'హెన్నా' చిచ్చు.. భర్త మాటలకు నొచ్చుకుని భార్య ఆత్మహత్య..

భర్త మాటలకు తీవ్ర మనస్తాపానికి గురైన సమీనా ఇంట్లోకి వెళ్లి ఒంటిపై కిరోసిన్ పోసుకుని నిప్పంటించుకుంది. చుట్టుపక్కలవారు ఆమె అరుపులకు పరిగెత్తుకొచ్చి మంటలు ఆర్పారు.

news18-telugu
Updated: July 11, 2019, 1:49 PM IST
'హెన్నా' చిచ్చు.. భర్త మాటలకు నొచ్చుకుని భార్య ఆత్మహత్య..
ప్రతీకాత్మక చిత్రం
  • Share this:
హైదరాబాద్‌లోని చిలకలగూడలో దారుణం జరిగింది. తలకు హెన్నా పెట్టుకునేటప్పుడు భర్తతో జరిగిన చిన్న వాగ్వాదంతో.. తీవ్ర మనస్తాపానికి గురై ఓ మహిళ ఆత్మహత్యకు పాల్పడింది.ఒంటిపై కిరోసిన్ పోసుకుని నిప్పంటించుకుంది. ప్రస్తుతం 90శాతం కాలిన గాయాలతో గాంధీ ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది. ఆమె పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు తెలిపారు.

వివరాల్లోకి వెళ్తే.. వరంగల్ కాజీపేటకు చెందిన షేక్ ఒమర్-సమీనా దంపతులు ఏడాది క్రితం బతుకుదెరువు కోసం హైదరాబాద్ వచ్చి స్థిరపడ్డారు. చిలకలగూడలోని చింతబావి ప్రాంతంలో నివాసం ఉంటున్నారు. వీరికి నలుగురు పిల్లలు. ఇదే క్రమంలో ఈ నెల 8న సమీనా తన జుట్టుకు హెన్నా పెట్టుకుంటుండగా.. భర్త ఒమర్ ఆమె నొచ్చుకునేలా మాట్లాడాడు.నలుగురు పిల్లలున్నారు.. ఇప్పుడు నువ్వు హెన్నా పెట్టుకోవడం అవసరమా? అన్నాడు. దీంతో ఇద్దరి మధ్య మాటా మాటా పెరిగి తీవ్ర వాగ్వాదం జరిగింది.భర్త మాటలకు తీవ్ర మనస్తాపానికి గురైన సమీనా ఇంట్లోకి వెళ్లి ఒంటిపై కిరోసిన్ పోసుకుని నిప్పంటించుకుంది. చుట్టుపక్కలవారు ఆమె అరుపులకు పరిగెత్తుకొచ్చి మంటలు ఆర్పారు.అనంతరం హుటాహుటిన గాంధీ ఆస్పత్రికి తరలించారు. సమీనా శరీరం 90శాతం కాలిపోయిందని వైద్యులు తెలిపారు. ఆమె పరిస్థితి విషమంగా ఉందన్నారు. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.

First published: July 11, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు
?>