కోర్కె తీర్చాలని వేధింపులు.. బలైపోయిన బ్యూటీషియన్..

లీలావతిపై ఆమె మేనమామ కన్ను పడింది. ఎన్నాళ్లని ఒంటరిగా ఉంటావంటూ తన పట్ల అతను దురుసుగా ప్రవర్తించేవాడు. అతనితో సంబంధానికి ఒప్పుకోని కారణంగా చంపేస్తానని బెదిరించాడు. ఈ వేధింపులు ఇలా సాగుతుండగానే..

news18-telugu
Updated: October 16, 2019, 3:54 PM IST
కోర్కె తీర్చాలని వేధింపులు.. బలైపోయిన బ్యూటీషియన్..
ప్రతీకాత్మక చిత్రం
  • Share this:
ఆమె ఓ ఒంటరి స్త్రీ. పెళ్లయిన కొన్నాళ్లకే భర్తతో విభేదాల కారణంగా విడిపోయింది. అప్పటినుంచి ఒంటరిగానే ఉంటూ బ్యూటీ పార్లర్ నిర్వహిస్తోంది. ఇటీవల ఓ ఈవెంట్‌కు మేకప్ ఆర్టిస్ట్‌గా వెళ్లిన ఆమెకు చేదు అనుభవం ఎదురైంది. నిర్వాహకుడు ఆమెను బెదిరించి అసభ్యకరంగా ఫోటోలు తీశాడు. అప్పటినుంచి ఆ ఫోటోలు చూపిస్తూ బ్లాక్‌మెయిల్ చేస్తున్నాడు. తన కోర్కె తీర్చకపోతే సోషల్ మీడియాలో పెడుతానని వేధిస్తున్నాడు.వేధింపులు తాళలేక ఆమె ఆత్మహత్య చేసుకోవడంతో విషయం వెలుగులోకి వచ్చింది.

పోలీసుల కథనం ప్రకారం.. తూర్పుగోదావరి జిల్లా కోరంగి మండలం వెంకటాయపాలెంకు చెందిన లీలావతికి పదేళ్ల క్రితం కాకినాడ సమీపంలోని ఏటి మొగకు చెందిన వీరబాబుతో వివాహమైంది. వీరికి ముగ్గురు సంతానం. అయితే పిల్లలు పెద్దవుతున్నకొద్ది వీరి మధ్య గ్యాప్ పెరుగుతూ వచ్చింది. తరుచూ గొడవలు మొదలయ్యాయి. దాంతో భర్త వీరబాబు వేధింపులు తాళలేక వైజాగ్ వెళ్లిపోయింది.
అక్కడే బ్యూటీ పార్లర్ నిర్వహిస్తూ జీవనం సాగిస్తోంది.

ఇదే క్రమంలో లీలావతిపై ఆమె మేనమామ కన్ను పడింది. ఎన్నాళ్లని ఒంటరిగా ఉంటావంటూ తన పట్ల అతను దురుసుగా ప్రవర్తించేవాడు. అతనితో సంబంధానికి ఒప్పుకోని కారణంగా చంపేస్తానని బెదిరించాడు. ఈ వేధింపులు ఇలా సాగుతుండగానే.. ఇటీవల వడిసెల సంతోష్ కుమార్ అనే వ్యక్తి ఫోన్ చేశాడు.తమ ఈవెంట్‌కు హాజరయ్యే యువతులకు మేకప్ వేయాలని చెప్పాడు. ఈవెంట్ అనకాపల్లిలో ఉండటంతో సంతోష్ కుమార్‌తో పాటు ఆమె కూడా అక్కడికి వెళ్లింది. తీరా అక్కడికెళ్లాక.. ఆమెను బెదిరించి అతను అసభ్యకరంగా ఫోటోలు తీశాడు.కోర్కె తీర్చకపోతే ఫోటోలు బయటపెడుతానని బ్లాక్‌మెయిల్ చేయడం మొదలుపెట్టాడు. దీంతో అనకాపల్లి నుంచి ఇంటికొచ్చాక.. చీరతో ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. లీలావతి మృతిపై ఆమె తల్లి పోలీసులకు ఫిర్యాదు చేయడంతో.. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.
First published: October 16, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు
?>