హోమ్ /వార్తలు /క్రైమ్ /

Married Woman: భర్త గురించి పచ్చి నిజం తెలిసి గుండె పగిలినంత పనయింది.. చివరకు ఏం జరిగిందంటే..

Married Woman: భర్త గురించి పచ్చి నిజం తెలిసి గుండె పగిలినంత పనయింది.. చివరకు ఏం జరిగిందంటే..

ప్రియాంక (ఫైల్ ఫొటో)

ప్రియాంక (ఫైల్ ఫొటో)

ఉత్తరప్రదేశ్‌లోని సంత్ కబీర్‌నగర్ జిల్లాలో జరిగిన ఓ ఘటన స్థానికంగా కలకలం రేపింది. అత్తింట్లో వేధింపులు పెరిగిపోవడం, ఆమె భర్త మరో పెళ్లి చేసుకోవడంతో తీవ్ర మనస్తాపం చెందిన వివాహిత తన పుట్టింటికి వెళ్లి ఆత్మహత్యకు పాల్పడింది. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళితే.. మహౌళి ప్రాంతంలోని ఖిరియా గ్రామానికి చెందిన పరమేశ్వర్ పాతక్ కుమార్తె ప్రియాంక.

ఇంకా చదవండి ...

సంత్ కబీర్‌నగర్: ఉత్తరప్రదేశ్‌లోని సంత్ కబీర్‌నగర్ జిల్లాలో జరిగిన ఓ ఘటన స్థానికంగా కలకలం రేపింది. అత్తింట్లో వేధింపులు పెరిగిపోవడం, ఆమె భర్త మరో పెళ్లి చేసుకోవడంతో తీవ్ర మనస్తాపం చెందిన వివాహిత తన పుట్టింటికి వెళ్లి ఆత్మహత్యకు పాల్పడింది. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళితే.. మహౌళి ప్రాంతంలోని ఖిరియా గ్రామానికి చెందిన పరమేశ్వర్ పాతక్ కుమార్తె ప్రియాంక. ఆమెకు నవంబర్ 28, 2019న రామానంద్‌ కుమారుడైన సుధీర్ త్రిపాఠితో వివాహం జరిగింది. ఇటీవల పుట్టింటికొచ్చిన ప్రియాంక శనివారం ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. పోలీసులు స్పాట్‌కు చేరుకుని కేసు విచారణ ప్రారంభించారు. విచారణలో కొన్ని కీలక విషయాలు వెలుగుచూశాయి. పెళ్లయిన కొన్నాళ్లు ప్రియాంకతో ఆమె భర్త సుధీర్ అన్యోన్యంగానే ఉన్నాడు. ఇద్దరూ కలిసి ముంబైలో కాపురం పెట్టారు.

సుధీర్ తల్లిదండ్రులు కూడా వాళ్లతో పాటే ఉండేవారు. ఇటీవల సుధీర్ గురించి ప్రియాంకకు ఓ పచ్చి నిజం తెలిసింది. ఆమె భర్త పాయల్ అనే యువతిని రెండో పెళ్లి చేసుకున్నాడని తెలిసి ఆమెకు గుండె పగిలినంత పనయింది. ఈ విషయంలో భార్యాభర్తల మధ్య కొన్ని రోజులుగా గొడవలు జరుగుతున్నాయి. భర్త చేసిన పనిని తట్టుకోలేక ప్రియాంక కుమిలిపోయింది. దాదాపు సంవత్సరం నుంచి ఈ విషయంలో ప్రియాంక, సుధీర్ మధ్య గొడవలు జరుగుతూనే ఉన్నాయి. భర్త వైఖరితో విసిగిపోయిన ప్రియాంక ఇటీవల పుట్టింటికి వెళ్లిపోయింది. కొన్నిరోజులుగా అక్కడే ఉంటోంది. ప్రియాంక, సుధీర్‌కు ఒక పాప కూడా ఉన్నట్లు విచారణలో తేలింది. అత్తింట్లో వేధింపులు, భర్త రెండో పెళ్లి చేసుకుని మోసం చేయడంతో ప్రియాంక ఆ పాపతో సహా పుట్టింటికి వచ్చి ఉంటోంది. కానీ.. భర్తకు దూరమైన ఆమె పుట్టింట్లో సంతోషంగా లేదు.

ఇది కూడా చదవండి: Shameful Incident: 44 ఏళ్ల వయసులో ఫేస్‌బుక్ ఓపెన్ చేసి ఇదేం పని.. భర్తకు విడాకులిచ్చిన 53 ఏళ్ల మహిళను నమ్మించి...

ఎప్పుడూ ముభావంగా ఉండేదని, అవన్నీ మర్చిపోయి జీవితంలో ముందుకు సాగాలని ధైర్యం చెప్పామని ఆమె పుట్టింటి వారు చెప్పారు. తన జీవితంలో జరిగిన పరిణామాలతో తీవ్ర మనస్తాపం చెందిన ప్రియాంక ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. ఆమె కుటుంబం బయటకు వెళ్లి వచ్చేసరికి ఘోరం జరిగిపోయింది. ఆమెను ఆసుపత్రికి తరలించినప్పటికీ అప్పటికే ఆమె చనిపోయిందని వైద్యులు తెలిపారు. ప్రియాంక తీసుకున్న ఈ నిర్ణయం వల్ల పది నెలల పాప ఊహ తెలియని వయసులోనే తల్లిని కోల్పోయింది. ఈ ఘటన గురించి సమాచారం అందుకున్న పోలీసులు స్పాట్‌కు చేరుకుని ప్రియాంక మృతదేహాన్ని పోస్ట్‌మార్టానికి తరలించారు. ఆమె భర్త సుధీర్‌పై పోలీసులు కేసు నమోదు చేశారు.

First published:

Tags: Crime news, Married women, Suicide, Uttar pradesh, Wife suicide

ఉత్తమ కథలు