MARRIED WOMAN EXTRA MARITAL AFFAIR LEADS TO SAD ENDING INCIDENT HAPPENED IN MYSORE SSR
Married Woman: మేనత్త కొడుకుపై మోజు పడ్డ మరదలు.. అప్పటికే ఆమెకు పెళ్లై ముగ్గురు పిల్లలు.. మరో ట్విస్ట్ ఏంటంటే..
కిరణ్, ప్రీతి కుమారి
ఆమె తన మేనత్త కొడుకు కిరణ్కు దగ్గరైంది. పెళ్లికి ముందు అత్త కొడుకుగా మాత్రమే ఉన్న పరిచయం కాస్తా ఇన్నేళ్ల తర్వాత బావగా మారింది. కిరణ్కు ప్రీతి బాగా దగ్గరైంది. ఇద్దరూ కలిసి భర్త కళ్లు గప్పి వివాహేతర సంబంధం నడిపేంత వరకూ వ్యవహారం వెళ్లింది. వీళ్ల వివాహేతర సంబంధం గురించి ప్రీతి భర్తకు తెలిసింది. She is close to her niece Kiran. The affair went on until the two of them ran an extramarital affair with the husband blindfolded together. Preeti husband found out about their extramarital affair.
మైసూరు: వివాహేతర సంబంధాల (Affairs) మోజులో పడి కొందరు సాఫీగా సాగిపోతున్న సంసారాలను చేజేతులా నాశనం చేసుకుంటున్నారు. భార్యల కళ్లుగప్పి అక్రమ సంబంధాలను కొనసాగిస్తూ కొందరు మగాళ్లు తప్పు చేస్తుంటే, భర్తలను వదిలేసి, కొందరైతే వాళ్లను హత్య చేసి మరీ ప్రియుడితో కలిసి ఉండాలని కటకటాల పాలవుతున్న భార్యల గురించి తరచుగా వార్తల్లో చూస్తుంటాం. కర్ణాటకలోని (Karnataka) మైసూరుకు (Mysore) చెందిన ప్రీతి కుమారి(25) మొదటి రకం. ఆమెకు పెళ్లైంది. భర్తతో కొన్ని సంవత్సరాలు అన్యోన్యంగానే ఉంది. ముగ్గురు పిల్లలు పుట్టారు. వాళ్లను కంటికి రెప్పలా కాపాడుకుంటూ ప్రీతి, ఆమె భర్త సుఖంగానే గడుపుతున్నారు. కానీ.. ప్రీతికి కొన్నాళ్లకు ఎందుకా పాడు ఆలోచన కలిగిందో తెలియదు. ఆమె తన మేనత్త కొడుకు కిరణ్కు దగ్గరైంది. పెళ్లికి (Marriage) ముందు అత్త కొడుకుగా మాత్రమే ఉన్న పరిచయం కాస్తా ఇన్నేళ్ల తర్వాత బావగా మారింది. కిరణ్కు ప్రీతి బాగా దగ్గరైంది. ఇద్దరూ కలిసి భర్త కళ్లు గప్పి వివాహేతర సంబంధం నడిపేంత వరకూ వ్యవహారం వెళ్లింది. వీళ్ల వివాహేతర సంబంధం (Extra Marital Affair) గురించి ప్రీతి భర్తకు తెలిసింది.
పెళ్లయి.. ముగ్గురు పిల్లల తల్లివై ఉండి ఇదేం పనని నిలదీశాడు. మళ్లీ ఇది రిపీట్ కాకూడదని హెచ్చరించాడు. భర్త మందలించడంతో తీవ్ర మనస్తాపం చెందిన ప్రీతి కుమారి జరిగిన విషయాన్ని కిరణ్కు చెప్పింది. తనతో వచ్చేయమని కిరణ్ అడగడంతో భర్త, ముగ్గురు పిల్లల గురించి క్షణం కూడా ఆలోచించకుండా ప్రీతి అతనితో వెళ్లిపోయింది. భార్య నిర్ణయం ప్రీతి భర్తను విస్మయానికి గురిచేసింది. పిల్లలున్నారన్న స్పృహ కూడా లేకుండా కాదనుకుని వెళ్లిపోయిన ఆమెను ప్రీతి భర్త కూడా పట్టించుకోలేదు. పిల్లలను చూసుకుంటూ ఉన్నాడు. భర్త, పిల్లలు లేకపోవడంతో ఏదో భారం దిగిపోయినట్టు భావించిన ప్రీతి తన అత్త కొడుకు కిరణ్తో కలిసి ఉంది. ఇద్దరూ కొన్నాళ్లు పట్టపగ్గాలు లేకుండా సినిమాలు, షికార్లంటూ తిరిగారు. ఏమైందో తెలియదు గానీ.. కిరణ్ ప్రవర్తనలో కొన్ని రోజుల తర్వాత మార్పు వచ్చింది. ప్రీతితో తొలుత ఉన్నంత చనువుగా ఉండకుండా దూరం జరిగాడు. ఆమెతో కలిసి ఉండటం కిరణ్కు కష్టంగా ఉండేది. కిరణ్ ప్రవర్తనతో ప్రీతి ఏమైందని నిలదీసింది. భర్త, పిల్లలను కాదనుకుని వచ్చేసిన తనను ఇష్టం లేనట్టుగా దూరం పెట్టడాన్ని ప్రీతి భరించలేకపోయింది. ఈ విషయంలో కిరణ్తో పలుమార్లు గొడవ పడింది. ఈ గొడవ కాస్తా.. ఇటీవల ఒకరోజు చిలికిచిలికి గాలివానగా మారింది.
ఒకానొక సమయానికి సహనం కోల్పోయిన కిరణ్.. క్షణికావేశంలో ప్రీతి జుట్టుపట్టుకుని ఈడ్చి కొట్టాడు. ఆమెను తిట్టి, కొట్టి దాడి చేశాడు. కడుపులో తన్నాడు. చేతులు వెనక్కి మడిచి, తలను గోడకేసి కొట్టాడు. ఈ ఘటనలో ప్రీతి తీవ్రంగా గాయపడింది. ఇంట్లో నుంచి కేకలు, అరుపులు వినిపించడంతో ఇరుగుపొరుగు వెళ్లి చూడగా.. తలపై నుంచి రక్తం కారుతున్న స్థితిలో ప్రీతి కనిపించింది. దీంతో.. ఇరుగుపొరుగు వాళ్లు ఆమెను ఆసుపత్రికి తరలించారు. అయితే.. ఆమె ఆసుపత్రిలో చికిత్స చేసేలోపే మృతి చెందింది. ప్రీతిని హత్య చేసిన కిరణ్కు దేహశుద్ధి చేసిన స్థానికులు అతనిని పోలీసులకు అప్పగించారు. విజయనగర్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. వివాహేతర సంబంధం మోజులో పడిన ప్రీతి జీవితం ఇలా అర్థాంతరంగా ముగిసింది. ఆమె చనిపోవడంతో ముగ్గురు పిల్లలు తల్లికి దూరమయ్యారు.
Published by:Sambasiva Reddy
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.