను హత్య చేశారని, పెళ్లయినప్పటి నుంచి భవ్యతో ఎవరూ సరిగా లేరని.. అందరూ ఆమెను బాధపెట్టారని ఆమె తాతబామ్మ పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
  Published by:Sambasiva Reddy
  First published: