హోమ్ /వార్తలు /క్రైమ్ /

అమ్మ, నాన్న.. మా ఇంటికి రండి అని ఫోన్ చేసిన యువతి.. ఆ తర్వాత 15 నిమిషాలకే అల్లుడు ఫోన్ చేసి..

అమ్మ, నాన్న.. మా ఇంటికి రండి అని ఫోన్ చేసిన యువతి.. ఆ తర్వాత 15 నిమిషాలకే అల్లుడు ఫోన్ చేసి..

మృతురాలు (ఫైల్ ఫొటో)

మృతురాలు (ఫైల్ ఫొటో)

ఆ యువతికి రెండేళ్ల క్రితం వివాహం జరిగింది. ఇటీవల తన ఇంటికి రావాలని తల్లిదండ్రులకు ఫోన్ చేసింది. దీంతో వారు వెంటనే కూతురు ఇంటికి బయలుదేరారు.

ఆ యువతికి రెండేళ్ల క్రితం వివాహం జరిగింది. ఇటీవల తన ఇంటికి రావాలని తల్లిదండ్రులకు ఫోన్ చేసింది. దీంతో వారు వెంటనే కూతురు ఇంటికి బయలుదేరారు. అయితే వారు చేరుకునే సరికి అక్కడ యువతి మృతదేహం కనిపించింది. దీంతో ఆ తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపించారు. ఈ ఘటన గుజరాత్‌ (Gujarat) రాజ్‌కోట్ జిల్లాలోని (Rajkot District) జస్దాన్ తాలూకాలో చోటుచేసుకుంది. వివరాలు.. పరిణీత అనే యువతికి రెండేళ్ల క్రితం హితేష్ అనే వ్యక్తితో జరిగింది. వారి ఆచారం ప్రకారం పెద్దలు వివాహం జరిపించారు. అయితే శనివారం ఆమె అత్తారింట్లో ఆత్మహత్య చేసుకుంది. అయితే ఆత్మహత్యకు చేసుకోవడానికి 15 నిమిషాల ముందు ఆమె తన తల్లిదండ్రులకు ఫోన్ చేసింది. కానీ వారు వచ్చేలోపే ఆమె మరణించింది.

పరిణీతి మరణానికి సంబంధించి ఆమె మామ కైలాష్‌బెన్ పోలీసులకు సమాచారం ఇచ్చాడు. దీంతో పోలీసులు వెంటనే ఘటన స్థలానికి చేరుకున్నాడు. ఇంట్లో పరిణీతి ఫ్యాన్‌కు వేలాడుతూ కనిపించింది. ఆమె ఫ్యాన్‌ను నుంచి కిందకు దించిన పోలీసులు.. మృతదేహాన్ని (Dead Body) పోస్ట్‌మార్టమ్ నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనకు సంబంధించి పరిణీత భర్త పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఇందుకు సంబంధించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టుగా పోలీసులు తెలిపారు. ఆత్మహత్యకు కారణాన్ని తెలుసుకోవడానికి అన్ని కోణాల్లో విచారణ జరుపుతున్నట్టుగా చెప్పారు.

Married Woman: పెళ్లి జరిగిన 10 రోజులకు యువతికి ఊహించని షాక్.. అత్తకు ఆ విషయం చెబితే..


ఈ ఘటనకు సంబంధించి పరిణీతి తండ్రి న్యూస్ 18 గుజరాతీతో మాట్లాడుతూ.. ‘నా కూతురుకు హితేష్‌తో రెడేళ్ల క్రితం వివాహం జరిగింది. ఈ ఘటనకు 15 నిమిషాల ముందు నా కూతురు ఫోన్ చేసింది. నన్ను, నా భార్యను ఇంటికి రమ్మని చెప్పింది. దీంతో వెంటనే మేము అక్కడికి బయలుదేరాం. అయితే బయలుదేరిన కొద్దిసేపటికే మా అల్లుడు.. ఫోన్ మా కూతురు ఆత్మహత్య చేసుకున్నట్టుగా చెప్పాడు. మేము కూతురి అత్తవారింటికి చేరేసరికి అక్కడ మాకు కూతురి మృతదేహం కనిపించింది’అని చెప్పారు.

Shocking: అతనికి భార్య, ఇద్దరు కొడుకులు.. పక్క ఊరి మహిళతో ఎఫైర్.. ఆమె కోసం అన్ని చేస్తుంటే..

ఈ ఘటనకు సంబంధిచి పరిణీతి భర్త హితేష్ మీడియాతో మాట్లాడుతూ.. ‘నాకు నా భార్యకు మధ్య ఎలాంటి గొడవలు జరగలేదు. నేను బయటి నుంచి ఇంటికి వచ్చేసరికి.. నా భర్య మృతిచెంది కనిపించింది. మాకు పిల్లలు లేరు. నా భార్య ఎందుకు ఇలా చేసిందో నాకు తెలియదు’అని తెలిపాడు. ఇక, ఈ ఘటనపై దర్యాప్తు చేపట్టిన రాజ్‌కోట్ రూరల్ పోలీసులు.. ఆమె ఆత్మహత్య చేసుకుందా..?, లేక ఆమెను ఎవరైనా అలా చేసుకోవడానికి ప్రేరేపించారా..? అనే విషయాలను ఆరా తీస్తున్నట్టుగా చెప్పారు.

First published:

Tags: Crime news, Gujarat, Suicide

ఉత్తమ కథలు