మహిళకు లైంగిక వేధింపులు... స్నానం చేస్తుండగా వీడియో తీసి...

వివాహితను కొంతకాలంగా ఓ యువకుడు వేధింపులకు గురి చేశాడు. దీంతో ఆమె ఆత్మహత్యకు పాల్పడింది.

news18-telugu
Updated: May 23, 2020, 9:55 PM IST
మహిళకు లైంగిక వేధింపులు... స్నానం చేస్తుండగా వీడియో తీసి...
ప్రతీకాత్మకచిత్రం
  • Share this:
లైంగిక వేధింపులకు ఓ వివాహిత బలైంది. ఈ ఘటన భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో చోటు చేసుకుంది. పాల్వంచ మున్సిపాలిటీ పరిధిలోని కరకవాగు గేట్‌ తండాకు చెందిన పోలూరి రాజేశ్వరి అనే వివాహిత స్నానంచేస్తుండగా అదే ప్రాంతానికి చెందిన బానోత్‌ మధు అనే యువకుడు వీడియో తీశాడు. ఆ వీడియో చూపించి ఆమెను గత కొంతకాలంగా లైంగిక వేధింపులకు గురి చేస్తున్నాడు. విషయం ఎవరికీ చెప్పుకోలేక ఆ మహిళ తీవ్ర మనోవేదనకు గురైంది. ఏం చేయాలో అర్థంకాక పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. వెంటనే ఆమెను కొత్తగూడెం ఏరియా హాస్పిటల్‌కు తరలించినా ప్రయోజనం లేకపోయింది. అక్కడ చికిత్స పొందుతూ రాజేశ్వరి మరణించింది. మృతురాలి భర్త ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు విచారణ చేపట్టారు.



First published: May 23, 2020
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు
corona virus btn
corona virus btn
Loading