కోడిగుడ్ల కోసం ప్రియుడితో పారిపోయిన వివాహిత.. యూపీలో ఆశ్చర్యకర సంఘటన..

దినసరి కూలీ అయిన తాను.. రోజూ కోడిగుడ్లు కొని తీసుకురాలేనని భర్త ఆమెతో చెప్పాడు. ఆ మరుసటిరోజే ఆమె తన ప్రియుడితో పారిపోయింది.

దినసరి కూలీ అయిన తాను.. రోజూ కోడిగుడ్లు కొని తీసుకురాలేనని భర్త ఆమెతో చెప్పాడు. ఆ మరుసటిరోజే ఆమె తన ప్రియుడితో పారిపోయింది.

  • Share this:
    చిన్న చిన్న విషయాలకే తీవ్రమైన నిర్ణయాలు తీసుకోవడం.. కాపురంలో నిప్పులు పోసుకోవడం ఈరోజుల్లో సాధారణంగా మారిపోయింది. ఉత్తరప్రదేశ్‌లోని గోరఖ్‌పూర్‌ పరిధిలో ఉన్న కంపెర్‌గంజ్‌కి చెందిన ఓ వివాహిత.. తన భర్త రోజూ గుడ్లు తీసుకురావడం లేదన్న కారణంతో ఇంటి నుంచి పారిపోయింది. తనకు ఇష్టమైన కోడిగుడ్డును రోజూ తీసుకొచ్చి ఇస్తున్న ప్రియుడితో ఆమె పారిపోవడం గమనార్హం.

    పోలీసుల కథనం ప్రకారం.. సదరు వివాహిత నాలుగు నెలల క్రితం కూడా ఇలాగే ప్రియుడితో పారిపోయింది.పోలీసులు ఆమెను పట్టుకుని ప్రశ్నించగా.. తన భర్త రోజూ గుడ్లు తీసుకురావడం లేదని అందుకే పారిపోయానని చెప్పింది.తాజాగా శనివారం రోజు కూడా భర్తతో ఆమె కోడిగుడ్ల గురించి గొడవపడింది. అయితే దినసరి కూలీ అయిన తాను.. రోజూ కోడిగుడ్లు కొని తీసుకురాలేనని భర్త ఆమెతో చెప్పాడు. ఆ మరుసటిరోజే ఆమె తన ప్రియుడితో పారిపోయింది.
    ఆమె బలహీనతను అదునుగా తీసుకుని.. ఆమె ప్రియుడు రోజూ కోడిగుడ్లు తీసుకొచ్చి ఇచ్చేవాడని ఆమె భర్త తెలిపాడు. అలా అతనిపై ఇష్టాన్ని పెంచుకున్న ఆమె ఇంటి నుంచి పారిపోయిందని వాపోయాడు.
    First published: